OTT Releases August 2026 : ఓటీటీ ప్రియులకు ఆగస్టు నెల ఓ పెద్ద పండగలా మారబోతోంది. థియేటర్లలో సందడి చేసిన కొన్ని క్రేజీ సినిమాలు ఓటీటీలోకి వస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న పలు వెబ్ సిరీస్‌లు కొత్త సీజన్‌లతో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. యాక్షన్, రొమాన్స్, వార్ డ్రామా, క్రైమ్ థ్రిల్లర్, స్పోర్ట్స్, డాక్యుమెంటరీలు… ఇలా దాదాపు ప్రతి జానర్‌కు చెందిన కంటెంట్ ఈ నెలలో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా Netflix, Amazon Prime Video, JioHotstar, Apple TV+ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు భారీ లైనప్‌ను సిద్ధం చేశాయి. దీంతో ప్రేక్షకులకు ఈ నెల మొత్తం ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. మరి ఆగస్టులో ఏ సినిమా ఎప్పుడు వస్తోంది ? ఏ వెబ్ సిరీస్ కొత్త సీజన్‌తో రాబోతోంది ? ఒకసారి చూసేద్దాం.
దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న Ted Lasso Season 4 ఆగస్టు 5 నుంచి యాపిల్ టీవిలో స్ట్రీమింగ్ కానుంది. ఈసారి టెడ్ మహిళల ఫుట్‌బాల్ జట్టుకు కోచ్‌గా కనిపించనున్నాడు. ప్రతి బుధవారం కొత్త ఎపిసోడ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
ఆగస్టు 7న నెట్ ఫ్లిక్స్ లో ప్రేక్షకుల కోసం రెండు పెద్ద రిలీజ్‌లు సిద్ధంగా ఉన్నాయి. ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా Main Waapas Aaonga డిజిటల్ ప్రీమియర్ కానుండగా, అదే రోజున కార్గిల్ యుద్ధం నేపథ్యంలో రూపొందిన Operation Safed Sagar వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ ప్రారంభం కానుంది. సిద్ధార్థ్, జిమ్మీ షేర్‌గిల్, అభయ్ వర్మ, దియా మీర్జా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ లో భారత వైమానిక దళం వీరోచిత గాథను చూపించనున్నారు.
యాక్షన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న Reacher Season 4 ఆగస్టు 12 నుంచి ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. లీ చైల్డ్ రచించిన Gone Tomorrow నవల ఆధారంగా ఈ సీజన్ రూపొందింది.
నెట్ ఫ్లిక్స్ లో One Hundred Years of Solitude Part 2 స్ట్రీమింగ్ కానుండగా, ఆగస్టు 14న షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న నటించిన Cocktail 2 డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుంది. అదే రోజు Don’t Say Good Luck కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది.
డీసీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న Lanterns వెబ్ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. గ్రీన్ లాంతెర్న్ విశ్వాన్ని క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కోణంలో చూపించే ఈ సిరీస్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.
నెట్ ఫ్లిక్స్ లో Outer Banks Season 5 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇది ఈ సిరీస్‌కు చివరి సీజన్ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మల్టీస్టారర్ కామెడీ Welcome to the Jungle హాట్ స్టార్ లో విడుదల కానుంది.
Also Read : కేర్ టేకర్ గా వచ్చి కిల్లింగ్ పనులు… తెలుగులోనే ఈ మోస్ట్ అవైటింగ్ మలయాళం థ్రిల్లర్ స్ట్రీమింగ్
రెజ్లింగ్ అభిమానులకు శుభవార్త. WWE Summer Slam 2026 ఆగస్టు 2 నుంచి నెట్ ఫ్లిక్స్ లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. రోమన్ రీన్స్, సేథ్ రోలిన్స్, బ్రోక్ లెస్నర్, సీఎం పంక్, కోడీ రోడ్స్ వంటి స్టార్ రెజ్లర్ల మ్యాచ్‌లు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఆగస్టు 11న ఫుట్‌బాల్ దిగ్గజ కోచ్ జోసే ‘మౌరిన్హో’ జీవితంపై రూపొందిన డాక్యుమెంటరీ విడుదల కానుండగా, ఆగస్టు 13న ‘ఎ చైల్డ్ ఆఫ్ మై ఓన్’, ఆగస్టు 18న యాక్షన్ సిరీస్ ‘సీల్ టీం’ కూడా స్ట్రీమింగ్ కానున్నాయి.
ఆగస్టు 2026లో ఓటీటీ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ ఉండదనే చెప్పాలి. ఒక్క నెట్‌ఫ్లిక్స్ లోనే సినిమాలు, వెబ్ సిరీస్‌లు, డాక్యుమెంటరీలు, స్పోర్ట్స్ ఈవెంట్లతో భారీ లైనప్‌ను తీసుకొస్తుండగా, ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ కూడా తమ క్రేజీ రిలీజ్‌లతో పోటీ పడుతున్నాయి. యాక్షన్ నుంచి రొమాన్స్ వరకు, వార్ డ్రామా నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వరకు… ఈ నెలలో నచ్చిన జానర్ లో సినిమాలు, సిరీస్ లు చూడవచ్చు.