OTT Movie : ఓటీటీలో హాలీవుడ్ హారర్ సినిమాలను ఫాలో అయ్యేవాళ్ళు ఎక్కువగానే ఉన్నారు. ఇవి తెలుగులో కూడా డబ్ అవుతుండటంతో మరింత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా చాలా డిఫరెంట్ కంటెంట్ తో వచ్చింది. భూమి మీద కొద్ది మనుషులు మిగిలితే ఎలా ఉంటుందో ఇందులో చూపించారు. ఈ సినిమాలో మాటలు ఎక్కువగా ఉండవు. అయితేనేం స్టోరీ నడిచే క్రమంలో గూస్ బంప్స్ వస్తుంటాయి. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
భూమిపై జరిగిన ఒక విపత్తు కారణంగా మనుషులు చాలా వరకు అంతరించిపోతారు. మిగిలిన మానవులు ఆక్కడ క్కడా ఒక సమూహంగా బ్రతుకుతూ ఉంటారు. మరోవైపు అజ్రాయెల్ ఆమె ప్రేమికుడు కెనన్ ఒక అటవీ ప్రాంతంలో, ఒక మతోన్మాద కల్ట్ చేతుల్లో చిక్కుకుంటారు. ఈ కల్ట్‌లోని సభ్యులు మాట్లాడటం పాపంగా భావించి, తమ స్వరపేటికలను తొలగించుకుంటారు. దీని వల్ల వాళ్ళు మూగవారుగా మారుతారు. వీళ్ళు కఠినమైన నియమాలు పాటిస్తుంటారు. అజ్రాయెల్, కెనన్‌లను ఈ కల్ట్ నాయకురాలు జోసెఫిన్ తో పాటు ఆమె అనుచరులు పట్టుకుంటారు. వీళ్ళను తప్పించుకోకుండా వేరు చేసి బంధిస్తారు. అజ్రాయెల్‌ను మనుషులను తినే క్రియేచర్స్ కి బలి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. ఒక పురాతన దుష్ట శక్తిని శాంతపరచడానికి ఆచారంలో భాగంగా వీళ్ళు ఇలా చేస్తుంటారు.
అయితే ఈ క్రమంలో అజ్రాయెల్ ఒక కల్ట్ సభ్యుడిని చంపి, తప్పించుకుని తన ప్రియుడి కోసం వెతుకుతుంది. అయితే ఆమె ఎంత వెతికినా ప్రియుడు మాత్రం కనిపించకుండా పోతాడు. ఒక చోట అతని ఆనవాళ్ళు మాత్రమే దొరుకుతాయి. ఇక అజ్రాయెల్ దీనికి ప్రతీకారం తీర్చుకోవడానికి మళ్ళీ అక్కడికి వస్తుంది. వాళ్ళను అంతం చేయాలని చూస్తుంది. చివరికి ఆ కల్ట్ మీద అజ్రాయెల్ ప్రతీకారం తీర్చుకుంటుందా ? ఆమెను క్రియేచర్లకు బలి ఇస్తారా ? అజ్రాయెల్ ప్రియుడు క్రియేచర్లకి బలి అవుతాడా ? కల్ట్ నాయకురాలు జోసెఫిన్ ను అజ్రాయెల్ ఏం చేస్తుంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ అమెరికన్ యాక్షన్ హారర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : అమ్మాయిల్ని ఆ పని చేసి మరీ చంపే కిల్లర్… వాడికి చుక్కలు చూపించే కళ్ళు కనిపించని హీరో
జియో హాట్ స్టార్ (Jio Hot Star) లో
ఈ అమెరికన్ యాక్షన్ హారర్ మూవీ పేరు ‘అజ్రాయెల్’ (Azreal). 2024 లో వచ్చిన ఈ మూవీకి ఇ.ఎల్. కాట్జ్ దర్శకత్వం వహించారు. ఇందులో సమారా వీవింగ్, విక్ కార్మెన్ సోన్నె, నాథన్ స్టీవర్ట్-జారెట్ నటించారు. మాట్లాడటం పాపంగా భావించబడే ఒక ప్రదేశంలో ఈ స్టోరీ జరుగుతుంది. ఈ సినిమాలో దాదాపు డైలాగ్‌లు ఉండవు. కథను చూపించడం ద్వారా చెప్పడం జరుగుతుంది. ఈ మూవీ జియో హాట్ స్టార్ (Jio Hot Star), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లలో స్ట్రీమింగ్ అవుతోంది.