Kakani Govardhan Reddy: ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు కాకాణిని కేరళలో అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా నిబంధనలకు విరుద్ధంగా పొదలకూరు పోలీస్ స్టేషన్ లో ఆయనపై ఫిబ్రవరిలో కేసు నమోదు అయ్యింది.
అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్దన్ రెడ్డి ఏ4గా ఉన్నారు. పోలీసుల విచారణకు హాజరు కాకుండా గత రెండు నెలల నుంచి ఆయన పరారీలో ఉన్నారు. కాకాణి గత వైసీీపీ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. అక్రమ మైనింగ్ కేసులో విచారణకు రావాలంటూ ఇప్పటికే పోలీసులు 3 సార్లు నోటీసులు పంపిన విషయం తెలిసిందే. నోటీసులకు స్పందించకపోవడంతోనే ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ALSO READ: Rain Alert: రాష్ట్రానికి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం