NBK Unstoppable With Balayya : నందమూరి బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షో మూడు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ షోలో బాలయ్య అడిగే ప్రశ్నలు సెలెబ్రేటిలను కొన్ని సార్లు ఇరకాటంలో పడేస్తాయి. అందుకే ఈ షో పై జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. గత మూడు సీజన్లు ఒక ఎత్తు ఇప్పుడు నాలుగో సీజన్ మొదలైంది. ఏపీ సీఏం చంద్రబాబు రాకతో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యింది. ఆ ఎపిసోడ్ కు ఎంత క్రేజ్ వచ్చిందో చూసాం.. ఆ తర్వాత వచ్చిన అల్లు అర్జున్ రెండు ఎపిసోడ్ లకు టాప్ రేటింగ్ ను అందుకున్నాయి. ఆయన ఎన్నో విషయాలకు క్లారిటీ ఇచ్చారు. ఆ ఎపిసోడ్ కూడా బాగా వైరల్ అయ్యింది. ఇక రీసెంట్ గా డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల, నవీన్ పోలిశెట్టి ఈ షోకు వచ్చి సందడి చేశారు. ఆ ఎపిసోడ్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. అందులో రష్మికను తెగ ఆడేసుకుంటాడు బాలయ్య. అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది..
ఇప్పుడు శ్రీలీల, నవీన్ పొలిశెట్టితో బాలయ్య సందడి చేశాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో శ్రీలీల మీద నవీన్ పొలిశెట్టి వేసిన కౌంటర్లు, బాలయ్య ఇచ్చిన సెటైర్లు, కలిసి ఆడిన ఆటలు వైరల్ అవుతున్నాయి. ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయ్యింది బాలయ్య నవీన్ కలిసి శ్రీలీలను మాట్లాడనివ్వకుండా చేశారు. ఆ ప్రోమో ఎంత సరదాగా సందడిగా సాగిందో చెప్పానక్కర్లేదు..శ్రీలీల వీణతో కనిపించడంతో.. కుర్చీ మడతపెట్టి లాంటి మాస్ పాటను క్లాసిక్‌గా మార్చి పాడమని నవీన్ పొలిశెట్టి టాస్క్ ఇచ్చాడు. ఇక అలా నవీన్ ఆ పాటని క్లాసిక్ వే లో పాడుతుంటే శ్రీలీల నవ్వేసింది.. అంతేకాదు నవీన్ పొలిశెట్టి తనకు జరిగిన ఫన్నీ ఎక్స్ పీరియెన్స్ గురించి చెప్పాడు. శ్రీలీల పాత ఫోటోలను వేసి చూపించినట్టుగా కనిపిస్తోంది. అవి నా ఓనీల ఫంక్షన్ ఫోటోలు అండి అంటూ శ్రీలీల కాస్త ఇబ్బంది పడుతూ నవ్వేసింది.. బాలయ్య అడిగే చిలిపి ప్రశ్నలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆ ఎపిసోడ్ డిసెంబర్ 6 న ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే ఈ ఎపిసోడ్ లో రష్మికను బాలయ్య ఆట పట్టించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఆ వీడియోలో ఏముందంటే.. ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలని బాలయ్య కొరతాడు. అందులో బజర్ కూడా ఉంటుంది. అయితే అందులో పుష్ప గురించి ఒక ప్రశ్న వస్తుంది.. దానికి ఆన్సర్ నా సామి పాట.. దాని స్టెప్ ఇదే కదా అని అంటాడు నవీన్ పోలిశెట్టి. సరేగాని ఆ స్టెప్ ఏంటో వేసి చూపించు అనేసి బాలయ్య అంటాడు . నవీన్ స్టెప్ వేసి చూపిస్తాడు. శ్రీలీల అలా కాదు అనేసి అనగానే నువ్వేసి చూపించు అని బాలయ్య అంటాడు. శ్రీలీల పాటకు డాన్స్ స్టెప్ వేసి చూపిస్తుంది.. ఇక ఒక ప్రశ్న గురించి మాట్లాడుతూ మధ్యలో రష్మికకు ఫోన్ చేసి అడిగినట్లు అడుగుతుంది శ్రీ లీల. రష్మిక అని పేరు వినగానే బాలయ్య మొహం లో ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఆ ఫోన్ నా దగ్గర పెట్టమ్మా నా చెవి దగ్గర పెట్టు అనేసి బాలయ్య అడుగుతాడు. శ్రీ లీలా చేయాలా పెట్టగానే హలో రష్మిగా ఐ యాం ఫైన్ ఫైన్. ఇంతకీ ఆ కుర్రాడు ఎలా ఉన్నాడు బాగానే ఉన్నాడా? బాగా చూసుకో అనేసి అంటాడు. ఫోన్ పెట్టేసి ఈ ఫోటో గురించి చెప్పు అని అంటాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. లైవ్లో రష్మికని గాలి తీసేసాడుగా బాలయ్య అంటూ నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు..
Adiganani cheppu kurradini 🫣🤣
Watch #UnstoppableS4 episode 6 now on #aha▶️https://t.co/4ahfOpYhoQ…#UnstoppableWithNBK #naveenpolishetty @sreeleela14 @NaveenPolishety pic.twitter.com/UV8HYTSq8Q
— Nandamuri Balakrishna (@BalayyaOfficial) December 11, 2024