E-Paper
Advertisement

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్
Advertisement

Supernatural Thriller Series OTT : సముద్రం మీదే జీవనం సాగించే ఓ చిన్న తీరప్రాంతం. చేపల వేట తగ్గిపోవడంతో అక్కడి ప్రజల జీవితం ఇప్పటికే కష్టాల్లో ఉంటుంది. అలాంటి సమయంలో సముద్రం అడుగు నుంచి ఓ మిస్టరీ జీవి బయటకు వచ్చి ఆ ఊరిని వణికిస్తుంది. దీంతో తన కుటుంబాన్ని, తన ఊరిని కాపాడుకోవడానికి ఓ మత్స్యకారుడు సముద్రంతోనే పోరాడాల్సి వస్తుంది. భయపెట్టే వాతావరణం, సముద్రపు రహస్యం, కుటుంబ భావోద్వేగాలు కలగలిపిన ఈ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘Below’. మరి ఈ సిరీస్‌ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది? తెలుగులో ఉందా ? అనేది తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

న్యూఫౌండ్‌ల్యాండ్‌లోని స్నూక్స్ ఆర్మ్ అనే చిన్న తీరప్రాంత పట్టణంలో కథ మొదలవుతుంది. ఇక్కడి ప్రజలకు సముద్రం అంటే కేవలం జీవనాధారం కాదు, వాళ్ల జీవితంలో భాగం. ఈ ప్రాంతంలోనే కాల్విన్ పెన్నీ అనే అనుభవజ్ఞుడైన మత్స్యకారుడు తన కుటుంబంతో జీవిస్తుంటాడు. అయితే కాల్విన్ ను సముద్రంలో జరిగిన తన తండ్రి మిస్టీరియస్ మరణం ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.

Advertisement

ఇదిలా ఉంటే ఆ ప్రాంతంలో చేపల వేట పరిస్థితి కూడా క్రమంగా దారుణంగా మారుతుంది. సముద్రం మీద ఆధారపడే కుటుంబాలకు జీవనం కష్టమవుతుంది. పరిస్థితులు ఇలా ఉన్న సమయంలో సముద్రంలో వింత ఘటనలు మొదలవుతాయి. మొదట్లో వాటిని పెద్దగా పట్టించుకోకపోయినా, క్రమంగా ఊర్లోని ప్రజలకు ప్రమాదం దగ్గర పడుతోందని అర్థమవుతుంది. ఒక మిస్టీరియస్ సముద్ర జీవి తీరప్రాంతాన్ని టార్గెట్ చేయడంతో పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి. సముద్రం నుంచి వస్తున్న ఈ ప్రమాదం ఏంటో ఎవరికీ అర్థం కాదు. ఎప్పుడు ఎక్కడ దాడి జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కాల్విన్ మాత్రం తన కుటుంబాన్ని, ముఖ్యంగా తన కుమారుడు వేడ్‌ను కాపాడేందుకు ఏదైనా చేయాలని నిర్ణయించుకుంటాడు.

ఈ క్రమంలో సముద్ర జీవులపై పరిశోధన చేసే ఫొండా అనే మెరైన్ రీసెర్చర్ కూడా రంగంలోకి వస్తుంది. కాల్విన్‌కు సముద్రంపై ఉన్న అనుభవం, ఫొండాకు ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానం కలవడంతో ఇద్దరూ కలిసి ఈ మిస్టరీని ఛేదించే ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్లు వెతుకుతున్న కొద్దీ అక్కడి సముద్రం, పాత కథలు, స్థానిక నమ్మకాలకు సంబంధించిన మరిన్ని విషయాలు బయటపడతాయి.

Advertisement

మరోవైపు కాల్విన్ కుటుంబంలో కూడా సమస్యలు తక్కువగా ఉండవు. కొడుకు వేడ్‌తో అతడి సంబంధం, గతంలో జరిగిన విషాదాలు, ఊరిని ఖాళీ చేయాలా లేదా అక్కడే ఉండి పోరాడాలా అనే నిర్ణయం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. అసలు సముద్రం అడుగున దాగి ఉన్న ఆ జీవి ఎక్కడి నుంచి వచ్చింది ? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి ? కాల్విన్ తన ఊరిని ఆ ప్రమాదం నుంచి కాపాడగలిగాడా ? అన్నది తెలుసుకోవాలంటే ‘బిలో’ సిరీస్ ను చూడాల్సిందే.

Also Read : యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

తెలుగులో స్ట్రీమింగ్ అవుతుందా ?

ఆరు ఎపిసోడ్లతో రూపొందిన సూపర్‌నేచురల్ థ్రిల్లర్ సిరీస్ ‘బిలో’. జెస్సీ మెక్‌కియోన్ క్రియేట్ చేసిన ఈ సిరీస్‌కు వివిధ ఎపిసోడ్లను జేమీ చైల్డ్స్, హెలెన్ షేవర్, స్టీఫెన్ డన్ దర్శకత్వం వహించారు. జోష్ హార్ట్‌నెట్ కాల్విన్ పెన్నీగా, చార్లీ హీటన్ వేడ్ పెన్నీగా, మెకెంజీ డేవిస్ ఫొండా హోవాండర్‌గా నటించారు. ఈ సిరీస్ 2026 అక్టోబర్ 8న Netflixలో విడుదలైంది. ప్రస్తుతం ఇంగ్షీషు, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.

Tags

Related News

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

చనిపోయిన ప్రతిసారీ మళ్లీ బతుకుతాడు… ఏలియన్స్‌తో యుద్ధం గెలిచే వరకు ఆగని టైమ్ లూప్… మైండ్ బ్లాక్ సై-ఫై మూవీ

అమెజాన్ అడవుల్లో సీక్రెట్ సిటీ… వెతుక్కుంటూ వెళ్లి రాత్రికి రాత్రే గల్లంతైన సైంటిస్ట్… క్లైమాక్స్ ఊహించలేరు

Big Stories

Advertisement
×