E-Paper
Advertisement

పైలెట్ కావాల్సిన కుర్రాడు రెడ్ లైట్ ఏరియాలో ప్రేమంటూ… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే

పైలెట్ కావాల్సిన కుర్రాడు రెడ్ లైట్ ఏరియాలో ప్రేమంటూ… ఈ సిరీస్ పెద్దలకు మాత్రమే
Advertisement

Bengali Romantic Crime Drama: చిన్నప్పటి నుంచి పైలట్ కావాలని కలలు కన్న ఓ యువకుడు, చివరికి అదే ప్రపంచంలో మనుషులను అమ్మే వ్యక్తిగా మారితే ఎలా ఉంటుంది ? తన కళ్లముందే తల్లి దారుణంగా చనిపోవడం, ఆ తర్వాత సోనాగచ్చి చీకటి ప్రపంచంలోకి అడుగు పెట్టడం, అక్కడే ఊహించని ప్రేమను కలుసుకోవడం చుట్టూ సాగే బెంగాలీ రొమాంటిక్ క్రైమ్ డ్రామా సిరీస్ ‘మొంటు పైలట్’ (Montu Pilot). మరి ఈ ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ఏ ఓటీటీలో చూడవచ్చు ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

మొంటుకు చిన్నప్పటి నుంచే విమానాలు, ఆకాశం అంటే ఎంతో ఇష్టం. పెద్దయ్యాక ఎలాగైనా పైలట్ కావాలని కలలు కంటాడు. కానీ అతని కుటుంబ పరిస్థితులు ఆ కలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటాయి. అతని తల్లి సోనాగచ్చి రెడ్ లైట్ ఏరియాలో బలవంతంగా చేయకూడని పనులు చేయాల్సి వస్తుంది. తన తల్లిని ఆ నరకం నుంచి బయటకు తీసుకురావాలని మొంటు ప్రయత్నిస్తాడు. అయితే ఆ ప్రయత్నమే అతని జీవితాన్ని విషాదంగా మార్చేస్తుంది.

Advertisement

తన తల్లిని కాపాడుకోలేకపోయిన మొంటు, ఆమెను కోల్పోయిన తర్వాత పూర్తిగా మారిపోతాడు. చిన్నప్పటి కలలు, భావోద్వేగాలు అన్నింటినీ పక్కన పెట్టి అదే చీకటి ప్రపంచంలోకి అడుగు పెడతాడు. పెద్దయ్యే సమయానికి మొంటు పైలట్ కాలేకపోయినా, సోనాగచ్చిలో వేశ్యలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరఫరా చేసే ‘కొరియర్ పైలట్’గా మారతాడు. తనకు ఎదురైన విషాదాల కారణంగా అతని మనసు కఠినంగా మారిపోతుంది.

అక్కడ జరిగే అన్యాయాలను చూస్తున్నా, వాటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ జీవిస్తుంటాడు. అలాంటి సమయంలో అతని జీవితంలోకి భ్రమర్ వస్తుంది. అమాయకమైన భ్రమర్ నమ్మకద్రోహానికి గురై సోనాగచ్చికి బలవంతంగా వస్తుంది. అక్కడి పరిస్థితులను చూసి ఆమె భయంతో వణికిపోతుంది. భ్రమర్ పరిస్థితిని చూసిన మొంటులో మాత్రం ఎన్నాళ్లుగానో చనిపోయిన మానవత్వం మళ్లీ మేల్కొంటుంది.

Advertisement

ఆమెను ఆ నరకం నుంచి బయటకు తీసుకురావాలని మొంటు నిర్ణయించుకుంటాడు. కానీ అది అంత సులభమైన పని కాదు. భ్రమర్‌ను తమ ఆధీనంలో ఉంచుకున్న మాఫియా, అక్కడి పెద్దలతో మొంటు నేరుగా ఢీకొనాల్సి వస్తుంది. ఒకప్పుడు ఆ వ్యవస్థలో భాగమైన మొంటే, ఇప్పుడు అదే వ్యవస్థకు ఎదురు నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. భ్రమర్‌ను కాపాడే ప్రయత్నంలో మొంటు గతం కూడా మళ్లీ అతని ముందుకు వస్తుంది.

తల్లి మరణం, తన బాల్య కలలు, తాను చేసిన తప్పులు అన్నీ అతన్ని వెంటాడుతుంటాయి. భ్రమర్‌పై ఏర్పడిన ప్రేమ అతన్ని పూర్తిగా మార్చేస్తుంది. మొంటు నిజంగా భ్రమర్‌ను ఆ నరకం నుంచి బయటకు తీసుకురాగలిగాడా? మాఫియా నుంచి తప్పించుకుని ఇద్దరూ కొత్త జీవితాన్ని ప్రారంభించగలిగారా? తన తల్లి విషాదానికి కారణమైన ప్రపంచానికే మొంటు ఎలా ఎదురుతిరిగాడు? అనేదే సిరీస్‌లో చూసి తెలుసుకోవలసిన కథ.

పెద్దలకు మాత్రమే

డేబాలోయ్ భట్టాచార్య దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో సౌరవ్ దాస్, సొలంకి రాయ్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సిరీస్ ప్రస్తుతం Hoichoiలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్లు MX Playerలో కూడా అందుబాటులో ఉన్నాయి. బోల్డ్ కంటెంట్, డార్క్ థీమ్స్, వయొలెన్స్ ఉన్నాయి కాబట్టి ఈ సిరీస్ ను చిన్న పిల్లలతో చూడకపోవడమే బెటర్. ఎమోషనల్ లవ్ స్టోరీతో పాటు డార్క్ క్రైమ్ బ్యాక్‌డ్రాప్‌ను ఇష్టపడేవారు ఈ సిరీస్ ను అస్సలు మిస్ అవ్వొద్దు.

Read Also: ఒకరిని ప్రేమించాడు… ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతుండగా షాకింగ్ ట్విస్ట్… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ

Tags

Related News

10 ఏళ్లలో 55 బదిలీలు… చివరికి ముఖ్యమంత్రి కుటుంబాన్ని కూడా వదలని కానిస్టేబుల్ కథ

పేదలకు నరకం… ధనవంతులకు స్వర్గం ఈ రైలు… లైఫ్ లో మరచిపోలేని థ్రిల్లిచ్చే సర్వైవల్ థ్రిల్లర్

కబడ్డీ నుంచి క్రైమ్ వరల్డ్‌లోకి… స్పోర్ట్స్ మూవీ కాదు పక్కా రా యాక్షన్ థ్రిల్లర్

కోరుకున్న వాడిని దక్కించుకోవడానికి ఇవేం మెంటల్ పనులు… ‘అబ్సెషన్’ చూసి ఆగమైనోళ్ల కోసమే ఈ థ్రిల్లర్ సిరీస్

పెళ్లి చేసుకుంటే కోటీశ్వరుల జీవితం… కానీ ఈ అమ్మాయి చేసిన పని తెలిస్తే దిమాక్ కరాబ్

తల్లి కావాలనే కోరిక… చివరికి బిడ్డ కోసం ఆమె చేసిన పని తెలిస్తే షాక్

27 ఏళ్లుగా దాచిన నిజం… తల్లి రీఎంట్రీతో కూతురి జీవితంలో ఊహించని ట్విస్ట్

Big Stories

Advertisement
×