E-Paper
Advertisement

ఒకరిని ప్రేమించాడు… ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతుండగా షాకింగ్ ట్విస్ట్… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ

ఒకరిని ప్రేమించాడు… ఇంకొకరిని పెళ్లి చేసుకోబోతుండగా షాకింగ్ ట్విస్ట్… హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ
Advertisement

Romantic Web Series on OTT: పెళ్లికి కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి.. జీవితంలో తనతో కలిసి నడిచే వ్యక్తిని కూడా ఎంచుకున్నాడు. కానీ సరిగ్గా అదే సమయంలో, ఎన్నో ఏళ్ల క్రితం తన జీవితాన్ని వదిలి వెళ్లిన మొదటి ప్రేమ మళ్లీ ఎదురైతే ? మనసులో ఇంకా మిగిలి ఉన్న పాత జ్ఞాపకాలను పక్కన పెట్టి కొత్త బంధాన్ని ఎంచుకోగలమా ? లేక గతంలో అసంపూర్తిగా మిగిలిపోయిన ప్రేమకు మరో అవకాశం ఇవ్వాలనిపిస్తుందా ? ఇలాంటి భావోద్వేగ సంఘర్షణ చుట్టూ సాగే హిందీ రొమాంటిక్ డ్రామా వెబ్ సిరీస్ ‘ముసాఫిర్ కేఫ్’ (Musafir Cafe 2026). ప్రేమ, విడిపోవడం, కొత్త బంధం, గతం మళ్లీ ఎదురుకావడం వంటి సున్నితమైన అంశాలను అందంగా చూపించిన ఈ సిరీస్ ను ఎక్కడ చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

చందర్ జీవితంలోకి సుధా అనుకోకుండా వస్తుంది. మొదట పెళ్లి చూపుల సందర్భంగా పరిచయమైన వీరిద్దరి మధ్య కొంతకాలానికి మంచి అనుబంధం ఏర్పడుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకునే కొద్దీ ఆ పరిచయం ప్రేమగా మారుతుంది. స్వతంత్ర ఆలోచనలు కలిగిన సుధా… చందర్ జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తిగా మారుతుంది. ఇద్దరూ కలిసి తమ భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కంటారు. తమ జీవితాన్ని ఒకే దారిలో ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు. కానీ పరిస్థితులు ఎప్పుడూ మనం అనుకున్నట్టే ఉండవు. కెరీర్, వ్యక్తిగత నిర్ణయాలు, పరిస్థితుల ప్రభావంతో చివరకు చందర్, సుధా విడిపోవాల్సి వస్తుంది.

Advertisement

సుధా దూరమైన తర్వాత చందర్ జీవితంలో ఒక ఖాళీ ఏర్పడుతుంది. గతాన్ని మర్చిపోయి కొత్తగా జీవించాలని ప్రయత్నిస్తున్న సమయంలో అతని జీవితంలోకి ప్రీతి వస్తుంది. చందర్‌కు అండగా నిలుస్తూ, అతని బాధలను అర్థం చేసుకుంటూ ప్రీతి క్రమంగా అతని జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా మారుతుంది. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి ఒక హిల్ స్టేషన్‌లో కేఫ్ నిర్వహిస్తూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతుంటారు. గత ప్రేమను మర్చిపోయి ప్రీతితో కొత్త జీవితాన్ని నిర్మించుకోవచ్చని చందర్ కూడా భావిస్తాడు. ప్రీతి మాత్రం అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తూ, అతని జీవితంలో శాశ్వత భాగస్వామిగా ఉండాలని కోరుకుంటుంది.

అంతా సవ్యంగా సాగుతున్న సమయంలోనే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. ప్రీతితో తన జీవితాన్ని పూర్తిగా పంచుకోవాలని నిర్ణయించుకున్న చందర్… ఆమెకు పెళ్లి ఉంగరం ఇవ్వడానికి సిద్ధమవుతాడు. సరిగ్గా అదే సమయంలో ఎన్నో సంవత్సరాలుగా కనిపించకుండా పోయిన సుధా మళ్లీ అతని జీవితంలోకి అడుగు పెడుతుంది. ఇన్నాళ్లు గతంగా మిగిలిపోయిందనుకున్న ప్రేమ ఒక్కసారిగా కళ్లముందుకు రావడంతో చందర్ మనసులో సంఘర్షణ మొదలవుతుంది. ఒకవైపు తన కష్టసుఖాల్లో తోడుగా నిలిచిన ప్రీతి… మరోవైపు తన మనసులో ఎప్పుడో చెరిగిపోని స్థానాన్ని సంపాదించుకున్న సుధా. ఇద్దరి మధ్య చందర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో తీవ్రంగా ఆలోచించాల్సి వస్తుంది.

Advertisement

గతాన్ని పూర్తిగా మర్చిపోవడం అంత సులభమేనా ? మొదటి ప్రేమ తిరిగి ఎదురైనప్పుడు ఇప్పుడున్న బంధంపై దాని ప్రభావం ఎంత ఉంటుంది ? చందర్ తన జీవితాన్ని ఎవరితో కొనసాగించాలని నిర్ణయించుకున్నాడు ? సుధాకు తన జీవితంలో మరో అవకాశం ఇస్తాడా ? లేక తనతో కలిసి ఇన్నాళ్లు నడిచిన ప్రీతినే ఎంచుకుంటాడా ? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే.

తెలుగులో చూడొచ్చా ?

భోపాల్ నుంచి ముస్సోరీ కొండల వరకు సాగే ఈ కథలో ప్రేమకు సంబంధించిన భిన్నమైన భావోద్వేగాలను చూపించారు. ఒకప్పుడు మన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి దూరమైన తర్వాత, కొత్త బంధం ఏర్పడినా గతం పూర్తిగా మనసు నుంచి చెరిగిపోతుందా అనే ప్రశ్న ఆలోచింపజేస్తుంది. విక్రాంత్ మాస్సే, వేదికా పింటో, మహిమా మక్వానా, ఆదిల్ హుస్సేన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు రుచిర్ అరుణ్ దర్శకత్వం వహించారు. దివ్య ప్రకాష్ దూబే రాసిన బెస్ట్ సెల్లింగ్ నవల ఆధారంగా రూపొందిన ఈ కథలో ప్రేమతో పాటు బంధాల విలువ, మనసులోని సంఘర్షణలు, జీవితంలో తీసుకునే నిర్ణయాల ప్రభావాన్ని చూపించారు.

పెద్ద యాక్షన్ సన్నివేశాలు, క్రైమ్ ట్విస్టులు ఉండవు. కానీ మనుషుల మధ్య ఉండే భావోద్వేగాలను ఆస్వాదించే వారికి ‘ముసాఫిర్ కేఫ్’ నచ్చే అవకాశం ఉంది. అందమైన హిల్ స్టేషన్ బ్యాక్‌డ్రాప్ కథకు మంచి ఫీల్‌ను ఇస్తుంది. ఈ సిరీస్ ప్రస్తుతం Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. మొత్తం 8 ఎపిసోడ్‌లుగా రూపొందిన ఈ హిందీ రొమాంటిక్ డ్రామాను ఫీల్ గుడ్ డ్రామాను చూడాలి అనుకునే వాళ్ళు డోంట్ మిస్.

Read Also: ఇన్‌స్టాగ్రామ్‌లో హీరో, రియల్ లైఫ్ లో జీరో… ఈ డార్క్ కామెడీ మూవీ చూస్తే షాక్

Tags

Related News

సైకోతో ఇంటర్వ్యూ… ట్విస్టులతో మెంటలెక్కించే సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్

టీవీ రేటింగ్స్ కోసం నేరస్థులను లైవ్‌ లో పట్టుకునే రియాలిటీ షో… హై-టెన్షన్ థ్రిల్లర్

11 ఏళ్ల క్రితం మాయమైన కూతురు… కట్ చేస్తే క్రేజీ ట్విస్ట్… క్లైమాక్స్ లో ఊహించని ట్విస్ట్

శోభనం అయ్యాక మ్యాటర్ లేదంటూ రూమర్స్… పిల్లల్ని కని చూపిస్తే పొలం మొత్తం అతనికే… తెలుగులోనే ఈ ఫ్యామిలీ కామెడీ మూవీ

రాత్రికి రాత్రే పాపులర్… సోషల్ మీడియా స్టార్స్ లైఫ్ ఇంత ఘోరంగా ఉంటుందా ? మస్ట్ వాచ్ మలయాళం థ్రిల్లర్

ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే

ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా

Big Stories

Advertisement
×