E-Paper
Advertisement

సీటు అంచున కూర్చోబెట్టే మోస్ట్ డేంజరస్ సస్పెన్స్ థ్రిల్లర్లు… డోంట్ మిస్

సీటు అంచున కూర్చోబెట్టే మోస్ట్ డేంజరస్ సస్పెన్స్ థ్రిల్లర్లు… డోంట్ మిస్
Advertisement

Best Suspense Thrillers :  సస్పెన్స్, థ్రిల్స్, ట్విస్టులు ఇష్టపడే వారికి నెట్‌ఫ్లిక్స్ ఎప్పుడూ బెస్ట్ డెస్టినేషనే. ఇప్పుడు టాప్ ట్రెండింగ్‌ లో ఉన్న కొన్ని సూపర్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు ఈరోజు మన మూవీ సజెషన్ లో తీసుకొచ్చేశాము. ఈ చిత్రాలు మొదటి నుంచి చివరి వరకు మిమ్మల్ని ఉత్కంఠలో ఉంచి, ప్రతి మలుపులోనూ కొత్త షాక్ ఇస్తాయి. మరి ఆ సినిమాలు ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్తే…

1. జానే జాన్ (Jaane Jaan)

కరీనా కపూర్, జైదీప్ అహ్లావత్, విజయ్ వర్మ నటించిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ 2023లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక హత్య కేసు చుట్టూ తిరుగుతూ, మైండ్ గేమ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కరీనా నటన ఈ సినిమాకు ప్రధాన హైలైట్.

2. దేవా (Deva)

Advertisement

2025లో థియేటర్లలో విడుదలై ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న షాహిద్ కపూర్ చిత్రం ‘దేవా’. ఇందులో షాహిద్ ఒక ధైర్యవంతుడైన పోలీస్ అధికారి పాత్రలో కనిపిస్తాడు. పూజా హెగ్డే, పవైల్ గులాటి కీలక పాత్రల్లో నటించారు. రోషన్ ఆండ్రూస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఒక్క క్షణం కూడా విసుగు రాకుండా ఫాస్ట్ పేస్‌లో సాగుతుంది.

3. హసీన్ దిల్‌రూబా (Haseen Dillruba)

తాప్సీ పన్ను, విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణే నటించిన ఈ సినిమా 2021లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రేక్షకులను అలరించింది. వినీల్ మాథ్యూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతి సన్నివేశంతో కొత్త ట్విస్ట్ ఇస్తూ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. 2024లో వచ్చిన సీక్వెల్ కూడా అంతే ఉత్కంఠభరితంగా ఉంది.

4. దో పట్టి (Do Patti)

Advertisement

కాజోల్, కృతి సనన్ నటించిన ఈ చిత్రం 2024 అక్టోబర్ 25న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై భారీ హిట్ అయింది. కృతి ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాకు శశాంక చతుర్వేది దర్శకత్వం వహించారు. కృతి నిర్మాతగా కూడా పని చేసిన ఈ చిత్రం షహీర్ షేక్ కీలక పాత్రలో మెరిశాడు. సస్పెన్స్ నిండిన కథ మిమ్మల్ని చివరి వరకు ఉత్కంఠలో ముంచెత్తుతుంది.

5. బద్లా (Badla)

అమితాబ్ బచ్చన్, తాప్సీ పన్ను నటించిన ఈ సినిమా థియేటర్లలో విజయం సాధించిన తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమృతా సింగ్ కూడా నటించారు. ఒక్క గదిలో జరిగే సంభాషణలు, ట్విస్టులు మిమ్మల్ని ఆలోచింపజేస్తాయి.

6. ది కిల్లర్ (The Killer)

మైఖేల్ ఫాస్‌బెండర్, టిల్డా స్వింటన్ నటించిన ఈ చిత్రానికి “ఫైట్ క్లబ్”, “గాన్ గర్ల్” వంటి సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించారు. ఒక అసాధారణ హంతకుడి కథను ఉత్కంఠభరితంగా చెప్పిన ఈ సినిమా చివరి వరకు ఇంటెన్స్ గా సాగుతుంది.

7. నౌ యు సీ మీ 2 (Now You See Me 2)

జెస్సీ ఐసెన్‌బర్గ్, మార్క్ రఫెలో, వుడీ హారెల్సన్ నటించిన ఈ మ్యాజిక్ థ్రిల్లర్ 2016లో విడుదలై ఇప్పటికీ నెట్‌ఫ్లిక్స్‌లో పాపులర్‌గా ఉంది. జాన్ ఎం. చూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రతి సన్నివేశంతో ఉత్కంఠ పెంచుతూ మ్యాజిక్, క్రైమ్, యాక్షన్ కలయికగా సాగుతుంది.

Read Also : నిండు గర్భిణిని సొంత భర్తే చంపే స్పైన్ చిల్లింగ్ మలయాళం థ్రిల్లర్

Tags

Related News

18 ఏళ్లుగా ఒక్క బిడ్డా పుట్టలేదు… 2027లో ప్రపంచం ఎలా ఉంటుందో చూపించిన కల్ట్ క్లాసిక్

స్కూల్లోనే పిల్లల్ని చంపి తినే టీచర్… స్పైన్ చిల్లింగ్ హర్రర్ థ్రిల్లర్

టీవీని పక్కన పెట్టేసిన జెన్‌జీ.. అంతా ఓటీటీ మాయే!

రూపాయి ఖర్చు లేకుండా చూడొచ్చు… ఓటీటీ ఫ్రీ క్యాటగిరీలో దుమ్మురేపుతున్న 7 వెబ్ సిరీస్‌లు

10 కోట్ల బ్యాగ్‌ దొరకడంతో మొదలయ్యే గందరగోళం… కితకితలు పెట్టే ఇమ్మిగ్రెంట్స్ కష్టాలు

స్కూల్ టీచర్ నుంచి డిటెక్టివ్‌గా… ట్రిపుల్ మర్డర్, ట్రెజర్ హంట్, లవ్ ట్రయాంగిల్ తో అదిరిపోయే డార్క్ కామెడీ సిరీస్

కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

Big Stories

Advertisement
×