Thriller movie : 2019లో నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా హారర్ ఫ్యాన్స్‌ను వణికించిన సూపర్ నేచురల్ సై-ఫై థ్రిల్లర్ ‘ది సైలెన్స్’ (The Silence). స్టాన్లీ టుక్సీ, కీర్నాన్ షిప్కా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి జాన్ R. లియోనెట్టి దర్శకత్వం వహించారు. టిమ్ లెబ్బన్ రాసిన ప్రసిద్ధ హారర్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమా పోస్ట్-అపోకలిప్టిక్ సర్వైవల్ హారర్ జానర్ లో ఒక మైలురాయి. మరి ఇంతటి అద్భుతమైన కథతో రూపొందిన ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అన్న వివరాల్లోకి వెళ్తే…
కథ అప్పలాచియన్ పర్వతాల్లోని ఒక పురాతన గుహలో మొదలవుతుంది. పరిశోధకులు గుహలో తవ్వకాలు చేస్తుండగా, లక్షల సంవత్సరాలుగా చీకటి గుహల్లో బతికి, పరిణామం చెందిన ‘వెస్ప్స్’ అనే భయంకరమైన జీవులు బయటకు వస్తాయి. ఈ జీవులకు కళ్లు ఉండవు, కానీ తీవ్రమైన వినికిడి శక్తి ఉంటుంది. కొద్దిపాటి శబ్దం కూడా వినిపించిన వెంటనే గుంపులుగా దాడి చేసి, క్షణాల్లో మనుషులను చంపేస్తాయి. ఈ జీవులు దేశవ్యాప్తంగా వ్యాపించి, ప్రపంచాన్ని మారణహోమం సృష్టిస్తాయి. శబ్దం చేస్తే చావు… ఊపిరి బిగపట్టి బతకాల్సిన భయంకర స్థితి ఏర్పడుతుంది.
16 ఏళ్ల చెవిటి అమ్మాయి అల్లీ ఆండ్రూస్ (కీర్నాన్ షిప్కా), ఆమె తండ్రి హ్యూ ఆండ్రూస్ (స్టాన్లీ టుక్సీ) తమ కుటుంబంతో కలిసి నగరం వదిలి అడవుల వైపు పారిపోతారు. అల్లీ చెవిటి కావడం వల్ల వారు సైగ భాషలో మాట్లాడుకుంటారు. శబ్దం చేయకుండా జీవించడం వారికి అలవాటు కావడం ఒక పెద్ద ప్లస్ అవుతుంది. వారు ఒక మారుమూల ఫామ్‌హౌస్‌కు చేరుకుని కొంతకాలం సురక్షితంగా ఉంటారు. కానీ అక్కడే మరొక భయంకరమైన మానవ శత్రువు వారిని ఎదుర్కొంటుంది.
నాలుకలు కోసేసుకున్న మతవాదుల గ్రూపు టంగ్‌లెస్ కల్ట్ ఎంట్రీ ఉంటుంది ఇక్కడ. ఈ కల్ట్ లీడర్ శబ్దం చేయకుండా ఉండాలని తన అనుచరుల నాలుకలను కోసేసి ఉంటాడు. అల్లీ సైగ భాషలో సులువుగా కమ్యూనికేట్ చేయగల సామర్థ్యాన్ని చూసి, ఆమెను తమ గ్రూపులో చేర్చుకోవాలని డిమాండ్ చేస్తాడు. హ్యూ నిరాకరించడంతో కల్ట్ సభ్యులు ఫామ్‌హౌస్ చుట్టూ అలారాలు పెట్టి, భారీ సౌండ్‌తో వెస్ప్స్‌లను ఆకర్షిస్తారు. అల్లీ కుటుంబం ఒకేసారి జీవుల దాడి, క్రూరమైన కల్ట్ ముఠా నుంచి తప్పించుకోవడానికి తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది. మరి ఆ భయంకరమైన జీవుల నుంచి ఎలా తప్పించుకున్నారు ? క్లైమాక్స్ ఏంటి ? అన్న ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ మూవీ Netflixలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. కాబట్టి థ్రిల్లర్, సై-ఫై, సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారు ఈ సినిమాను మిస్ అవ్వకుండా చూడాల్సిందే.
Read Also : అన్న కూతురిపైనే అఘాయిత్యం… గుండెను బరువెక్కించే క్లైమాక్స్