E-Paper
Advertisement

నర్సు కూతురు మిస్సింగ్… సాక్ష్యాలు లేకుండా అఘాయిత్యం… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్

నర్సు కూతురు మిస్సింగ్… సాక్ష్యాలు లేకుండా అఘాయిత్యం… క్రేజీ క్రైమ్ థ్రిల్లర్
Advertisement

Psychological Thriller 2026 : ఏప్రిల్‌లో విడుదలై ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న మైండ్-బెండింగ్ సైకలాజికల్ కోర్ట్‌రూమ్ డ్రామా ‘ఎస్. సరస్వతి’ (S Saraswathi). ప్రముఖ నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆమె ప్రధాన పాత్రలో కూడా అద్భుతంగా నటించింది. ప్రకాష్ రాజ్, ప్రియమణి, రావు రమేష్, కిషోర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. లైంగిక హింస, ట్రామా, ప్రతీకారం, మానసిక సమస్యలను ధైర్యంగా చర్చించిన ఓ మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

లక్ష్మి (వరలక్ష్మి శరత్‌కుమార్) ఒక అనాథ. ఆమె ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో హెడ్ నర్స్‌గా పని చేస్తూ, తన కూతురు సరస్వతి కోసమే బతుకుతుంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినం నాడు లక్ష్మి తన కూతురిని స్కూల్‌లో దించి డ్యూటీకి వెళ్తుంది. సాయంత్రం తిరిగి వచ్చేసరికి పాప స్కూల్‌లో ఉండదు. స్కూల్ యాజమాన్యం “సరస్వతి” అనే పేరుతో ఎవరూ ఇక్కడ చదవడం లేదని చెప్పడంతో లక్ష్మి షాక్‌ కు గురవుతుంది. పోలీసులకు ఫిర్యాదు చేసిన మరుసటి రోజు లక్ష్మి స్టేషన్‌కు వచ్చి షాకింగ్ విషయం చెబుతుంది.

Advertisement

ముగ్గురు కామాంధులు తన కూతురిపై అఘాయిత్యం చేసి చంపేశారని, శవాన్ని ఒక చోట పాతి పెట్టారని చెబుతుంది. పోలీసులు తవ్వి చూస్తే అక్కడ ఏ శవం ఉండదు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టేస్తారు. దీంతో న్యాయం కోసం లక్ష్మి ప్రముఖ లాయర్ రామానుజం (ప్రకాష్ రాజ్) సహాయం తీసుకుంటుంది. కానీ సాక్ష్యాలు లేవని కోర్టు కేసును కొట్టేస్తుంది. చట్టంపై నమ్మకం కోల్పోయిన లక్ష్మి ఒక్కరోజులోనే ఆ దారుణానికి కారకులైన జడ్జి, ఐఏఎస్ అధికారి, ఉన్నత పోలీస్ అధికారిని క్రూరంగా హత్య చేసి పోలీసుల ముందు లొంగిపోతుంది. జస్టిస్ ఉమామహేశ్వర్ (రావు రమేష్) లాయర్ రామానుజంకు ఈ కేసును సరిగ్గా దర్యాప్తు చేయమని ఆదేశిస్తాడు. రామానుజం లక్ష్మి భర్త ఆదిత్య (జీవా)ను కలుస్తాడు. అతను చెప్పిన సత్యం కథను తలకిందులు చేస్తుంది. లక్ష్మికి అసలు కూతురే లేదని, ఆమెకు పిల్లలు పుట్టడం సాధ్యం కాదని తెలుస్తుంది. లక్ష్మి చూపించే సరస్వతి ఫోటోలు అసలు ఆమె చిన్నప్పటి ఫోటోలని రుజువవుతుంది.సైకియాట్రిస్ట్ సహాయంతో హిప్నాసిస్ చేయించగా అసలు నిజం బయటపడుతుంది. మరి ఇంతకీ ఆ నిజం ఏంటి ? హీరోయిన్ కూతురు ఏమైంది ? షాకింగ్ క్లైమాక్స్ ఏంటి ? అన్నది తెరపై చూడాల్సిందే.

ఏ ఓటీటీలో ఉందంటే ?

ఈ సినిమా సాధారణ క్రైమ్ థ్రిల్లర్ కాదు. ట్రామా, మానసిక సమస్యలు, ప్రతీకారం, న్యాయ వ్యవస్థ లోపాలు వంటి అంశాలను ఆసక్తికరంగా ఈ సినిమాలో చూపించారు. ఇప్పుడు ఈ మూవీ ZEE5లో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : రెంటు తక్కువని వెళ్తే డైరెక్ట్ నరకమే… పొరపాటున పడుకునే ముందు ఈ హర్రర్ మూవీని చూడొద్దు భయ్యా

Tags

Related News

కిడ్నాప్ వెనుక క్రిమినల్ నెట్‌వర్క్… కూతురి కోసం బ్లడీ బ్లడ్ బాత్

ఫోక్ క్వీన్ నాగదుర్గకు ఓటీటీలో అదిరిపోయే హిట్!

రూ.550 కోట్ల హారర్ బ్లాక్‌బస్టర్… ‘ఈవిల్ డెడ్ బర్న్’ ఏకంగా 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్

94 శాతం ఫ్రెష్ రేటింగ్‌ ఉన్న హాలీవుడ్ ఇంటెన్స్ థ్రిల్లర్… తెలుగులోనే ఇప్పుడు రెండు ఓటీటీల్లో

గ్లాడియేటర్ స్టార్ రస్సెల్ క్రో కొత్త మూవీ ‘బీస్ట్’… తెలుగు డబ్బింగ్‌తో ఓటీటీలో స్ట్రీమింగ్

బావిలో దొరికిన మహిళ శవం… దర్యాప్తులో బయటపడిన భయంకర రహస్యం

ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమైన ఓ సుకుమారి.. ఎక్కడ చూడొచ్చంటే?

ఒరిజినల్ ఏనుగుతో షాకింగ్ యాక్షన్… తెలుగులోనే సునీల్ మలయాళం మూవీ ‘కాటాలన్’ స్ట్రీమింగ్

Big Stories

Advertisement
×