OTT Movie : ఇప్పుడు వెబ్ సిరీస్ లు, సినిమాలతో ఓటీటీ కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాలతో పాటు, మంచి కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్ లు ఓటీటీలోకి వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోసం ప్రేక్షకులు వీటినే ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ రెండు భిన్నమైన పాత్రల చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ ఫ్యామిలితో చూసే విధంగా ఉండదు. కొన్ని సీన్స్ అయితే, ఒంటరిగా చూడటమే మంచిది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
Watcho ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు ‘బిట్టు’ (Bittu). 2025 లో వచ్చిన ఈ సిరీస్ కు జగదీష్ DJ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్‌లో ప్రశాంత్ షా (బిట్టు), మాన్వి చుగ్, రాణిపరి, ప్రియాంక చౌరసియా ప్రధాన పాత్రలలో నటించారు. ఇది హిందీ, తమిళం, తెలుగు, ఇతర భాషలలో అందుబాటులో ఉంది. ఇది ఒక వృద్ధుడైన బిట్టు జీవితంలో జరిగే సంఘటనలు, ఆకాశ్ అనే ఒక కాలేజ్ విద్యార్థి ప్రేమ కథ చుట్టూ ఈ సిరీస్ నడుస్తుంది. ఆరు ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సిరీస్, Watcho ఓటీటీలో 2025 మే లో విడుదలైంది.
స్టోరీలోకి వెళితే
ఈ వెబ్ సిరీస్ రెండు కథల చుట్టూ తిరుగుతుంది. ఒకటి బిట్టు అనే వృద్ధుడి ప్రయాణం. మరొకటి ఆకాశ్ అనే ఇంటర్మీడియట్ కాలేజ్ విద్యార్థి ప్రేమకథ. ఈ రెండు కథలు జీవితం, ప్రేమ, బాధ్యత థీమ్‌లతో నడుస్తాయి.
బిట్టు కథ : బిట్టు అనే ఒక వృద్ధుడికి, తన జీవితంలో ప్రయాణాలు చేయడం అంటే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ అతని ప్రయాణాల వెనుక ఒక సీక్రెట్ దాగి ఉంటుంది. అతను ఆమ్మాయిలతో ఏకాంతంగా గడపడానికి ప్రయాణిస్తుంటాడు. ఎంతో మందిని ఇతను ట్రాప్ చేసి ఏకాంతంగా గడుపుతుంటాడు. అతని జీవన శైలి కూడా భిన్నంగా ఉంటుంది. ఇందులో బిట్టు అనుభవాలు, అతను ఎదుర్కొన్న సవాళ్లు, అతని గతంలోని బాధాకరమైన సంఘటనలు ఈ సిరీస్ ను మరో లెవెల్ కి తీసుకెళ్తాయి. అతని పాత్ర, అతను తీసుకునే నిర్ణయాలు కథలో ఊహించని ట్విస్ట్‌లకు దారితీస్తాయి. బిట్టు ప్రస్తుత జీవితం, అతను గతంలో ఎదుర్కొన్న ఒక సంఘటనతో ముడిపడినట్లు కథ ముందుకు సాగేకొద్దీ బయటపడుతుంది.
ఆకాశ్ కథ : ఇది బిట్టుకి సమాంతరంగా నడుస్తుంది. ఆకాశ్ ఒక కాలేజ్ విద్యార్థి. అతను తన ప్రేమలో ఒడిదొడుకులను ఎదుర్కొంటాడు. ఆకాశ్ జీవితం అతని కలలు, కుటుంబ బాధ్యతల మధ్య చిక్కుకుంటుంది. అతని నిర్ణయాలు ఊహించని పరిణామాలకు దారితీస్తాయి. ఈ సిరీస్‌లో మొత్తం ఆరు ఎపిసోడ్‌లు ఉన్నాయి. ప్రతి ఎపిసోడ్ సుమారు 30-40 నిమిషాల నిడివి ఉంటుంది. మొదటి మూడు ఎపిసోడ్‌లు బిట్టు, ఆకాశ్ పాత్రలను పరిచయం చేస్తాయి. చివరి మూడు ఎపిసోడ్‌లు, ఈ రెండు కథలను ఒక ఉత్కంఠభరితమైన క్లైమాక్స్‌లో కలుపుతాయి.
Read Also : అనుమానంతో భార్య మర్డర్ కు మాస్టర్ ప్లాన్… ఆ ఒక్క పొరపాటుతో ఫ్యూజులు అవుటయ్యే ట్విస్ట్