ICC New Rules T20’s : పవర్ ప్లే నిబంధనల్లో ఐసీసీ మార్పులు అంతర్జాతీయ క్రికెట్ మండలి వరుసగా కీలక నిర్ణయాలను ప్రకటిస్తోంది. సుదీర్ఘ ఫార్మాట్ లో స్టాప్ క్లాక్ ను ప్రవేశపెట్టిన ఐసీసీ.. టీ-20లపై కూాడా మార్పులు చేసింది. పరిస్థితులకు అనుగుణంగా పొట్టి క్రికెట్ లో మార్పులు అనివార్యం అని భావించింది. ముఖ్యంగా పవర్ ప్లే లో కొన్ని కీలక సవరణలు చేసింది. వర్షం వల్ల ఓవర్లు కుదించే T20 మ్యాచ్ ల్లో పవర్ ప్లే నిబంధనలు మారుస్తున్నట్టు తెలిపింది ఐసీసీ. గతంలో ఇలాంటి మ్యాచ్ ల్లో పవర్ ప్లే 2, 3, 4 ఓవర్లు ఉండేది. కానీ ఇప్పుడు పక్కాగా మొత్తం బంతుల్లో 30 శాతం పవర్ ప్లే ఉండేలా రూల్స్ మార్చింది. 5 ఓవర్ల ఆటకు 1.3 ఓవర్లు, – ఓవర్లకు 1.5, 7 ఓవర్లకు 2.1, 8 ఓవర్లకు 2.2, 9 ఓవర్లకు 2.4, 10 ఓవర్లకు 3 ఓవర్లు పవర్ ప్లే ఉండనున్నాయి.
Also Read : Virat Kohli : ఇన్ స్టా పోస్టుకు విరాట్ కోహ్లీ ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా.. చూస్తే షాక్ కావాల్సిందే
నిబంధనల్లో మార్పులు..
ఇక అలాగే 11 ఓవర్లు ఉన్న క్రికెట్ మ్యాచ్ కి 3.2 ఓవర్లు, 12 ఓవర్లు ఉన్న మ్యాచ్ కి 3.4 బంతులు, 13 ఓవర్లు ఉన్న మ్యాచ్ కి 3.5, 14 ఓవర్లు ఉన్న మ్యాచ్ కి 4.1, 15 ఓవర్లు ఉన్న మ్యాచ్ కి 4.3, 16 ఓవర్లు ఉన్న మ్యాచ్ కి 4.5 బంతులు, 17 ఒఓవర్లు ఉన్న మ్యాచ్ కి 5.1 బంతులు, 18 ఓవర్లు ఉన్న మ్యాచ్ కి 5.2 బంతులు, 19 ఓవర్లు 5.4 బంతులు ఓవర్ల పవర్ ప్లే జరపాలని నిర్ణయించింది. ప్రస్తుతానికి తొలి 6 ఓవర్లను పవర్ ప్లే గా పరిగణిస్తున్నారు. వర్సం కారణంగా కుదించాల్సి వస్తే.. పవర్ ప్లే లో ఎన్ని ఓవర్లు ఆడించాలనే విషయం పై సందిగ్దం కొనసాగేది. తాజాగా ఐసీసీ ఈ అంశం పై స్పష్టతనిచ్చింది. 20 ఓవర్ల ఆటకు అందులో 30 శాతం ఓవర్లు అంటే 6 ఓవర్లను పవర్ ప్లే గా పేర్కొంటారు.
అన్నింటికి ఈ కొత్త రూల్స్..
మరోవైపు నిన్న ఐసీసీ 5 కొత్త రూల్స్ ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాటిలో ముఖ్యంగా స్లో ఓవర్ రేట్ పరిష్కారానికి స్టాప్ క్లాక్ విధానం. అంటే ఒక ఓవర్ ముగియగానే నిమిషం లోపు కొత్త ఓవర్ ప్రారంభించాలి. రెండు హెచ్చరికల తరువాత 5 పరుగుల పెనాల్టీ విధిస్తారు. సలైవా( ఉమ్మి రాకి రుద్దడం) బ్యాన్ కొనసాగింపు. అంపైర్ బంతి పై సలైవా గుర్తించినా బాల్ మార్చడం కుదరదు. క్యాచ్ క్లియర్ గా లేకపోయినా ఫీల్డర్ ఔట్ అని అప్పీల్ చేస్తే.. నో బాల్ గా పరిగణిస్తారు. బ్యాటర్లు కావాలని షార్ట్ రన్ చేస్తే 5 రన్స్ పెనాల్టీ ఇలా కొన్ని కొత్త రూల్స్ తీసుకొచ్చారు. ముఖ్యంగా DRS రూల్ ప్రకారం.. ఫీల్డింగ్ చేస్తున్న జట్టు క్యాచ్ కోసం అప్పీల్ చేస్తుంది. ఇక ఈ సమయంలో అంపైట్ ఔట్ ఇస్తే.. బ్యాటింగ్ చేసే జట్టు క్యాచ్ అప్పీల్ కోసం రివ్యూ కోరుతుంది. ఈ సమయంలో థర్డ్ అంపైర్ తొలుత ఆల్ట్రాఎడ్జ్ చెక్ చేస్తారు. ఒకవేళ బంతి బ్యాట్ కి తగలకపోతే LBW కోసం అంపైర్ చెక్ చేస్తారు. LBW లో ఔట్ అని తేలినా.. ఇక అంపైర్ కాల్ వచ్చినా ఔట్ గానే పరిగణిస్తారు.