OTT Movie : బెంగాల్ నుంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలు వస్తున్నాయి. వీటిని బాలీవుడ్ తో సహా, ఇతర భాషల్లో కూడా రీమేక్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది. పెళ్లి చెడగొట్టడానికి ప్రియుడు ప్లాన్ వేయడంతో, స్టోరీ మలుపు తీసుకుంటుంది. ఈ మూవీ చివరి వరకు సరదాగా సాగిపోతుంది. ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుని, ప్రేక్షకులని బాగా అలరించింది. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే…
స్టోరీలోకి వెళితే
సత్య ప్రఖ్యాత గాయకుడే కాకుండా, యూట్యూబ్ స్టార్ గా కూడా పేరు తెచ్చుకుంటాడు. మరోవైపు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గా కూడా పనిచేస్తుంటాడు. ఇతను గతంలో ప్రేమలో ఫెయిల్ అవడంతో, పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాడు. అయితే తన తల్లి ఒత్తిడి మేరకు మోహర్ అనే అమ్మాయిని కలవడానికి వెళ్తాడు. వీళ్లిద్దరూ ఒకరిని ఒకరు పరిచయం చేసుకొని, పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతారు. ఇంతలో ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. మోహర్ ని గతంలో చంద్రమౌళి అనే సంగీతం మాస్టారు ప్రేమిస్తుండేవాడు. ఇద్దరూ కొంత కాలం ప్రేమించుకుంటారు. కొన్ని కారణాలవల్ల అతడు ఆమెకు దూరం అవుతాడు. ఇప్పుడు ఉన్నట్టుండి మోహర్ కి పెళ్లి జరిగిపోతుందని మళ్ళీ తిరిగి వస్తాడు. పెళ్లి ఎలాగైనా ఆపాలని మండపానికి చేరుకుంటాడు. ఇంతలో అతన్ని చూసి మోహర్ కూడా షాక్ అవుతుంది.
ఈ క్రమంలో సత్యకి చంద్రమౌళి ఒక లెటర్ పంపిస్తాడు. అందులో పెళ్ళికూతురు ఒక మంత్రగత్తె అని, తనని పెళ్లి చేసుకుంటే కష్టాలు తప్పవని రాసి ఉంటుంది. ఇది చూసి షాక్ అయిన సత్య, ఎవరు రాశారో కనిపెట్టడానికి ట్రై చేస్తాడు. మరో వైపు ఆమెను మళ్ళీ తిరిగి పొందటానికి ట్రై చేస్తాడు చంద్రమౌళి. ఇప్పుడు ఇది కాస్త ట్రయాంగిల్ లవ్ స్టోరీగా మారి పోతుంది. ఇప్పుడు పెళ్లికూతురు కూడా గందరగోళంలో పడిపోతుంది. పెళ్ళికొడుకుని పెళ్లి చేసుకోవాలా, మాజీ ప్రియుడి ప్రేమకు లొంగిపోవాలా అనే డైలామాలో పడుతుంది. చివరికి పెళ్లి ఎవరితో, ఎవరికి జరుగుతుంది? చంద్రమౌళి, మోహర్ విడిపోవడానికి కారణం ఏమిటి? ఆ లెటర్ రాసింది ఎవరో సత్య కనిపెడతాడా ? చంద్రమౌళి విషయం సత్యకి తెలుస్తుందా ? అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ బెంగాలీ కామెడీ ఎంటర్టైనర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : భర్తతో విడాకులు, ప్రియుడితో ఆటలు … ఫ్యూజులు అవుట్ అయ్యే క్లైమాక్స్
జీ 5 (ZEE5) లో
ఈ బెంగాలీ కామెడీ ఎంటర్టైనర్ మూవీ పేరు ‘బియే బిభ్రాట్’ (Biye Bibhrat). 2023 లో వచ్చిన ఈ సినిమాకి రాజా చందా దర్శకత్వం వహించారు. ఈ స్టోరీని పరంబ్రత చటోపాధ్యాయ్ రాశారు. ఇందులో అబీర్ చటర్జీ, పరంబ్రత చటోపాధ్యాయ్, లహోమా భట్టాచార్య, సుదీపా బసు ప్రధాన పాత్రల్లో నటించారు. రణజోయ్ భట్టాచార్జీ దీనికి సంగీతం సమకూర్చారు. IMDb రేటింగ్ లో ఈ మూవీకి 6.7/10 గా ఉంది. 2023 సెప్టెంబర్ 1 నుండి ఈ సినిమా జీ 5 (ZEE5) ఓటీటీ ప్లాట్ ఫామ్‌లో అందుబాటులో ఉంది