E-Paper
Advertisement

పాపులర్ ఆటగాడికి 10 ఏళ్ల జైలు శిక్ష… ఎఫ్‌బీఐ సీక్రెట్ ఆఫర్ తో ఊహించని మలుపు

పాపులర్ ఆటగాడికి 10 ఏళ్ల జైలు శిక్ష… ఎఫ్‌బీఐ సీక్రెట్ ఆఫర్ తో ఊహించని మలుపు
Advertisement

Thriller Series :  ఓటీటీలలో సీరియల్ కిల్లర్ సినిమాలను ఇప్పటిదాకా ఎన్నో చూసి ఉంటారు. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా మాత్రం కొంచం డిఫరెంట్ గా ఉంటుంది. మామూలుగా సైకో థ్రిల్లర్ సినిమాలలో కిల్లర్ జనాలను చంపడం, పోలీసులు వాడిని వెంటాడడం లేదా బాధితులు వారిపై పగ తీర్చుకోవడం వంటివి చూస్తాము. కానీ ఇందులో మాత్రం ఓ ప్లేయర్ సైకో పని పడతాడు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది Blackbird Series 2022 గురించి. మరి ఈ సిరీస్ స్టోరీ ఏంటి ? ఎక్కడ చూడొచ్చు ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

జిమ్మీ కీన్ (టాటన్ ఎగర్టన్) ఒక మాజీ హైస్కూల్ ఫుట్‌బాల్ హీరో. అతని తండ్రి పోలీస్ ఆఫీసర్. కానీ జిమ్మీ డ్రగ్స్, అక్రమ ఆయుధాల వ్యాపారం చేస్తూ పోలీసులకు దొరికిపోతాడు. కోర్టు అతనికి 10 ఏళ్ల జైలు శిక్ష విధిస్తుంది. జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు ఎఫ్‌బీఐ అతనికి ఒక మిస్టరీ ఆఫర్ ఇస్తుంది. అత్యంత ప్రమాదకరమైన, కట్టుదిట్టమైన భద్రత ఉన్న జైలుకు వెళ్లి, అక్కడ ఉన్న లారీ హాల్ (పాల్ వాల్టర్ హౌజర్) అనే భయంకరమైన సీరియల్ కిల్లర్‌తో స్నేహం చేయాలనేది వారి డిమాండ్.

Advertisement

లారీ హాల్ ఎంతోమంది యువతులను హతమార్చాడని అనుమానం ఉంటుంది పోలీసులకు. కానీ సరైన ఆధారాలు దొరకవు. అందుకే పోలీసులు ఇలాంటి పని చేయాలనుకుంటారు. లారీ పైకోర్టు అప్పీల్ గడువు ముగిసేలోపు, అతను చంపిన అమ్మాయిల శవాలను ఎక్కడ దాచాడో అతని నోటి నుంచి రాబట్టడమే జిమ్మీకి పోలీసులు ఇచ్చిన టాస్క్. ఒకవేళ లారీ నోరు విప్పితే జిమ్మీకి వెంటనే ఆ జైలు శిక్ష నుంచి విముక్తి లభిస్తుంది. కానీ లారీకి జిమ్మీపై అనుమానం వస్తే… జిమ్మీ ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది.

జైలు వాతావరణం, లారీ సైకో మనస్తత్వం, జిమ్మీపై ఉన్న మానసిక ఒత్తిడి… అన్నీ సిరీస్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా మలుస్తాయి. మరి ఈ మైండ్ గేమ్ ఎలా ముగుస్తుంది ? జిమ్మీ తన లక్ష్యం సాధించగలడా ? సైకో ఆ అమ్మాయిల శవాలను ఏం చేశాడు ? అనేది చూడాలంటే సిరీస్ మొత్తం చూడాల్సిందే.

Advertisement

ఆపిల్ టీవీ ప్లస్‌లో అందుబాటులో ఉన్న ఈ అమెరికన్ మినీ – సిరీస్ ను నిజ జీవిత ఆత్మకథ ఆధారంగా తీశారు. ఈ సైకలాజికల్ థ్రిల్లర్, క్రైమ్ డ్రామా సిరీస్ ను ఒక్కసారి చూస్తే మరచిపోలేని థ్రిల్ ను ఇస్తుంది. జేమ్స్ కీన్ రాసిన ‘ఇన్ విత్ ది డెవిల్’ ఆధారంగా తెరకెక్కిన ఈ సిరీస్ హారర్ కాకుండా మైండ్ గేమ్స్‌ తో మెంటలెక్కిస్తుంది. ‘బ్లాక్ బర్డ్’ ప్రస్తుతం Apple TV+లో అందుబాటులో ఉంది. ఈ 6 ఎపిసోడ్ల లిమిటెడ్ సిరీస్.తెలుగు డబ్బింగ్ వెర్షన్ అందుబాటులో లేదు. కానీ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.

Read Also : ఎరుపు రంగు బట్టలు వేసుకున్న మహిళలే ఈ కిల్లర్ టార్గెట్… రియల్ లైఫ్ సైకో కిల్లర్ కథ

Tags

Related News

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

ఓటీటీలోకి మమిత బైజు ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’.. స్ట్రీమింగ్ ఎప్పుడు? ఎక్కడంటే?

Big Stories

Advertisement
×