BigTV English

OTT Movie : మరో అబ్బాయితో భార్య… సర్పైజ్ ఇవ్వాలనుకున్న భర్తకు ఆమె ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కు బుర్ర పాడు

OTT Movie : మరో అబ్బాయితో భార్య…  సర్పైజ్ ఇవ్వాలనుకున్న భర్తకు ఆమె ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ కు బుర్ర పాడు

OTT Movie : బ్లాక్ కామెడీ, క్రైమ్ కామెడీ థ్రిల్లర్ లకు రోజురోజుకూ డిమాండ్ బాగా పెరుగుతోంది. ఇలాంటి సినిమాలలో ఉత్కంఠభరితమైన సన్నివేశాలే కాకుండా మసాలా సన్నివేశాలు కూడా ఉంటాయి. ఆ రెండింటి కాంబినేషన్ ఆడియన్స్ ను కంటి రెప్ప వేయనీయకుండా సినిమాలను చూసేలా చేస్తుంది. కథ పర్ఫెక్ట్ గా ఉండాలే గానీ ఈ జానర్ ను మించిన ఇంట్రెస్టింగ్ స్టోరీలే లేవేమో అన్పించక మానదు. మరి ఇంతకీ ఈ మూవీ కథ ఏంటి? ఏ ఓటీటీలో అందుబాటులో ఉంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం పదండి.


కథలోకి వెళ్తే…

దేవ్ కౌశల్ (ఇర్ఫాన్ ఖాన్) ఒక సాధారణ మధ్యతరగతి ఉద్యోగి. హర్ష్‌వర్ధన్ టాయిలెట్ ప్రొడక్ట్స్ కంపెనీలో పని చేస్తాడు. అతని జీవితం రొటీన్ ‌గా, బోరింగ్‌ గా సాగుతుంది. అతని భార్య రీనా (కిర్తి కుల్హారీ)తో సంబంధం కూడా పెద్దగా ఆసక్తికరంగా ఉండదు. ఒక రోజు దేవ్ ఆఫీసు నుండి తొందరగా ఇంటికి వస్తాడు. అతని భార్య రీనా తన మాజీ ప్రియుడు రంజిత్ (అరుణోదయ్ సింగ్)తో వివాహేతర సంబంధంలో ఉందన్న విషయాన్ని కనిపెడతాడు. ఈ షాకింగ్ డిస్కవరీ తర్వాత దేవ్ రీనాతో విడాకులు తీసుకోవడానికి బదులు, రంజిత్‌ ను బ్లాక్‌ మెయిల్ చేయాలని నిర్ణయిస్తాడు.


అనుకున్నదే తడవుగా దేవ్, రంజిత్‌కు ఫోన్ చేసి… అతనికి సంబంధించిన సీక్రెట్ ను బయట పెడతానని బెదిరిస్తూ, డబ్బులు డిమాండ్ చేస్తాడు. రంజిత్, తన భార్య డాలీ (దివ్య దత్త)కి ఈ విషయం తెలియకుండా ఉండాలని, దేవ్‌కు డబ్బు ఇవ్వడానికి అంగీకరిస్తాడు. కానీ రంజిత్ ‌కు కూడా డబ్బు సమస్యలు ఉంటాయి. దాంతో అతను ప్లాన్ చేసి దేవ్ ‌ను మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడే కథలో ఊహించని మలుపులు వస్తాయి. రంజిత్ ఈ డబ్బు సమస్యలను తీర్చడానికి, తన బాస్ (ఊర్మిళా మాటోండ్కర్)ను బ్లాక్‌ మెయిల్ చేయడం ప్రారంభిస్తాడు.

ఇదే సమయంలో దేవ్‌ను గమనించే ఒక ప్రైవేట్ డిటెక్టివ్ (అనుజా సాథే) కూడా ఈ బ్లాక్ ‌మెయిల్ గేమ్‌లో చేరతాడు. ఒకరినొకరు బ్లాక్‌మెయిల్ చేసుకుంటూ, ప్రతి పాత్ర తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఒక్కొక్కరితో ఓ ఆట ఆడుకుంటారు. ఫలితంగా ఇందులో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ఇబ్బందికరంగా మారుతుంది. సినిమాలో కామెడీ, ముఖ్యంగా ఇర్ఫాన్ ఖాన్ నటన, విచిత్రమైన పరిస్థితులు, ఉత్కంఠభరితమైన సీన్స్ తో కథ ఆసక్తికరంగా నడుస్తుంది. దేవ్‌ డబ్బు కోసం చేసే ప్రయత్నాలు, రంజిత్ మోసపూరిత ప్రవర్తన, ఇతర పాత్రల గందరగోళం కథను ఆసక్తికరంగా మారుస్తాయి. కథ చివర్లో ఈ బ్లాక్ ‌మెయిల్ గేమ్ ఎవరికి లాభం చేకూర్చింది? ఎవరు నష్టపోయారు ? అనేది ఒక ఊహించని మలుపుతో వెల్లడవుతుంది. ఇంతకీ ఆ క్లైమాక్స్ ఏంటి? చివరికి ఏం జరిగింది? అనే విషయాన్ని ఈ మూవీని చూసి తెలుసుకోవాల్సిందే.

ఏ ఓటీటీలో అందుబాటులో ఉందంటే?

ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హిందీ మూవీ పేరు “బ్లాక్‌మెయిల్” (Black Mail). 2018లో రిలీజ్ అయిన ఈ హిందీ బ్లాక్ కామెడీ సినిమాకి అభినయ్ దేవ్ దర్శకత్వం వహించారు. ఒక వ్యక్తి తన భార్య వివాహేతర సంబంధాన్ని కనుగొని, ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం చుట్టూ తిరిగే కథ. ఈ సినిమా కామెడీ, ఉత్కంఠభరితమైన సీన్లు, మంచి డ్రామాతో నిండిన ఒక రోలర్‌కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. ఇర్ఫాన్ ఖాన్ (దేవ్), కిర్తి కుల్హారీ (రీనా), అరుణోదయ్ సింగ్ (రంజిత్), దివ్య దత్త (డాలీ) తదితరులు ఇందులో నటించారు. ఇర్ఫాన్ ఖాన్ నటన సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఇర్ఫాన్ ఖాన్ అభిమానులకు పండగే. ఈ మూవీ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.

Related News

HHVM OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన హరిహర వీరమల్లు… ఎప్పుడు? ఎక్కడంటే?

OTT Movie : శవంపై కోరిక… ఏకంగా బాయ్ ఫ్రెండ్ ముందే దాంతో ఆ పని… ఇదెక్కడి దిక్కుమాలిన సినిమా మావా

OTT Movie : అమ్మ బాబోయ్… వీడు పిల్లాడు కాదు కిల్లర్… నెవర్ బిఫోర్ సైకో థ్రిల్లర్

OTT Movie : చచ్చే ముందు ఇదేం పిచ్చి కోరిక మావా ? అక్కడక్కడా ఆ సీన్స్ కూడా… ఊహించని క్లైమాక్స్

OTT Movie : ట్రైన్ లో 59 మంది సజీవ దహనం… చరిత్ర దాచిన నిజాలు ఈ సిరీస్ లో బట్టబయలు… ఎక్కడ చూడొచ్చంటే?

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి ఏకంగా 31 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

Big Stories

×