ఇండిగో విమానయాన సంస్థను వరుస ప్రమాదాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. గత 20 రోజుల్లో మూడు ఘటనలు జరగకడంతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా 175 మంది ప్రయాణీకులతో వెళ్తున్న ఇండిగో విమానాన్ని రాబందు ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తం అయిన పైలెట్ ఫ్లైట్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు.
బీహార్ నుంచి కోల్ కతా వెళ్తుండగా ఘటన
బీహార్ నుంచి కోల్ కతాకు వెళ్తున్న ఇండిగో విమానం.. రాంచీకి వెళ్లి అక్కడి కాసేపు ఆగి.. కోల్ కత్తాకు వెళ్లాల్సి ఉంది. అయితే, విమానం రాంచీకి సమీపంలోకి రాగానే పక్షి ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తం అయిన పైలెట్ ఏటీసీ అధికారులకు సమాచారం అందించారు. బిర్సా ముండా విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయ్యేందుకు అనుమతించారు. వెంటనే, పైలెట్ సురక్షితంగా విమానాన్ని కిందికి దించాడు. విమానం 3,000 నుంచి 4,000 అడుగుల ఎత్తులో ఉండగా రాబందు విమానాన్ని ఢీకొట్టినట్లు పైలెట్ చెప్పాడు. ఈ ఘటన మధ్యాహ్నం 1.14 గంటలకు జరిగినట్లు వివరించాడు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగలేదని అధికారులు వెల్లడించారు.అయితే, ఎయిర్ బస్ 320 విమానం ముందు భాగం దెబ్బతిన్నట్లు తెలిపారు.
ఎయిర్ పోర్టు అధికారులు ఏం చెప్పారంటే?
బిర్సా ముండా విమానాశ్రయం డైరెక్టర్ ఆర్ ఆర్ మౌర్య విమానాన్ని పక్షి ఢీకొట్టిన ఘటనపై పూర్తి వివరాలను వెల్లడించారు. ప్రయాణీకులందరూ సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. కానీ, విమానం రాబందు ఢీకొట్టడంతో ముందు భాగం దెబ్బతిన్నట్లు వెల్లడించారు. ఇంజనీర్లు విమానానికి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాంచీ సమీపంలోకి రాగానే ఇండిగో విమానాన్ని పక్షి ఢీకొట్టినట్లు తెలిపారు. ఈ సంఘటన జరిగినప్పుడు విమానం దాదాపు 10 నుంచి 12 నాటికల్ మైళ్ల దూరంలో 3,000 నుంచి 4,000 అడుగుల ఎత్తులో ఉందని అని మౌర్య వెల్లడించారు. ఈ విమానం బీహార్‌లోని పాట్నా నుంచి బయల్దేరి, రాంచీలో కాసేపు ఆగి కోల్‌కతాకు బయలుదేరాల్సి ఉందన్నారు. ఈ ప్రమాదంతో ప్రయాణీకులను మరో విమానంలో కోల్ కతాకు తరలించనున్నట్లు మౌర్య తెలిపారు.
Read Also: గాలి దుమారంలో విమానం, వణికిపోయిన ప్రయాణీకులు, నెట్టింట వీడియో వైరల్!
ఇండిగో విమానాలకు వరుస ప్రమాదాలు
గత 20 రోజుల్లో మూడుసార్లు ఇండిగో విమనాలు ప్రమాదానికి గురయ్యాయి. గత నెల చివరి వారంలో విమానం వడగళ్ల వానలో చిక్కుకుని ధ్వంసం అయ్యింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయ్యింది. మొన్న ఢిల్లీలో దుమ్ము తుఫానులో చిక్కి మరో విమానం గాల్లో చక్కర్లు కొట్టింది. తాజాగా ఫక్షి ఢీకొట్టడింది. డిసెంబర్ 2024లో గౌహతికి వెళ్లే ఇండిగో విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పక్షిని ఢీకొట్టింది. మళ్లీ ఇప్పుడు అలాంటి ఘటనే జరిగింది. మరోవైపు ఇండిగో విమానాలు వరుస ప్రమాదాలకు గురి కావడం పట్ల ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.
Read Also: రన్నింగ్ ట్రైన్ లో యువతి ఓవరాక్షన్, ఫుట్ బోర్డు మీద డ్యాన్స్.. సీన్ కట్ చేస్తే!