OTT Movie : డిసెంబర్ లో సినిమాలు, సిరీస్ లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. ఇంట్లో కూర్చుని ఫుల్ యాక్షన్, లవ్, కామెడీ, థ్రిల్లర్ మిక్స్ తో ఫుల్ ఛిల్ అవ్వండి. ‘ఘర్వాలీ పేడ్వాలీ’ సూపర్‌నాచురల్ కామెడీతో నవ్వులు పూయించనుంది. ‘రియల్ కాశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్’ కాశ్మీర్ ఎమోషనల్ ని గుండెకు గట్టిగానే తాకుతుంది. సింగిల్ పాపాలో కునాల్ కేమ్ము సింగిల్ ఫాదర్ జర్నీ ఆసక్తికరంగా ఉంటుంది. ఇలాంటి స్టోరీలు ఒక్కసారి ప్లే చేస్తే ఆపలేరు కూడా. ఇప్పటి నుంచే వీకెండ్ ప్లాన్ రెడీ చేస్కోండి. ఇవన్నీ ఫ్యామిలీలతో కలసి చుడదగ్గవే. ఇవి ఎప్పుడు ? ఎక్కడ ? స్ట్రీమింగ్ కి రానున్నాయో తెలుసుకుందాం పదండి.
ఈ హిందీ సూపర్‌నాచురల్ కామెడీసిరీస్ 2025 డిసెంబర్ 5 నుంచి ZEE5లో స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఈ కథ జీతు పాండే (పరస్ అరోరా) చుట్టూ తిరుగుతుంది. అతని వెడ్డింగ్ డేలో జాతక సమస్య వల్ల ప్రత్యేక పూజ చేస్తారు. అందులో అతన్ని ఒక ఆలివి చెట్టుతో పెళ్లి చేస్తారు. ఆ చెట్టులో లతికా అనే ఘోస్ట్ ఉంటుంది. ఆమె జీతుని భర్త గా ఊహించుకుంటుంది. ఇక అక్కడి నుంచి ఫుల్ కలవరం మొదలవుతుంది. జీతు తన మోడరన్ వైఫ్ సావి, లతికా ఘోస్ట్ మధ్య నలిగిపోతాడు. ఇద్దరు పెళ్ళాల మధ్య, అందులోనూ ఒక దెయ్యం భార్యతో వచ్చే సంఘటనలు కడుపుబ్బా నవ్విస్తాయి.
ఈ కాశ్మీర్ మిరాకిల్ స్పోర్ట్స్ డ్రామా సిరీస్ లో మనవ్ కౌల్, మొహమ్మద్ జీషాన్ అయ్యుబ్ లీడ్ రోల్స్‌లో నటించారు. ఈ సిరీస్ 2025 డిసెంబర్ 9 నుంచి SonyLIVలో స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఈ కథ కాశ్మీర్ మైనారిటీల మధ్య యూనిటీ హోప్ చూపిస్తుంది. హిందూ పండిట్స్, ముస్లింలు కలిసి కాశ్మీర్ మొదటి ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ ను ఫార్మ్ చేస్తారు. టీమ్‌వర్క్‌తో నేషనల్ లీగ్‌లో పోటీ కూడా ఇస్తారు. ఇది ఒక యూనిటీ మెసేజ్ ని ఎమోషనల్ గా ఇస్తుంది.
కునాల్ కేమ్ము లీడ్ రోల్‌లో వచ్చిన ఈ కామెడీ సిరీస్, 2025 డిసెంబర్ 12 నుంచి Netflixలో స్ట్రీమింగ్ మొదలవుతుంది. ఈ కథ గౌరవ్ గెహ్లోట్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. డివోర్స్ అవ్వడంతో అతను ఒక్కసారిగా బేబీని దత్తత తీసుకుంటాడు. అతని తల్లిదండ్రులు షాక్ అవుతారు. ఎలా పెంచుతాడని నోటి మీద వేలు వేసుకుంటారు. అయితే కథ సరదాగా సాగిపోతుంది. ఫీల్ గుడ్ సిరీస్ గా ఇది ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకోనుంది.
ఈ హిందీ రొమాంటిక్ సినిమాకి మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. దేశీ మూవీస్ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రంలో హర్షవర్ధన్ రాణే, సోనమ్ బజ్వా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం దీపావళి సందర్భంగా 2025 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 111 కోట్లు వసూలు బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. ఈ కథలో విక్రమాదిత్య అనే వ్యక్తి, అదా అనే అమ్మాయిని పిచ్చిగా ప్రేమిస్తాడు. అతను తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఆమెను ఆకర్షించడానికి ప్రయత్నిస్తాడు. అయితే అదా అతని ప్రేమను తీవ్రంగా తిరస్కరిస్తుంది. అతనికి వేధింపులు తట్టుకోలేక ఎవరైతే అతని నుంచి నన్ను కాపాడతారో వాళ్ళని నేను పెళ్లి చేసుకుంటానని ఒక ప్రకటన కూడా చేస్తుంది. దీంతో స్టోరీ పీక్స్ కి వెళ్తుంది. ఈ సినిమా డిసెంబర్ 16 నుంచి Netflix లో స్ట్రీమింగ్ కానుంది.
ఈ హారర్ మూవీ 2025 డిసెంబర్ 16 నుంచి Amazon Prime Videoలో స్ట్రీమింగ్ మొదలవుతుంది. మాడ్డాక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజన్, అమర్ కౌశిక్ నిర్మించిన ఈ సినిమాకు ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించగా ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన్న, నవాజుద్దీన్ సిద్ధికి, పరేష్ రావల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా అక్టోబర్ 21న థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఈ కథలో అలోక్ (అయుష్మాన్) అనే వ్యక్తి, తడకా (రష్మిక) అనే మిస్టీరియస్ వాంపైర్ అమ్మాయిని లవ్ చేస్తాడు. అక్కడి నుంచి స్టోరీ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది.
మధురీ దీక్షిత్ సీరియల్ కిల్లర్ గా లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. నాగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ సిరీస్, 2025 డిసెంబర్ 19 నుంచి JioHotstarలో స్ట్రీమింగ్ మొదలవుతుంది. కథ మిసెస్ దేశ్‌పాండే (మధురీ) చుట్టూ తిరుగుతుంది. ఆమె జైల్లో ఉండటంతో బయట ఒక కొత్త కిల్లర్ ఆమె స్టైల్‌లో మర్డర్స్ చేస్తుంటాడు. పోలీసులు ఆమెని బయటకు తీసుకొచ్చి కిల్లర్ ని పట్టుకోవడానికి హెల్ప్ అడుగుతారు. ఇక ఈ సిరీస్ టీజర్ కూడా అదిరిపోయింది. స్టోరీ కూడా నెక్స్ట్ లెవెల్ అంటున్నారు.
Read Also : గ్రామాన్ని కాపాడే కోడి… అన్నం తిను అంటూ వెంట పడే దెయ్యం… క్రేజీ మలయాళ సినిమా