OTT Movie : సీరియల్ కిల్లర్ సినిమాలలో కావాల్సినంత థ్రిల్ దొరుకుతుంది. ఈ సినిమాలు క్షణక్షణం ఉత్కంఠంగా నడుస్తుంటాయి. నెక్స్ట్ ఏం జరుగుతుందనే ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తాయి. ఈ మధ్య ఇలాంటి స్టోరీలను, ఆడియన్స్ కూడా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో కిల్లర్ ట్రాక్ డిఫరెంట్ గా ఉంటుంది. జైల్లో ఉన్న కిల్లర్ స్టైల్ లో బయట ఒక వ్యక్తి హత్యలు చేస్తుంటాడు. ఈ హత్యలకు ఆడియన్స్ పోల్ కూడా పెడుతుంటాడు. అతడు ఎందుకు ఇలా చేస్తున్నాడనేదే ఈ కథ. థ్రిల్లర్ ఫ్యాన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీ ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే …
‘బోర్డర్ టౌన్: ది మ్యూరల్ మర్డర్స్’ 2021లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. జూసో సిర్జా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో విల్లే విర్తానెన్ (కారి సోర్జోనెన్), ఆను సినిసాలో (లెనా జాకోలా), సాంపో సార్కోలా (లాస్సే మాసాలో) ప్రధాన పాతల్లో నటించారు. 2021 అక్టోబర్ 15న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయింది. 91 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా, ఐఎండిబిలో 6.3/10 రేటింగ్ పొందింది.
కారి అనే డిటెక్టివ్ రిటైర్ అయిపోయి ప్రశాంతంగా జీవిస్తుంటాడు. ఒక రోజు అతను ఉన్న టౌన్ లో ఒక అండర్‌పాస్ గోడ మీద రక్తంతో పెయింట్ చేసిన భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. అందులో కారి గతంలో జైల్లో వేసిన సీరియల్ కిల్లర్ లాస్సే ముఖం రక్తంతో పెయింట్ వేసి ఉంటుంది. అక్కడ ప్రపంచానికి మంచి చేద్దాం అని రాసి ఉంటుంది. అదే టైమ్‌కి సోషల్ మీడియాలో ఒక పోల్ స్టార్ట్ అవుతుంది. నగరం మంచిగా ఉండాలంటే ఎవరిని చంపాలి? అనే కాన్సెప్ట్ తో పోల్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కువ వోట్లు పడిన వాళ్లు ఒక్కొక్కరుగా చంపబడుతుంటారు. ఇప్పుడు కారి తప్ప ఈ కేసును డీల్ చేసే వాళ్ళు లేరు. పోలీసులకి ఒక్క క్లూ కూడా దొరకదు. కారి మళ్లీ కేసు తీసుకుని రంగంలోకి దిగుతాడు.
Read Also : గ్రామాన్ని కాపాడే కోడి… అన్నం తిను అంటూ వెంట పడే దెయ్యం… క్రేజీ మలయాళ సినిమా
కారి ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ముందుగా ఒక విషయం అయితే తెలుస్తుంది. గతంలో పట్టుకున్న సీరియల్ కిల్లర్ లాస్సే జైల్లో ఉన్నా, బయట ఎవరో ఒక వ్యక్తి అతని పేరు అడ్డం పెట్టుకుని హత్యలు చేస్తున్నాడని అర్థం అవుతుంది. ఇంతలో మరో షాకింగ్ ట్విస్ట్ వస్తుంది. ఆ పోల్‌లో కారి కూతురు కటియా పేరుకు ఈ సారి ఎక్కువ వోట్లు పడతాయి. ఇప్పుడు కారి ఫుల్ స్పీడ్‌లో కిల్లర్ ని ట్రాక్ చేస్తాడు. చివర్లో కిల్లర్ ఎవరో తెలిసిపోతుంది. ట్విస్ట్ ఏమిటంటే అతను కారి పాత కేసుల్లో ఒక విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్. నీవు నా లైఫ్ నాశనం చేశావు కదా, ఇప్పుడు నీ ఫ్యామిలీని చంపి రివెంజ్ తీర్చుకుంటానని కసిగా చెప్తాడు. చివరికి కిల్లర్ కారి మీద రివేంజ్ తీర్చుకుంటాడా ? కిల్లర్ని కారి జైలులో పెడతాడా ? అనే విషయాలను, ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.