Commonwealth Games 2030: ఇండియాకు అరుదైన గౌరవం దక్కింది. కామన్ వెల్త్ గేమ్స్ 2030 ( Commonwealth Games 2030) సంవత్సరం టోర్నమెంట్ కు ఇండియా ఆతిథ్యం ఇవ్వబోతోంది. 2030 కామన్వెల్త్ గేమ్స్ ఆతిధ్య నగరంగా అహ్మదాబాద్ నగరాన్ని (Ahmedabad) అధికారికంగా ప్రకటించారు. స్కాట్లాండ్ లోని గ్లాస్గోలో ( Glasgow) కామన్వెల్త్ స్పోర్ట్ జనరల్ అసెంబ్లీలో 74 దేశాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అన్ని దేశాల ప్రతినిధులు ఇండియా బిడ్ కు ఆమోదం తెలిపారు. ఇందులో 15-17 క్రీడాలు జరగనున్నాయి. వచ్చే సంవత్సరం గ్లాస్గో లో జరిగే కామన్వెల్త్ గేమ్స్ లో మాత్రం 10 స్పోర్ట్స్ ఉంటాయని వెల్లడించారు. అయితే 2030లో జరగబోయేవి శతాబ్ది గేమ్స్ అంటూ వెల్లడించారు.
Also Read: Smriti Mandhana Wedding: స్మృతి మంధానకు మరో షాక్… ఆస్పత్రిలో చేరిన కాబోయే భర్త ముచ్చల్!
2030 కామన్వెల్త్ గేమ్స్ టోర్నమెంట్ లో మొత్తం 15 నుంచి 17 క్రీడ అంశాలలో పోటీలు జరుగుతాయని అధికారికంగా స్పష్టం చేసింది కామన్వెల్త్ స్పోర్ట్స్ కమిటీ. ఇందులో టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్, అథ్లెటిక్స్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ , బాక్సింగ్, నెట్ బాల్, వెయిట్ లిఫ్టింగ్ ఇలా మొత్తం 17 గేమ్స్ ఉంటాయన్నమాట. అయితే ఇందులో మరికొన్ని గేమ్స్ ఎంపిక చేసే ప్రక్రియ వచ్చే నెల ప్రారంభం కానున్నట్లు కామన్వెల్త్ స్పోర్ట్స్ ప్రకటన చేసింది. టి20 క్రికెట్, సైక్లింగ్, డైవింగ్, హాకీ, జూడో, షూటింగ్, వీల్ చైర్, బీచ్ వాలీబాల్, బ్యాడ్మింటన్, ఆర్చరీ, స్కాష్ లాంటి గేమ్స్ కూడా ఇందులో యాడ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా టి20 క్రికెట్ ఈ 2030 కామన్వెల్త్ గేమ్స్ లో చేరితే, జనాధారణ కచ్చితంగా పెరుగుతుంది. ఈ దిశగా కామన్వెల్త్ స్పోర్ట్స్ అధ్యక్షుడు డాక్టర్ డొనాల్డ్ రుకరే ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు.
2030 కామన్వెల్త్ క్రీడాల నిర్వహణ హక్కులు ఇండియాకు దక్కడంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పందించారు. అహ్మదాబాద్ లాంటి మహానగరంలో 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం చాలా గర్వకారణం అంటూ వ్యాఖ్యానించారు. ఈ అంశం ఇండియాలోని ప్రతి పౌరుడికి గర్వకారణంగా ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా భారతదేశ పౌరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. మన ఇండియాను ప్రపంచ క్రీడా కేంద్రంగా మార్చాలన్న ఉద్దేశంతో ప్రధాని నరేంద్ర మోడీ దూసుకు వెళ్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన కృషికి ఈ కామన్వెల్త్ క్రీడాల ఆదిత్యమే నిదర్శనం అన్నారు. దశాబ్దానికి పైగా సాగిన కృషితో ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్ధి చేస్తున్నట్లు గుర్తు చేశారు. ఇండియాలో సమర్థవంతమైన ప్రభుత్వము ఉన్న నేపథ్యంలోనే ఇలాంటి ఈవెంట్లు జరుగుతాయన్నారు హోం శాఖ మంత్రి అమిత్ షా.
Breaking: India wins bid to host Commonwealth Games 2030 in Ahmedabad
Delegates of 74 Commonwealth member nations and territories ratify India's 2030 bid at Commonwealth Sport General Assembly pic.twitter.com/Q5qnhJ2o80
— Piyush Gupta (@PiyushNeekhra) November 26, 2025