OTT Movie : ఓటిటిలో దెయ్యాల సినిమాలు ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో దెయ్యాలు చాలావరకు మనుషులను భయపెడుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో, దెయ్యం ఒక అమ్మాయి తో స్నేహం చేస్తుంది. ఆ తర్వాత సన్నివేశాలు ఆసక్తికరంగా సాగిపోతాయి. క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఊహకు అందని విధంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే
స్టోరీలోకి వెళితే
కాస్పర్ అనే పేరున్న ఒక చిన్న దెయ్యం, ఒక పాత హాంటెడ్ ఇంట్లో తన ముగ్గురు మామలు (స్ట్రెచ్, స్టింకీ, ఫాట్సో)తో కలిసి నివసిస్తుంది. కాస్పర్ మాత్రం ఇతర దెయ్యాల్లా భయపెట్టడానికి ఇష్టపడడు. మనుషులతో స్నేహం చేయాలని కోరుకుంటాడు. ఇంతలో ఆ ఇంటిని వారసత్వంగా పొందిన క్రిటెండన్ అనే స్త్రీ, ఇంట్లో దాగి ఉన్న నిధిని కనిపెట్టాలని అనుకుంటుంది. ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయని ఆమె తెలుసుకుంటుంది. ఆమె జేమ్స్ అనే ఒక పారానార్మల్ థెరపిస్ట్‌ను, దెయ్యాలను తొలగించడానికి నియమిస్తుంది. జేమ్స్ తన కూతురు కాట్ హార్వీతో కలిసి, ఆ ఇంటికి దెయ్యాలను వెల్లగొట్టాడానికి వస్తాడు. అయితే కాస్పర్, కాట్‌తో స్నేహం చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతని మామలు వాళ్ళని భయపెట్టడానికి చూస్తుంటారు. ఈ క్రమంలో కాస్పర్, కాట్ మధ్య ఒక అందమైన బంధం ఏర్పడుతుంది.
ఈ స్టోరీలో ఒక ట్విస్ట్ ఇప్పుడు వస్తుంది. కాస్పర్ తన గత జీవితం గురించి, తన మరణం గురించి తెలుసుకుంటాడు. అతను ఒకప్పుడు మనిషిగా ఉన్నాడని, అతని తండ్రి ఒక లాజరస్ అనే యంత్రాన్ని తయారు చేశాడని, అది దెయ్యాలను తిరిగి జీవించేలా చేయగలదని తెలుసుకుంటాడు. ఈ విషయం కరిగాన్ కి కూడా తెలిసిపోతుంది. ఆమె ఈ యంత్రాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించాలని ప్లాన్ చేస్తుంది. కానీ కాస్పర్, కాట్, జేమ్స్ కలిసి ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు. చివరికి కాస్పర్ తన మానవ జీవితాన్ని తిరిగి పొందుతాడా ? ఆ యంత్రం పని చేస్తుందా ? కరిగాన్ ఈ యంత్రాన్ని దుర్వినియోగం చేస్తుందా ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : మిస్ అవ్వకుండా చూడాల్సిన హార్రర్ సినిమాలు… రాత్రి పూట ఒంటరిగా చూశారో వణుకే
జియో హాట్ స్టార్ (Jio hotstar) లో
ఈ సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ మూవీ పేరు ‘క్యాస్పర్’ (Casper). 1995లో వచ్చిన ఈ మూవీకి బ్రాడ్ సిల్బెర్లింగ్ దర్శకత్వం వహించారు.ఇందులో క్రిస్టినా రిక్కీ, బిల్ పుల్‌మాన్, కాథీ మోరియార్టీ, ఎరిక్ ఐడిల్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ స్టోరీ స్నేహంగా మెలిగే ఒక పిల్ల దెయ్యం చుట్టూ తిరుగుతుంది. 1995 మే 26న ఈ మూవీ యూనివర్సల్ పిక్చర్స్ ద్వారా థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.