BigTV English

OTT Movie : ఇంట్లో మొగుడు, వీధిలో ప్రియుడు … ఈ చురకత్తికి పదునెక్కువే… సింగిల్స్ కి మస్త్ స్టఫ్

OTT Movie : ఇంట్లో మొగుడు, వీధిలో ప్రియుడు … ఈ చురకత్తికి పదునెక్కువే… సింగిల్స్ కి మస్త్ స్టఫ్

OTT Movie : సైకలాజికల్ డ్రామా, ఇంటెన్స్ రిలేషన్‌షిప్ స్టోరీస్ ఇష్టమైతే మీకు ఈ మూవీ బాగా నచ్చుతుంది. ఇది ఒక సాధారణ జీవితం గడుపుతున్న ఒక జంట జీవితంలోకి ఒక అపరిచిత వ్యక్తి వచ్చిన తర్వాత వచ్చే సంఘటనల చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఒక ఎమోషనల్, ఎరోటిక్ థ్రిల్లర్, రిలేషన్‌షిప్స్‌లోని టెంప్టేషన్ గురించి ఆలోచింపజేసే కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘Caught’ 1996లో విడుదలైన ఒక అమెరికన్ ఎరోటిక్ థ్రిల్లర్ డ్రామా సినిమా. దీన్ని రాబర్ట్ ఎం. యంగ్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో ఎడ్వర్డ్ జేమ్స్ ఓల్మోస్ (జో), కొంచితా అలోన్సో (బెట్టీ), ఆరీ వెర్వీన్ (నిక్), స్టీవెన్ షబ్ (డానీ) ముఖ్య పాత్రల్లో నటించారు. 1 గంట 50 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.5/10, Rotten Tomatoesలో 77% రేటింగ్ ఉంది. Amazon Prime Vodeo లో ఈ సినిమా అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

జో, బెట్టీ అనే జంట జెర్సీ సిటీలో ఒక చిన్న షాప్ లో చేపలను అమ్ముతూ ఒక సాధారణ జీవితం గడుపుతుంటారు. జోకి తన షాప్ అంటే ప్రాణం, రోజూ ఉదయం 5 గంటలకే లేచి చేపలు కొనడానికి మార్కెట్‌కి వెళ్తాడు. బెట్టీకి మాత్రం ఈ జీవితం నచ్చదు. షాప్‌ని అమ్మేసి బెటర్ లైఫ్ గడపాలని కోరుకుంటుంది. వాళ్ల కొడుకు డానీ హాలీవుడ్‌లో స్టాండ్-అప్ కమెడియన్‌గా సక్సెస్ కావడానికి వెళ్తాడు. కానీ అతని పెర్ఫార్మెన్స్‌లు అంతగా ఆకట్టుకోవు. ఒక రోజు నిక్ అనే ఒక డ్రిఫ్టర్ జో షాప్‌లోకి వస్తాడు. అతను పోలీసుల నుంచి తప్పించుకుంటూ ఉంటాడు. బెట్టీకి అతనిపై జాలి కలిగి, అతన్ని ఇంటికి తీసుకెళ్లి, డానీ గదిలో ఉంటూ షాప్‌లో పని చేయమని చెబుతుంది. జో కూడా నిక్‌ని కొడుకులా చూసుకుంటాడు. అతనికి చేపల వ్యాపారం నేర్పిస్తాడు. నిక్ ఈ షాప్‌లో బాగా సెట్ అవుతాడు. జోకి భవిష్యత్తు మీద ఆశలు కలుగుతాయి.

అయితే బెట్టీలో మాత్రం నిక్ పట్ల అట్రాక్షన్ మొదలవుతుంది. ఇక నిక్, బెట్టీ మధ్య రహస్యంగా అఫైర్ మొదలవుతుంది. జోకి ఈ విషయం తెలీకుండా వీళ్ళు జాగ్రత్త పడుతుంటారు. కాని నిక్‌ని జో నమ్ముతూనే ఉంటాడు. అయితే డానీ అతని భార్య ఇంటికి తిరిగి వచ్చినప్పుడు విషయాలు మారిపోతాయి. డానీకి తన తల్లి, నిక్ మధ్య ఏదో తేడాగా ఉందని అనుమానం వస్తుంది. అతను ఈర్ష్య, కోపంతో నిండిపోతాడు. ఈ పరిస్థితి ఒక ట్రాజిక్, షాకింగ్ ముగింపుకు దారితీస్తుంది. ఇది సినిమాని చాలా ఎమోషనల్, డిస్టర్బింగ్‌గా చేస్తుంది. డానీ వల్ల స్టోరీ ఎలాంటి మలుపు తీసుకుంటుంది ? బెట్టీ విషయం జో కి తెలుస్తుందా ? బెట్టీ తన తప్పును తెలుసుకుంటుందా ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also :మోస్ట్ స్కేరీయెస్ట్ హర్రర్ ఫిల్మ్… కలలోనూ వెంటాడే భయంకరమైన సీన్స్… ప్యాంట్ తడిపించే మూవీ

Related News

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

Kotthapallilo Okappudu OTT: ఓటీటీ విడుదలకు సిద్ధమైన  కొత్తపల్లిలో ఒకప్పుడు… స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో… ఒకడి తరువాత మరొకడితో ఇదేం పని పాపా?

Big Stories

×