OTT Movie : ఓటీటీలో ఒక మలయాళం సినిమా ఆకట్టుకుంటోంది. ఒక పోలీస్ కానిస్టేబుల్ జీవితంలో ఊహించని ట్విస్ట్‌ని ఈ చిత్రం ఆసక్తికరంగా చూపిస్తుంది. మలయాళం నటుడు కొట్టయం రమేష్ నటన ఈ సినిమాకి హైలెట్ గా నిలిచింది. ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
సైనాప్లే లో స్ట్రీమింగ్
ఈ మలయాళం ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘Palayam PC’. 2024లో వచ్చిన ఈ సినిమాకు V.M. అనిల్ దర్శకత్వం వహించారు. ఇందులో కొట్టయం రమేష్, రాహుల్ మాధవ్, జాఫర్ ఇడుక్కి ప్రధాన పాత్రల్లో నటించారు. 2024 జనవరి 5న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, 2024 నవంబర్ 29 నుంచి Saina Play ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో ఈ సినిమాకి 8.7/10 రేటింగ్ కూడా ఉంది.
Read Also : ఏం సినిమారా బాబూ… వయసులో తనకన్నా పెద్దమ్మాయిలతోనే ఆ పని… ఈ డైరెక్టర్ మామూలోడు కాదు
ఈ స్టోరీ చంద్రన్ నాయర్ (కొట్టయం రమేష్) అనే పోలీస్ కానిస్టేబుల్ చుట్టూ తిరుగుతుంది. ఇతను పాలయం అనే చిన్న పోలీస్ ఎయిడ్ పోస్ట్‌లో రాత్రి డ్యూటీ చేస్తూ, ప్రశాంతంగా, రిస్క్ లేకుండా జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంటాడు. ఈ జీవితం వల్ల సహోద్యోగులు అతన్ని “పాలయం PC” అని ఏడిపిస్తూ ఉంటారు. అతను రాత్రిపూట స్టేషన్‌లో కూర్చొని, ధైర్యవంతమైన పోలీస్‌గా మెడల్ అందుకునే ఊహల్లో మునిగిపోతుంటాడు. కానీ ఒక అనుకోని ట్విస్ట్‌లో, అతని జీవితం తలకిందులవుతుంది. ఒక రోజు చంద్రన్‌కి ఒక సివిల్ యాక్టివిస్ట్ అమ్మాయిని రక్షించే డ్యూటీ అప్పజెప్పబడుతుంది. ఆ అమ్మాయి శబరిమల సంప్రదాయాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆలయంలోకి ప్రవేశించడంతో, ఆమెకు ప్రజల నుండి బెదిరింపులు వస్తాయి. ఈ డ్యూటీ కోసం చంద్రన్‌ని ఆమెకు రక్షణగా ఒక ఇంట్లో ఏర్పాటు చేస్తారు.
ఈ బాధ్యత చంద్రన్ రొటీన్ జీవితాన్ని, అతని భయాలను పూర్తిగా మార్చేస్తుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్‌లో చంద్రన్ క్వైట్ లైఫ్, అతని కుటుంబ జీవితం, సహోద్యోగుల ఇంటరాక్షన్స్‌తో సరదాగా సాగుతుంది. సెకండ్ హాఫ్‌లో యాక్టివిస్ట్ రక్షణ డ్యూటీతో సస్పెన్స్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ వస్తాయి. చంద్రన్ తన భయాలను అధిగమించి, ఆమెను కాపాడే ప్రయత్నంలో ఊహించని సంఘటనలను ఎదుర్కొంటాడు. క్లైమాక్స్‌లో అతని ధైర్యం, బాధ్యతాయుతమైన నిర్ణయాలు అతన్ని నిజమైన హీరోగా మార్చి, సర్వీస్ మెడల్‌ని అందుకునేలా చేస్తాయి. చంద్రన్ ఎదుర్కున్న సంఘటనలు ఏమిటి ? అతనికి మెడల్ ఎలా వస్తుంది ? అనేవిషయాలను ఈ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.