BigTV English
Advertisement

OTT Movie : ఈ బీచ్ కెళితే ముసలి వాళ్ళైపోతారు… థ్రిల్లింగ్ ట్విస్టులు, ఊహించని సర్ప్రైజులు

OTT Movie : ఈ బీచ్ కెళితే ముసలి వాళ్ళైపోతారు… థ్రిల్లింగ్ ట్విస్టులు, ఊహించని సర్ప్రైజులు

OTT Movie : కొన్ని హాలీవుడ్ సినిమాలను చూస్తే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. స్టోరీలు కూడా అలా ఉంటాయి మరి. ఈ సినిమాలు ఓటీటీలో దుమ్ము లేపుతూ ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా ఒక బీచ్ లో జరిగే వింత సంఘటనల చుట్టూ తిరుగుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఒక్క రోజులోనే ముసలి వయసుకు వెళ్తుంటారు. ఈ సినిమా చివరివరకూ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


జియో హాట్ స్టార్ (Jio hotstar) లో

ఈ అమెరికన్ బాడీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ఓల్డ్’ (Old). 2021 లో వచ్చిన ఈ హాలీవుడ్ మూవీకి దర్శకుడు M. నైట్ శ్యామలన్ దర్శకత్వం వహించారు. ఇందులో గేల్ గార్సియా బెర్నాల్, విక్కీ క్రిప్స్, రూఫస్ సెవెల్, అలెక్స్ వోల్ఫ్, థామసిన్ మెకెంజీ, అబ్బే లీ, నిక్కీ అముకా-బర్డ్ వంటి నటులు నటించారు. ఈ మూవీ 2021 జూలై 23న యునైటెడ్ స్టేట్స్‌లో థియేటర్లలో విడుదలైంది. ఒక మిస్టరీ బీచ్ చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.


స్టోరీలోకి వెళితే

గేల్, ప్రిస్కా అనే దంపతులకు ట్రెంట్, మాడాక్స్ అనే ఇద్దరు పిల్లలు ఉంటారు. గేల్, ప్రిస్కా దంపతులు కొన్ని కారణాల వల్ల విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఒక రోజు ఈ ఫ్యామిలీ మొత్తం ఒక విహారయాత్రకు వెళతారు. వీళ్ళు విడాకుల గురించి ఆలోచిస్తున్న సమయంలో, ఈ యాత్ర తమ కుటుంబానికి ఒక చివరి అవకాశంగా భావిస్తారు. మళ్ళీ కలసి జీవించే అవకాశం ఈ యాత్ర వల్ల ఏమైనా వస్తుందేమో అని అనుకుంటారు. వీళ్ళంతా ఒక రిసార్ట్ లో దిగుతారు. ఈ రిసార్ట్ మేనేజర్ వీళ్ళతో పాటు మరికొంత మందిని సీక్రెట్ బీచ్‌కు తీసుకెళతాడు. అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. బీచ్‌లోకి ప్రవేశించిన కొద్దిసేపటికే, విచిత్రమైన సంఘటనలు జరగడం మొదలవుతాయి. పిల్లలు అసాధారణ వేగంతో పెరుగుతున్నట్లు కనిపిస్తారు. పెద్దలు కూడా వారి శరీరాల్లో వృద్ధాప్య లక్షణాలను గమనిస్తారు. ఒక గంట ఈ బీచ్‌లో గడిపితే , వారి జీవితంలో సుమారు రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది.

అంటే వీళ్ళు బీచ్‌లో ఒక రోజు గడిపితే, వాళ్ళ వయసు దాదాపు 48 సంవత్సరాలు గడచిపోతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వాళ్ళకు తెలిసిపోతుంది. ఈ బీచ్‌లో చిక్కుకున్న వాళ్ళు బయటపడటానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం విఫలమవుతుంది. బయటికి వెళ్లే తొందరలో కొందరు చనిపోతారు. అదే సమయంలో బతికి ఉన్న వాళ్ళ శరీరాలు వేగంగా వృద్ధాప్యం కావడం వల్ల వాళ్ళు శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లలు టీనేజ్‌కు చేరుకుంటారు. పెద్దలు వృద్ధాప్యం లోకి వెళ్లిపోతారు. చివరికి వీళ్ళంతా ఏమౌతారు ? ఆ బీచ్ కి వెళ్తే ఎందుకు వృద్ధాప్యం వస్తోంది ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ హారర్ థ్రిల్లర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Read Also : మహిళలను మాత్రమే చంపే సీరియల్ కిల్లర్… ట్విస్ట్ లతో పిచ్చెక్కించే కన్నడ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

Related News

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Phaphey Kuttniyan OTT : అందంగా దోచుకునే అమ్మాయిలు… కామెడీ మూవీకి క్రైమ్ ట్విస్ట్… 3 నెలల తరువాత ఓటీటీలోకి

Big Stories

×