E-Paper
Advertisement

Comedy Movie OTT : ఈషా రెబ్బ లేటెస్ట్ కామెడీ మూవీ ఓటీటీ ఎంట్రీ… ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే ?

Comedy Movie OTT : ఈషా రెబ్బ లేటెస్ట్ కామెడీ మూవీ ఓటీటీ ఎంట్రీ… ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే ?
Advertisement

Comedy Movie OTT : తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటించిన తెలుగు సినిమా ‘ఓం శాంతి శాంతి శాంతిహి’ 2026 జనవరి 30న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఇది బాసిల్ జోసెఫ్ నటించిన మలయాళం సినిమా ‘జయ జయ జయ జయహే’ మూవీకి రీమేక్ కూడా. ఈ సినిమా మలయాళంలో 50 కోట్లకు పైగా కలెక్షన్స్‌ తో బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. అయితే తెలుగులో మిక్స్డ్ టాక్ తో నడుస్తోంది. గోదావరి ప్రాంతంలో జరిగే ఈ కథలో, తరుణ్ భాస్కర్ తన భార్యపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నించే ఓంకార్ పాత్రలో నటించాడు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ హక్కులను ఓ ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుందో తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అంటే

ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించిన ‘ఓం శాంతి శాంతి శాంతి’ (Om Shanti Shanti Shantihi )జనవరి 30న థియేటర్లలోకి వచ్చింది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా నటించిన ఈ సినిమా డిజిటల్ హక్కులను ‘ఆహా’ ఓటీటీ ఫ్యాన్సీ ధరకు పొందిందనట్లు తెలుస్తోంది. ఈ నెల థర్డ్ వీక్ లో ఇది స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను ప్రమోట్ చేయడంలో నిర్మాతలు కూడా బాగానే కష్టపడ్డారు. దీంతో సినిమా మీద కూడా బాగానే ఆశలు పెట్టుకున్నారు. ఇక ఆడియన్స్ నుంచి ఓ మాదిరి రెస్పాన్స్ అయితే వస్తోంది ఈ సినిమాకి. ఈ సినిమాను డిజిటల్ గా చూడాలనుకుంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. అయితే మలయాళ వర్షెన్ ఇప్పుడు ఓటీటీలో తెలుగులోనే ఉంది. jio హాట్ స్టార్ లో ఈ సినిమాను చూడవచ్చు.

స్టోరీ ఏమిటంటే

Advertisement

చదువుకోవాలనే కోరిక బాగా ఉన్న ఒక మధ్యతరగతి అమ్మాయి ప్రశాంతి (ఈషా రెబ్బా). ఆమె బాగా చదువుకుని మంచి ఉద్యోగం చేయాలని అనుకుంటుంది. కానీ ఆమె తండ్రి బలవంతం మీద ఓంకర్ నాయుడు (తరుణ్ భాస్కర్) అనే వ్యక్తితో పెళ్లి జరుగుతుంది. పెళ్లి కి ముందు చదివిస్తానని మాట ఇచ్చి, పెళ్లి అయ్యాక మాట తప్పుతాడు ఓంకర్. ఓంకర్ పక్కా పురుషాహంకారి. కోపం వస్తే భార్యపై చేయి చేసుకునే రకం. పెళ్లైన కొత్తలోనే తన భర్త ప్రవర్తనతో విసిగిపోయిన ప్రశాంతి, అతన్ని ఎదురించలేక మొదట్లో మౌనంగా భరిస్తుంది. కానీ ఒకానొక దశలో తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి తాను కూడా ఎదురు తిరుగుతుంది.

ప్రశాంతి కరాటే నేర్చుకున్న సంగతి తెలియక ఆమెపై చేయి చేసుకుంటాడు ఓంకర్. చేయిచేసుకున్న భర్తను కూడా శాంతి తనదైన కరాటే స్టైల్ లో చితకబాదుతుంది. ఆ వీడియో వైరల్‌ కూడా అవుతుంది. ఆ తరువాత వచ్చే సీన్స్ చాలా ఆసక్తిగా ఉంటాయి. చివరకు ఓంకర్ తన తప్పు తెలుసుకున్నాడా ? వీరిద్దరి వైవాహిక జీవితం ఎలాంటి ముగింపును ఇస్తుంది ? అనేదే ఈ సినిమా మిగతా కథ. ఈ కాలం పెళ్లి కొడుకులు, ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే.

Advertisement

Read Also : పదేళ్ళ తరువాత లవర్ కోసం వస్తే… మూగ భర్తతో షాక్ ఇచ్చే అమ్మాయి… గుండెను బరువెక్కించే కథ

Tags

Related News

ఒంటి నిండా రక్తంతో అపరిచిత మహిళ… నిజమైన మొసళ్ళతో తీసిన డార్క్ హర్రర్ అడ్వెంచర్

నైట్ క్లబ్ లో డ్రీం గర్ల్… కట్ చేస్తే కిరాక్ ట్విస్ట్… మనసుకు హత్తుకునే లవ్ స్టోరీ

హఠాత్తుగా ఆకాశంలో హోల్… టైమ్ ట్రావెల్ తో థ్రిల్లింగ్ సై-ఫై అడ్వెంచర్

విశ్వంభర ఓటీటీ డీల్ పై సందిగ్ధత.. తెరపైకి కొత్త విడుదల తేదీ!

స్కూల్ పిల్లాడి దారుణ హత్య… ప్రాణం పణంగా పెట్టి నిజం తేల్చే తండ్రి… ఊపిరి బిగబట్టించే సైకలాజికల్ మిస్టరీ

పగ, ప్రతీకారంతో క్రిటిక్ ప్రాణాంతక కుట్రలు… ఈ డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

​ఏలియన్స్ దాడి నుండి భూమిని కాపాడే ఏజెంట్లు… మైండ్ బ్లోయింగ్ సై-ఫై హై-టెక్ యాక్షన్ అడ్వెంచర్

వైట్ హౌస్ పై ఉగ్రవాదుల అటాక్… ప్రెసిడెంట్ ను కాపాడేందుకు సీక్రెట్ ఏజెంట్ మైండ్ బ్లాక్ ప్లాన్… డెడ్లీ యాక్షన్ థ్రిల్లర్ తెలుగులో

Big Stories

Advertisement
×