BigTV English

Hyderabad News: హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి

Hyderabad News: హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి


Hyderabad News: హైద‌రాబాద్‌ సిటీలో ఆదివారం రాత్రి జరిగిన శ్రీకృష్ణాష్ట‌మి వేడుక‌ల్లో విషాదం చోటు చేసుకుంది. రథాన్ని లాక్కుంటూ వెళ్తున్న సమయంలో భక్తులకు విద్యుత్‌ తీగ తగలింది. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడ్డారు. వారిని వెంటనే సమీపంలో ఆసుపత్రికి తరలించారు.

హైదరాబాద్ సిటీలో రామంత్‌పూర్ ప్రాంతంలో శ్రీకృష్ణాష్ట‌మి వేడుక విషాదంగా మారింది. శనివారం శ్రీకృష్ణాష్ట‌మి కావడంతో ఆదివారం ఊరేగింపు ప్లాన్ చేశారు నిర్వాహకులు. గోఖలే నగర్‌ ప్రాంతంలో శ్రీ కృష్ణుడి ఊరేగింపు వేడుకలో అపశ్రుతి చోటు చేసుకుంది. రాత్రి 12 గంటల సమయంలో రథాన్ని లాక్కుంటూ భక్తులు భారీ ఎత్తున వెళ్తున్నారు.


రథం ఎత్తు ఎక్కువగా ఉండడం, మరోవైపు వర్షానికి విద్యుత్ తీగలు తడిచి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రథాన్ని లాక్కుంటూ వెళ్తున్న భక్తులకు ఒక్కసారిగా విద్యుత్ షాక్ కొట్టింది. మొత్తం 9 మంది భక్తులకు విద్యుత్‌ షాక్‌ కొట్టింది. స్పాట్‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. యాదవ్‌ సంగం ఫంక్షన్‌ హాల్‌ వద్ద ఈ దుర్ఘటన జరిగింది.

మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే స్థానిక పోలీసులు అంబులెన్స్ సమాచారం ఇవ్వడంతో క్షణాల వ్యవధిలో అక్కడికి చేరుకుంది. షాక్‌ కొట్టి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని ట్రీట్ మెంట్ నిమిత్తం రామాంతపూర్‌లో ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: వాయగుండంగా అల్పపీడనం.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్  

మృతుల వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణ యాదవ్- 24, శ్రీకాంత్ రెడ్డి-35, సురేష్ యాదవ్-34, రుద్ర వికాస్ -39, రాజేంద్ర‌రెడ్డి-39 ఉన్నారు. మరణించినవారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.  ఘటన వెనుక అసలు కారణం వెలుగులోకి వచ్చింది.

ర‌థాన్ని లాగుతున్న వాహ‌నం చెడిపోయింది. ఆ వాహనాన్ని ప‌క్క‌కు నిలిపి వేశారు. చేసేదేమీ లేక ర‌థాన్ని చేతుల‌తో లాగుతూ ముందుకు భక్తులు ముందుకు కదిలారు. ఈ క్ర‌మంలో ర‌థానికి విద్యుత్ తీగ‌లు త‌గిలాయని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

రాత్రి 12 గంటలకు కరెంటు వైర్ కిందికి వేలాడడంతో ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు. హై టెన్షన్ వైర్ల నుంచి ఓ వైర్ వేలాడుతుండడంతో రథానికి తాకి నిప్పురవ్వలు ఎగిసిపడ్డాయి. రథాన్ని పట్టుకున్న వాళ్లంతా ఒక్కసారిగా దూరంగా పడిపోయారు.  రథంపై ఉన్న పూజారికి మరికొందరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని చెబుతున్నారు.

కేవలం రథాన్ని పట్టుకొని లాక్కెళ్తున్న వారికి కరెంట్ షాక్ తగిలింది. ఘటన తర్వాత వారంతా కిందిపడిపోయారు. వెంటనే వారిని సిపిఆర్ చేసి బతికించే ప్రయత్నం చేశారు. హాస్పిటల్ వెళ్లేలోపే ఐదుగురు చనిపోయారు. గాయ‌ప‌డిన వారిలో కేంద్ర‌మంత్రి కిష‌న్ రెడ్డి గ‌న్‌మెన్ శ్రీనివాస్ ఉన్న‌ట్లు స‌మాచారం.  గతంలో ఈ తరహా ఘటనలు జరగలేదని, ఇదే తొలిసారని అంటున్నారు.  

 

Related News

Heavy Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. జనం అతలాకుతలం.. బయటకు వెళ్లోద్దు

Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

puppy Adoption: శునకాల దత్తతకు మీరు సిద్ధమా? అయితే ఇక్కడికి వెళ్లండి!

Heavy rains alert: తెలంగాణను దంచికొట్టబోతున్న భారీ వర్షాలు.. 24 గంటల హెచ్చరిక!

Nagarjuna Sagar: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 22 గేట్లు ఎత్తివేత

Big Stories

×