Courtroom Drama Serie: కోర్ట్‌రూమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా సిరీస్ లు ఇప్పడు బాగా ట్రెండింగ్ లో ఉంటున్నాయి. సమాజంలో దైవభక్తి పేరుతో సాగే మోసాలు, అధికార బలం, న్యాయం కోసం పోరాడే ఒక సామాన్య అమ్మాయి కథగా ‘హుంకార్: ది రోర్’ (Hunkkaar: The Roar) అనే సిరీస్ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక గురువుపై 17 ఏళ్ల మీనూ రావత్ లైంగిక ఆరోపణ నేపథ్యం కేసు చుట్టూ సాగే ఉత్కంఠభరితమైన స్టోరీ ఇది.
మధ్యప్రదేశ్‌లోని ఖార్‌గంజ్ అనే చిన్న పట్టణంలో ‘సునీల్ బాప్జీ చకోసి’ (రఘువీర్ యాదవ్) అనే ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక గురువు (గాడ్‌మన్) ఉంటాడు. సమాజంలో, రాజకీయంలో అతనికి అపారమైన అనుచరులు, భక్తులు మరియు పట్టు ఉంటాయి. అయితే, మీనూ రౌత్ (అనీత్ పడ్డ) అనే 17 ఏళ్ల మైనర్ అమ్మాయి బాప్జీ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని అసలు స్వరూపం బయటపడటం మొదలవుతుంది. కేసు కోర్టుకు వెళ్లడంతో రెండు వర్గాల వాదనలు మొదలవుతాయి.
ఆ తర్వాత కేసును ఇన్వెస్టిగేట్ చేయడానికి ACP జస్లీన్ సింగ్ సోయిన్ (ఫాతిమా సనా షేక్) రంగంలోకి దిగుతుంది. ఒకవైపు బాప్జీ భక్తుల నుంచి బెదిరింపులు, సమాజం నుంచి ఆరోపణలు (విక్టిమ్ బ్లేమింగ్), మరోవైపు రాజకీయ, అధికార ఒత్తిళ్లు ఎదురవుతాయి. అయినప్పటికీ మీనూ తన లాయర్ (మహ్మద్ జీషాన్ అయ్యూబ్) సహాయంతో కోర్టులో ఎలా పోరాడింది, మీడియా మరియు పోలీసులు ఈ కేసును ఎలా ఎదుర్కొన్నారు, చివరికి వ్యవస్థను దాటుకుని ఆ దుష్టశక్తికి శిక్ష పడేలా ఎలా పోరాడారనేదే ఈ ‘హుంకార్’ సిరీస్ అసలు కథ. ఇది కేవలం ఓ కేసు విచారణ మాత్రమే కాదు. అధికారం, విశ్వాసం, భయం, న్యాయం మధ్య జరిగే పోరాటంగా కథ ఉత్కంఠతను పెంచుతుంది.
‘హుంకార్: ది రోర్’ (Hunkkaar: The Roar) హిందీ క్రైమ్ థ్రిల్లర్, కోర్ట్‌రూమ్ డ్రామా సిరీస్. 2026 సెప్టెంబర్ 25 నుంచి జియోహాట్‌స్టార్ (JioHotstar)లో స్ట్రీమింగ్ అవుతోంది. నిత్య మెహ్రా, కరణ్ డి. కపాడియా సృష్టించిన ఈ 6-ఎపిసోడ్ల సిరీస్‌లో అనీత్ పడ్డ, రఘువీర్ యాదవ్, ఫాతిమా సనా షేక్ ప్రధాన పాత్రల్లో నటించారు. హిందీతో పాటు తెలుగు ఆడియోతో కూడా ఈ కోర్ట్‌రూమ్ అండ్ ఇన్వెస్టిగేటివ్ డ్రామా అందుబాటులో ఉంది.
Read Also: అమ్మాయిలతో ప్రతీ రాత్రి ఆ పని… ఆ గోడల మధ్య దాగున్న భయంకరమైన రహస్యం… డార్క్ డిస్టోపియన్ థ్రిల్లర్