Khairatabad: పోలీసుల అత్యుత్సాహనికి గణేశ్ నిమజ్జనంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపుతుంది. హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ ప్రాంతంలో చోటు చేసుకున్న ఘటన సంచలనవం రేపుతుంది. అయితేన గణేశ్ నిమజ్జనం సందర్భంగా యువతి, యువకులు కలిసి డ్యాన్స్ చేసారు. దీంతో ఇంతలో పోలీసులు డ్యాన్స్ చేస్తున్న యువతి, యువకులు వద్దకు అక్కడికి చేరుకొని వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు.
దీంతో ఓ యువకుడు (20) భయపడిపోయి ట్యాంకర్ మీద ఎక్కే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఒక ట్రక్ కింద పడి అక్కడికక్కడే యువకుడు మృతి చెందాడు. దీంతో పోలీసుల అత్యుత్సాహం వల్లే తమ ఫ్రెండ్ చనిపోయాడని తోటి స్నేహితుల నిరసన వ్యక్తం చేశారు. అమితే నిరసనకు దిగిన యువతి, యువకులను పోలీసులు లాగిపడేసారు.
అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న సీనియర్ పోలీస్ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించి, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరుపుతామని యువకులకు పోలీసులు హామీ ఇవ్వడంతో నిరసనకారులు శాంతించారు. దీంతో మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి యవకుడి మృతదేహన్ని తరలించారు.
Also read: ఖాతాదారులకు అలర్ట్..మూడు రోజుల పాటు బ్యాంకులు బంద్