E-Paper
Advertisement

హార్వర్డ్ మేధావి వరుస బాంబు దాడులు… టెడ్ కాజిన్స్కీ వేట వెనుకున్న అసలు కథ… షాకింగ్ క్రైమ్ డ్రామా

హార్వర్డ్ మేధావి వరుస బాంబు దాడులు… టెడ్ కాజిన్స్కీ వేట వెనుకున్న అసలు కథ…  షాకింగ్ క్రైమ్ డ్రామా
Advertisement

True Crime Thriller: అమెరికా చరిత్రలో అత్యంత భయంకరమైన కుట్రదారులుగా పేరుగాంచిన టెడ్ కాజిన్స్కి జీవితంలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా జానస్ మెట్జ్ దర్శకత్వంలో వచ్చిన సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ ‘యూనాబాంబర్’ (UNABOMBER). అసలు ఓ సాధారణ విద్యార్థి నుంచి భయంకరమైన నేర ప్రపంచంలోకి టెడ్ కాజిన్స్కీ ఎలా వెళ్లాడు? అతన్ని పట్టుకోవడానికి FBI చేసిన వేట వెనుక అసలు కథ ఏంటి? టెడ్ కాజిన్స్కీ జీవితంలోని చీకటి కోణాలను చూపించే క్రైమ్ డ్రామానే ఈ మూవీ కథ. ఈ మూవీ థియేటర్లకు వెళ్ళకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

కథలోకి వెళ్తే…

టెడ్ కాజిన్స్కీ చిన్న వయసులోనే అసాధారణమైన మేధస్సును చూపిస్తాడు. అతని ప్రతిభ కారణంగా హార్వర్డ్‌లో చదివే అవకాశం వస్తుంది. చదువులో అద్భుతంగా రాణించే టెడ్ భవిష్యత్తులో పెద్ద శాస్త్రవేత్తగా ఎదుగుతాడని అందరూ భావిస్తారు. కానీ అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు అతని ఆలోచనా విధానాన్ని క్రమంగా మార్చేస్తాయి. హార్వర్డ్‌లో చదువుతున్న సమయంలో అతనిపై జరిగిన ఓ రహస్య ప్రయోగం కూడా కథలో కీలకంగా మారుతుంది. ఆ అనుభవం తర్వాత అతనిలో పెరిగిన అసంతృప్తి, సమాజంపై అతని ఆలోచనలు మరింత తీవ్రమవుతాయి.

Advertisement

కొంతకాలానికి టెడ్ సాధారణ జీవితానికి దూరమవుతాడు. సమాజం, ఆధునిక సాంకేతికతపై తీవ్ర వ్యతిరేకత పెంచుకుంటాడు. చివరికి బాంబులను తయారు చేసి వివిధ ప్రాంతాలకు పంపడం ప్రారంభిస్తాడు. అతని దాడులు ఒక్కొక్కటిగా జరుగుతుండటంతో FBIకి కూడా ఇది పెద్ద సవాలుగా మారుతుంది. ఎవరు ఈ బాంబులు పంపుతున్నారు? ఎందుకు పంపుతున్నారు? అతని లక్ష్యం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం కోసం అధికారులు సంవత్సరాల తరబడి ప్రయత్నిస్తారు. మరోవైపు టెడ్ తన గుర్తింపును దాచుకుంటూ దాడులు కొనసాగిస్తుంటాడు.

కేసు దర్యాప్తు ముందుకు సాగుతున్న కొద్దీ FBI అధికారులు అతని గురించి చిన్న చిన్న ఆధారాలను కలుపుకుంటారు. అతని రచనలు, ఆలోచనలు, బాంబు దాడుల విధానం… ఇవన్నీ కలిపి చివరికి ఓ వ్యక్తి వైపు దర్యాప్తు మళ్లుతుంది. ఓ మేధావి ఎలా నేరస్థుడిగా మారాడు? అతని ఆలోచనలు ఎలా తీవ్ర రూపం దాల్చాయి? FBI అతన్ని ఎలా వేటాడింది? అనే అంశాలను సినిమా నిజ జీవిత ఘటనల ఆధారంగా చూపిస్తుంది.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

Advertisement

రస్సెల్ క్రో, జాకబ్ ట్రెంబ్లే, షైలీన్ వుడ్లీ, అన్నాబెల్ వాలిస్, అలెగ్జాండర్ లుడ్విగ్ తదితరులు నటించిన ‘యునాబాంబర్’ (UNABOMBER)కు జానస్ మెట్జ్ దర్శకత్వం వహించారు. ఇది నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన క్రైమ్, డ్రామా, థ్రిల్లర్. ఈ సినిమా 2026 సెప్టెంబర్ 25న నేరుగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ క్ వచ్చింది. ఇది ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషలలో కూడా స్ట్రీమింగ్ అవుతుంది.

Read Also: తండ్రే హత్య చేశాడని అనుమానం… షాకింగ్ మర్డర్ మిస్టరీ

Tags

Related News

మాఫియా సామ్రాజ్యాన్ని మట్టుబెడదాం అనుకుంటే మెంటల్ మాస్ షాక్… క్లాసిక్ క్రైమ్ డ్రామా

కోమా నుంచి లేచిన మహిళ జీవితంలో గత ఆరు నెలలు మిస్సింగ్… భర్త కనిపించకపోవడంతో ట్విస్ట్… షాకింగ్ సైకలాజికల్ థ్రిల్లర్

పవర్‌ఫుల్ గురువుపై 17 ఏళ్ల అమ్మాయి షాకింగ్ ఆరోపణ… హై-టెన్షన్ కోర్ట్‌రూమ్ క్రైమ్ థ్రిల్లర్

మూడేళ్ల ప్రేమకు బ్రేకప్… ఎక్స్ పై రివెంజ్‌తో మతిపోగొట్టే పని… యూత్‌ఫుల్ రొమాంటిక్ కామెడీ

బాబోయ్ ఆ గుహలోకి వెళ్తే మాయమవుతారు… గర్భిణీ ఆత్మహత్య… మైండ్ బ్లోయింగ్ సూపర్‌నేచురల్ థ్రిల్లర్

అడవిలో అరుదైన వింత కోసం వెళ్లిన ఫోటోగ్రాఫర్… కట్ చేస్తే మిస్టీరియస్ ఫాంటసీ థ్రిల్లర్

ప్రేమకు అడ్డుగా మారిన ఊరి గొడవలు… తమిళనాడు బ్యాక్‌డ్రాప్‌లో ఇంట్రెస్టింగ్ లవ్ డ్రామా

Big Stories

Advertisement
×