BigTV English
Advertisement

OTT Movie : ఆ కోరికలు తీర్చుకోవడానికి తోలుబొమ్మతో అమ్మాయి డీల్… కట్ చేస్తే మైండ్ బ్లాకయ్యే ట్విస్ట్

OTT Movie : ఆ కోరికలు తీర్చుకోవడానికి తోలుబొమ్మతో అమ్మాయి డీల్… కట్ చేస్తే మైండ్ బ్లాకయ్యే ట్విస్ట్

OTT Movie : అసభ్యతకు తావు లేకుండా పిల్లలు, ఫ్యామిలీ చూసే విధంగా ఉండే వెబ్ సిరీస్ ను చూడాలనుకుంటున్నారా ? అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ ను చూసేయండి. ఇందులో పిల్లలకు కావాల్సిన అన్ని హంగులూ ఉంటాయి. ఇది 23 ఎపిసోడ్‌లతో, ప్రతి ఎపిసోడ్ ఒకకొత్త కథతో పిల్లలతో పాటు, పెద్దలను కూడా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘Creeped Out’ 2017-2019 మధ్య విడుదలైన బ్రిటిష్-కెనడియన్ హారర్ ఆంథాలజీ టీవీ సిరీస్. బీడ్ బ్లేక్, రాబర్ట్ బట్లర్ దీనిని రూపొందించారు. ఇది CBBC ప్రొడక్షన్స్, DHX మీడియా సహకారంతో నిర్మితమై, నెట్‌ఫ్లిక్స్ లో ఒరిజినల్‌గా ప్రీమియర్ అయింది. 2 సీజన్లు, 23 ఎపిసోడ్‌లతో (ఒక్కో ఎపిసోడ్ 25-30 నిమిషాలు) ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త కథతో నడుస్తుంది. స్టీవెన్ స్పీల్‌బర్గ్ తీసిన ‘Amazing Stories,’ ‘The Twilight Zone’ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్న ఈ సిరీస్, సై-ఫై, హారర్, ఫాంటసీ, మిస్టరీ మిక్స్‌తో 8+ ఏజ్ గ్రూప్‌కి సూట్ అవుతుంది. ఇది 2019లో BAFTA బెస్ట్ డ్రామా అవార్డ్ గెలిచింది. ఇది IMDbలో 6.6/10, Rotten Tomatoesలో 80% రేటింగ్ ఉంది.


Read Also : హర్రర్ మూవీస్ లోనే అరుదైన సినిమా… ఈ మాస్టర్ పీస్ ను మిస్సైతే రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిందే

స్టోరీలోకి వెళితే

ఈ సిరీస్ ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త కథతో నడుస్తుంది. ఈ కథలు హారర్, సై-ఫై, ఫాంటసీ, మిస్టరీ జానర్స్‌ లో కలిపి ఉంటాయి. టీన్స్‌కి ఎడ్యుకేషనల్ మెసేజెస్‌తో కూడిన “ఫన్ ఫ్రైట్స్” ఇస్తాయి. ప్రతి ఎపిసోడ్‌లో “The Curious” అనే మాస్క్‌డ్, వియర్డ్ ఫిగర్ కనిపిస్తాడు. స్టోరీ ఫ్రేమ్‌వర్క్‌గా వర్క్ చేస్తూ, తన విచిత్రమైన విజిల్‌తో కథను ఇంట్రడ్యూస్ చేస్తాడు. ఈ కథలు గ్రీడ్, టెక్నాలజీ అబ్సెషన్, ఫ్యామిలీ ఇష్యూస్ వంటి థీమ్స్‌పై లెస్సన్స్ ఇస్తాయి. వీటిలో కొన్ని ఎపిసోడ్స్ వివరాలు ఇలా ఉంటాయి.

Slapstick (సీజన్ 1, ఎపిసోడ్ 1) : జెస్సీ తన కుటుంబ ఇబ్బందికరమైన పరిస్థితులను మార్చాలనే ఆలోచనతో ఒక బొమ్మతో ఒప్పందం చేసుకుంటుంది. కానీ ఆ బొమ్మ ఆమెను భయపెడుతుంది. దాని వల్ల అనుకోని సమస్యలు వస్తాయి.

Cat Food (సీజన్ 1, ఎపిసోడ్ 2): స్టూ అనే బాయ్ స్కూల్‌కి వెళ్లకుండా ఒంట్లో బాగోలేదని నటిస్తాడు. కానీ తన పొరుగు ఇంట్లో ఉండే ఒక ఓల్డ్ లేడీ మాన్స్టర్ అని తెలుస్తుంది. ఇక అతను ఆమె నుంచి తప్పించుకొనేందుకు పోరాడాల్సి వస్తుంది.

Trolled (సీజన్ 1, ఎపిసోడ్ 3): సామ్ అనే బాయ్ స్కూల్ సోషల్ మీడియాలో క్రూరమైన పోస్ట్‌లు పెడతాడు. కానీ బిల్లీగోట్ అనే యూజర్ అతనిపై కర్స్ విధిస్తాడు. ఆ తరువాత అతని నిజ స్వరూపం బయటపడుతుంది.

Marti (సీజన్ 1, ఎపిసోడ్ 4): కిమ్ అనే హైస్కూల్ అమ్మాయి కొత్త సెల్‌ఫోన్ కొంటుంది. అది ఆమె జీవితాన్ని మార్చేస్తుంది. కానీ ఫోన్ సెంటియెంట్‌గా మారి ఆమెను కంట్రోల్ చేస్తుంది.

Bravery Badge (సీజన్ 1, ఎపిసోడ్ 7): గర్ల్ స్కౌట్స్ గ్రూప్ ఫారెస్ట్‌లో క్యాంపింగ్‌కి వెళ్తుంది. కానీ ఏలియన్ పారాసైట్స్ వాళ్లను ఒక్కొక్కరినీ మైండ్‌లెస్ జాంబీస్‌గా మారుస్తాయి.

Kindlesticks (సీజన్ 1, ఎపిసోడ్ 9): ఎస్మే అనే బేబీసిట్టర్ పిల్లలను భయపెట్టి నిద్రపుచ్చుతుంది. కానీ ఆష్లీ అనే బాయ్ తన క్రీపీ ఇన్విజిబుల్ ఫ్రెండ్ కిండిల్‌స్టిక్స్ సహాయంతో ఆమెకు సరైన పద్దతి నేర్పిస్తాడు.

A Boy Called Red (సీజన్ 1, ఎపిసోడ్ 10): విన్సెంట్ తన తండ్రి గతంలోకి టైమ్-ట్రావెల్ చేస్తాడు. అక్కడ తన తండ్రి బెస్ట్ ఫ్రెండ్ రెడ్ ట్రాజిక్ డెత్ గురించి తెలుస్తుంది. ఇలా ఈ స్టోరీలు పిల్లలని ఆ కట్టుకునే విధంగా తెరకెక్కించారు.

Related News

Bad Girl OTT: ఓటీటీలోకి వచ్చేసిన కాంట్రవర్శీ గర్ల్.. ఎందులో చూడొచ్చంటే..?

OTT Movie : కర్ణాటక కదంబ రాజవంశం నిధికి దేవత కాపలా… దాన్ని టచ్ చేయాలన్న ఆలోచనకే పోతారు… ‘కాంతారా’లాంటి క్రేజీ థ్రిల్లర్

OTT Movie : ఒకే మనిషిని పట్టి పీడించే 4 దెయ్యాలు… దెబ్బకు మనోడి లైఫ్ సెట్టు… ఇలాంటి హర్రర్ మూవీని అస్సలు చూసుండరు భయ్యా

OTT Movie : రోగం ఉన్నోడితో ఒకరాత్రి గడిపే హీరోయిన్… ఆమె గట్స్ కు దండం పెట్టాలి మావా

OTT Movie : టెంపుల్‌లో కోనేరు మిస్టరీ… ఆ వాటర్ తాగితే పరలోకానికే… కనిపెట్టిన డాక్టర్‌కు బుర్రబద్దలయ్యే షాక్

OTT Movie : ఫారెస్ట్ రేంజర్ పదవిని పోగొట్టుకుని ఆర్మీ కోసం పాకులాట.. ఆటలోకి దిగాక ఫ్యూజులు ఔటయ్యే షాక్… మెంటల్ మాస్ ట్విస్టులు

OTT Movie : పేరుకే సైకో కిల్లర్ సినిమా… రిచ్ అమ్మాయితో ఆటగాడి అరాచకం… సీను సీనుకో ట్విస్ట్

OTT Movie : హర్రర్ మేనియా ఉందా? అయితే ఒకే ఓటీటీలో ఉన్న ఈ సినిమాలను అస్సలు వదలొద్దు మావా

Big Stories

×