OTT Movie : కొన్ని బాడీ హారర్ సినిమాలు చాలా దారుణంగా ఉంటాయి. ఈ సినిమాలకన్నా, బయట చికెన్ షాపులే బెట్టర్ అనిపిస్తాయి. స్టోరీ అంత దారుణంగా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో మనుషులకు చేసే సర్జరీ సీన్స్ భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మనుషుల శరీరాలు కొత్త అవయవాలు పెంచుకుంటాయి, నొప్పి లేకుండా సర్జరీలు రొమాన్స్‌లా మారతాయి. ఈ సినిమా మానవ ఎవల్యూషన్, పర్యావరణ సమస్యల గురించి ఆలోచింపజేసే రీతిలో ముగుస్తుంది. ఈ సినిమా భవిష్యత్తులో, మానవ శరీరం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఒక వింత ప్రపంచంలో జరుగుతుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘క్రైమ్స్ ఆఫ్ ది ఫ్యూచర్’ (Crime of the future) డేవిడ్ క్రోనెన్‌బర్గ్ దర్శకత్వం వహించిన ఒక సైన్స్ ఫిక్షన్ బాడీ హారర్ డ్రామా చిత్రం. ఇందులో విగ్గో మోర్టెన్సెన్, లియా సీడౌక్స్, క్రిస్టెన్ స్టీవర్ట్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా 2022 జూన్ 3న థియేటర్స్‌లో వచ్చింది. ఇప్పుడు Hulu, Amazon Prime Videoలో స్ట్రీమింగ్‌లో ఉంది. 1 గంట 47 నిమిషాల నిడివితో IMDbలో 5.8/10 రేటింగ్ పొందింది.
కథలోకి వెళ్తే
భవిష్యత్తులో మానవ శరీరం పరిసరాలకు అనుగుణంగా మార్పులు చెందుతుంది. నొప్పి లేకపోవడం, ఇన్ఫెక్షన్లు రాకపోవడం వంటి మార్పులతో, శస్త్రచికిత్సలు సాధారణంగా నిర్వహించబడతాయి. ఇక ఈ కథలో సౌల్ టెన్సర్ అనే కళాకారుడు, తన శరీరంలో కొత్త అవయవాలు పెరిగే “యాక్సిలరేటెడ్ ఎవల్యూషన్ సిండ్రోమ్”తో బాధపడుతూ ఉంటాడు. తన భాగస్వామి కాప్రిస్ తో కలిసి ఈ అవయవాలను ప్రేక్షకుల ముందు శస్త్రచికిత్స ద్వారా తొలగించి, కళాత్మక ప్రదర్శనలుగా మలుస్తాడు. ఈ ప్రదర్శనలు “సర్జరీ ఈజ్ ది న్యూ సెక్స్” అనే భావనతో జనాదరణ పొందుతాయి. అయితే ఈ మార్పులను నియంత్రించేందుకు నేషనల్ ఆర్గాన్ రిజిస్ట్రీ అనే ప్రభుత్వ సంస్థ, టిమ్లిన్ నేతృత్వంలో సౌల్‌ను గమనిస్తుంది.
Read Also : 33 సంవత్సరాల టైమ్ ట్రావెల్ … తమ్ముడికోసం అన్న షాకింగ్ రిస్క్ … ఫ్యామిలీతో చూసేయచ్చు