E-Paper
Advertisement

సేఫ్‌ లు ఇలా కూడా తెరుస్తారా ? పియానో ట్యూనర్‌ టాలెంట్ కు పిచ్చెక్కాల్సిందే… మైండ్ బ్లాకింగ్ థ్రిల్లర్

సేఫ్‌ లు ఇలా కూడా తెరుస్తారా ? పియానో ట్యూనర్‌ టాలెంట్ కు పిచ్చెక్కాల్సిందే… మైండ్ బ్లాకింగ్ థ్రిల్లర్
Advertisement

Crime Thriller: ఒక సేఫ్‌ను తెరవాలంటే నంబర్లు తెలిసి ఉండాలి. లేదంటే పాస్‌కోడ్ కావాలి. టెక్నాలజీతో లాక్‌ను బ్రేక్ చేయొచ్చు. కానీ ఒక వ్యక్తి కేవలం తన చెవులతోనే సేఫ్‌లో దాగి ఉన్న రహస్యాన్ని పసిగట్టి దాన్ని తెరవగలిగితే? వినడానికి విచిత్రంగా అనిపిస్తున్నా ఇదే కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను క్రైమ్ ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా ట్యూనర్ (Tuner). పియానోలోని ప్రతి చిన్న స్వరాన్ని గుర్తించగల ఓ యువకుడి అసాధారణ వినికిడి శక్తి చివరికి అతన్ని ఊహించని నేర ప్రపంచంలోకి లాగుతుంది. సంగీతానికి ఉపయోగపడాల్సిన టాలెంట్.. డబ్బు కోసం జరిగే సేఫ్ క్రాకింగ్‌లో ఆయుధంగా మారితే ఏం జరుగుతుందన్నదే ఈ సినిమా అసలు స్టోరీ.

కథలోకి వెళ్తే…

నికీ వైట్ (Niki White) ఒకప్పుడు సంగీత ప్రపంచంలో మంచి భవిష్యత్తు ఉన్న పియానో ప్రతిభావంతుడు. కానీ అతని జీవితంలో వచ్చిన కొన్ని పరిస్థితుల కారణంగా సంగీత కెరీర్‌ను పక్కన పెట్టి పియానోలు ట్యూన్ చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. తన మెంటర్ హ్యారీ హొరోవిట్జ్ (Harry Horowitz)తో కలిసి న్యూయార్క్‌లోని వివిధ ప్రాంతాలకు వెళ్లి పియానోలను సరిచేస్తుంటాడు. నికీకి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే సాధారణ మనుషులు వినలేని స్థాయిలో చిన్న చిన్న శబ్దాలను కూడా గుర్తించగలగడం. అతని చెవులకు శబ్దం అంటే కేవలం శబ్దం కాదు.. అందులో ఎన్నో పొరలు కనిపిస్తాయి.

Advertisement

ఇదే అసాధారణ ప్రతిభ ఒకరోజు అతన్ని మరో ప్రపంచానికి పరిచయం చేస్తుంది. కొంతమంది క్రిమినల్స్‌కు నికీ టాలెంట్ గురించి తెలిసిన తర్వాత అతన్ని సేఫ్‌లు తెరవడానికి ఉపయోగించుకోవాలని చూస్తారు. సాధారణంగా సేఫ్‌ను పగలగొట్టడం అంటే బలవంతంగా లాక్‌ను ధ్వంసం చేయడం. కానీ నికీ మాత్రం సేఫ్‌లోని మెకానిజం నుంచి వచ్చే సూక్ష్మమైన శబ్దాలను విని దాని లోపల ఏమి జరుగుతుందో అర్థం చేసుకోగలడు. ఒక పియానోలో సరైన నోట్‌ను గుర్తించే చెవి.. ఇప్పుడు కోట్ల రూపాయల విలువైన సేఫ్‌లను తెరవడానికి ఉపయోగపడుతుంది.

మొదట ఈ పని అతనికి డబ్బు సంపాదించే సులభమైన మార్గంలా అనిపిస్తుంది. కానీ నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత బయటకు రావడం అంత ఈజీ కాదని నికీకి అర్థమవుతుంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తుల ఉద్దేశాలు మారిపోతాయి. తన మెంటర్ హ్యారీతో ఉన్న సంబంధం కూడా ఈ పరిస్థితుల ప్రభావానికి గురవుతుంది. మరోవైపు కంపోజిషన్ విద్యార్థిని రూతీతో నికీకి ఒక కొత్త అనుబంధం ఏర్పడుతుంది. ఆమెతో  జీవితాన్ని గడపాలని అనుకుంటున్న సమయంలోనే అతని రహస్య జీవితం సమస్యగా మారుతుంది.

Advertisement

ఇక్కడే సినిమా అసలు టెన్షన్ మొదలవుతుంది. నికీ తన ప్రతిభను ఉపయోగించి ఎంత పెద్ద సేఫ్‌ను అయినా తెరవగలడు. కానీ తన జీవితంలోకి వచ్చిన ప్రమాదాన్ని మాత్రం ఎలా మూసివేయాలి? సంగీతం, ప్రేమ, డబ్బు, నేరం.. ఈ నాలుగు ప్రపంచాలు ఒకే వ్యక్తి జీవితంలో కలిసిపోయినప్పుడు పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారుతుందో ట్యూనర్ (Tuner) చూపిస్తుంది.

 ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు…

ట్యూనర్ (Tuner) 2026 సెప్టెంబర్ 21 పారామౌంట్+ (Paramount+)లో స్ట్రీమింగ్‌కు వచ్చింది. డేనియల్ రోహర్ దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో లియో వుడాల్, డస్టిన్ హాఫ్‌మన్, హవానా రోజ్ లియు ప్రధాన పాత్రల్లో నటించారు.

Read Also: అండర్‌వరల్డ్ దందాలతో ఆగమయ్యే సిటీ… గ్యాంగ్‌స్టర్ వార్ తో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

Tags

Related News

రిహాబ్‌కు తీసుకెళ్లాల్సిన కుర్రాడితో చిక్కుల్లో… ఇద్దరు డ్రైవర్ల జర్నీ ఫుల్ రచ్చ… కామెడీ ఎంటర్‌టైనర్

200 ఏళ్ల వెనక్కి వెళ్లే ప్రేమికులు… అడుగడుగునా డేంజరస్ ట్విస్టులు… టైమ్-ట్రావెల్ విజువల్ వండర్

చీకట్లో విరుచుకుపడ్డ వింత రాక్షసులు… 500 ఏళ్ల నాటి నిజం బట్టబయలు… అర్ధరాత్రి ఆ అడవిలో ఏం జరిగింది ?

మందు బాటిల్ వల్ల మొదలైన గొడవ… చివరికి క్రైమ్‌లో చిక్కుకున్న స్నేహితులు… ఫుల్ నవ్వులు

వైరస్ తో దేశాన్నే తుడిచిపెట్టే డేంజరస్ ప్లాన్… హై వోల్టేజ్ మైండ్ బ్లోయింగ్ మిషన్

అండర్‌వరల్డ్ దందాలతో ఆగమయ్యే సిటీ… గ్యాంగ్‌స్టర్ వార్ తో మెంటలెక్కించే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

పాపులర్ ఇన్‌ఫ్లుయెన్సర్ల గ్లామర్ లైఫ్ వెనకున్న సీక్రెట్… సోషల్ మీడియా ఫాలోవర్స్ డోంట్ మిస్

Big Stories

Advertisement
×