George Krish:నారీ నారీ నడుమ మురారి ఈ ఏడు పొంగల్ కి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెల్సిందే. ఇక ఆ ఊపులోనే ఇపుడు శ్రీను వైట్ల తో మరో సినిమాని పట్టాలెక్కించాడు.జార్జ్ క్రిష్ అంటూ వస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాని వచ్చే పొంగల్ కి రిలీజ్ చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే .
అయితే అప్పటిదాకా ఫ్యాన్స్ ని ఏ మాత్రం వెయిట్ చేయించలేమంటూ ఇప్పుడు వరుసగా ప్రమోషనల్ అప్డేట్స్ వదిలే పనిలో పడ్డారు. అందులో భాగంగానే తాజాగా ‘జార్జ్ క్రిష్ ఫస్ట్ బూస్టర్’ అంటూ సెప్టెంబర్ 24న ఒక స్పెషల్ అప్డేట్ రాబోతుందని ప్రకటించడంతో మురిసిపోతున్నారు శర్వా ఫ్యాన్స్.
అయితే ఈ ‘ఫస్ట్ బూస్టర్’ అంటే ఏంటి అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను వదులుతున్నారా? లేక అనూప్ రూబెన్స్ మ్యూజిక్‌తో తెరకెక్కుతున్న ఫస్ట్ సింగిల్‌ను పరిచయం చేయబోతున్నారా? అన్నది సెప్టెంబర్ 24న వస్తే కాని తేలేలా లేదు.
ఇక వదిలిన అప్ డేట్ లో ‘బూస్టర్’ అనే పదాన్ని మేకర్స్ వాడటం కూడా ఇపుడు ఆడియన్స్ లో డిబేట్లకి కారణం అవుతుంది. సాధారణంగా సినిమా ప్రమోషన్స్‌లో గ్లింప్స్, ఫస్ట్ లుక్, టీజర్, సాంగ్ వంటి పదాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ ‘ఫస్ట్ బూస్టర్’అని ఎందుకు అన్నారా అంటూ ఆరాలు తీసే పనిలో పడ్డారు మూవీ లవర్స్.
ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. శర్వానంద్, శ్రీను వైట్ల ఇద్దరూ తమ తమ స్టైల్‌కు భిన్నంగా ఈ సినిమా కోసం కలిసి పని చేస్తున్నారని తెలుస్తుంది. శ్రీను వైట్ల పేరు చెప్పగానే కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్, క్యారెక్టర్ బేస్డ్ హ్యూమర్ గుర్తొస్తాయన్న సంగతి తెల్సిందే. మరోవైపు శర్వానంద్ తన కెరీర్‌లో ప్రేమకథలు, ఫ్యామిలీ డ్రామాలు, కామెడీ, ఎమోషనల్ సినిమాలతో ఆడియన్స్ కి దగ్గర అయిపోయాడు.అలాంటి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ఆడియన్స్ లో క్యూరియాసిటీ పెంచేస్తుంది.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మానస వారణాసి నటించనున్నట్లు వినిపిస్తుంది. సినిమాలో ఆమె పాత్ర ఆధునిక ఆలోచనలు, కుటుంబ విలువలు రెండింటినీ బ్యాలెన్స్ చేసే అమ్మాయిగా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక టెక్నికల్ గా అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఇప్పటికే ‘జార్జ్ క్రిష్’ను సంక్రాంతి బరిలోకి దింపుతూ జనవరి 14, 2027 రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. శర్వానంద్‌కు సంక్రాంతి సెంటిమెంట్ కూడా కలసివస్తుందని ఇలా ప్లాన్ చేశారు కాబోలు. మరి ‘శతమానం భవతి’, ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ నారీ నారీ నడుమ మురారి ల సరసన ఈ జార్జ్ క్రిష్ నిలుస్తాడా లేదా చూడాలి !
also read :రూ.10 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్.. ఏకంగా రూ.350 కోట్ల వసూళ్లు!