E-Paper
Advertisement

రూ.24,999 ధరకే..నథింగ్ ఫోన్, ఫీచర్లకు పిచ్చెక్కడం గ్యారంటీ

రూ.24,999 ధరకే..నథింగ్ ఫోన్, ఫీచర్లకు పిచ్చెక్కడం గ్యారంటీ
Advertisement

Nothing Phone 3a:  స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లతో.. ప్రత్యేకమైన లుక్‌తో కస్టమర్లను ఆకట్టుకునే బ్రాండ్లలో ‘నథింగ్’ఒకటి. సాధారణ ఫోన్ల లాగా కాకుండా ఈ ఫోన్లు యూత్‌లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాయి. తాజాగా రూ. 24,999 ధర కేటగిరీలో మార్కెట్లోకి వచ్చిన.. ‘నథింగ్ ఫోన్ 3ఏ'(Nothing Phone 3a) గురించి టెక్ ప్రపంచంలో జోరుగా చర్చ నడుస్తోంది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఫోన్ ఎంతవరకు బెస్ట్, దీని ధర ఫీచర్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

స్మార్ట్‌ఫోన్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 3ఏ మార్కెట్లో ట్రెండ్ సృష్టిస్తోంది. రూ.25వేల లోపు బడ్జెట్‌లో బెస్ట్ డిజైన్, ఫీచర్లతో ఇది వస్తుంది. సాధారణ స్మార్ట్‌ఫోన్ల మాదిరిగా కాకుండా.. ఇది ఒక యూనిక్ లుక్‌ను కలిగి ఉండటంతో టెక్ లవర్స్ దీనిని ఎంతో ఇష్టపడుతున్నారు. ఈ ఫోన్ డిజైన్, డిస్‌ప్లే, పెర్ఫార్మెన్స్, కెమెరా అద్భుతంగా ఉంటాయి.

నథింగ్ ఫోన్ 3ఏ ఫీచర్లు:

1.యూనిక్ డిజైన్, గ్లైఫ్ ఇంటర్‌ఫేస్:

Advertisement

నథింగ్ ఫోన్ల అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వాటి ట్రాన్పరెంట్ వెనుక భాగం, గ్లైఫ్ లైటింగ్ . నథింగ్ ఫోన్ 3ఏ కూడా అదే ట్రెండ్‌ను కొనసాగిస్తూ మరింత ట్రెండీ డిజైన్‌తో వస్తుంది. ఫోన్ వెనక వైపు ఇచ్చే లైటింగ్ నోటిఫికేషన్లు, కాల్స్ వచ్చేటప్పుడు వెలిగే తీరు చాలా స్టైలిష్‌గా ఉంటాయి. చేతిలో.. పట్టుకోవడానికి చాలా సౌకర్యంగా ఉండేలా, చాలా తక్కువ బరువుతో దీనిని రూపొందించారు.

2.అద్భుతమైన డిస్‌ప్లే, విజువల్స్:

ఈ స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద , స్పష్టమైన అమోలెడ్ డిస్‌ప్లేను అందించారు. దీని వల్ల వీడియోలు చూసేటప్పుడు.. ఆటలు ఆడేటప్పుడు రంగులు చాలా సహజంగా.. ప్రకాశవంతంగా కనిపిస్తాయి. హై రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉండటం వల్ల స్క్రీన్ స్క్రోలింగ్ చాలా స్మూత్‌గా సాగుతుంది. ఎండలో బయటికి వెళ్లినప్పుడు కూడా స్క్రీన్ క్లియర్‌గా కనిపించేలా దీని బ్రైట్‌నెస్ లెవెల్స్ చాలా బాగున్నాయి.

3.పెర్ఫార్మెన్స్, బ్యాటరీ లైఫ్:

Advertisement

రోజు వారీ వాడకానికి.. మల్టీటాస్కింగ్‌కు, గేమింగ్‌కు సరిపోయే బెస్ట్ ప్రాసెసర్‌ను ఇందులో అమర్చారు. ఎలాంటి లాగ్స్ లేకుండా.. యాప్స్ అన్నీ వేగంగా దీనిలో ఓపెన్ అవుతాయి. ఇక బ్యాటరీ విషయానికి వస్తే.. రోజంతా వాడటానికి సరిపోయే పవర్ ఫుల్ బ్యాటరీని ఇది కలిగి ఉంది. తోడుగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల.. తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అవుతుంది.

4. కెమెరా :

ఫోటోగ్రఫీ లవర్స్ కోసం నథింగ్ ఫోన్ 3ఏ లో మెరుగైన కెమెరా సెటప్‌ను అందించారు. వెనక వైపు ఉన్న డ్యూయల్ కెమెరాలు పగటి పూట మాత్రమే.. కాకుండా రాత్రి సమయాల్లో కూడా స్పష్టమైన,షార్ప్ అయిన ఫోటోలను తీస్తాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు.. వైపు ఇచ్చిన కెమెరా కూడా మంచి క్లారిటీని ఇస్తుంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికి తగిన విధంగా ఫోటోలు చాలా చక్కగా వస్తాయి.

Also Read: రూ.896 ధరకే.. స్మార్ట్ వాచ్, ఫిట్‌నెస్ లవర్స్‌కి పర్ఫెక్ట్ !

ధర వివరాలు:

Nothing Phone 3a.. మార్కెట్లో ఈ అద్భుతమైన స్మార్ట్‌ ఫోన్ ధర కేవలం రూ.24,999 గా ఉంది. ఈ బడ్జెట్‌లో లభించే.. ఇతర ఫోన్లతో పోలిస్తే.. ఇది మెరుగైన లుక్‌ను, ఫీచర్లను అందిస్తుంది.

తక్కువ ధరలో స్టైలిష్ లుక్, మంచి బ్యాటరీ బ్యాకప్, అద్భుతమైన డిస్‌ప్లే, ప్రత్యేకమైన డిజైన్ కోరుకునే వారికి ‘నథింగ్ ఫోన్ 3ఏ’ బెస్ట్ ఆపషన్ అని చెప్పొచ్చు. రూ. 24,999 బడ్జెట్‌లో బ్రాండెడ్ , ట్రెండింగ్ ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. ఈ ఫోన్ నిస్సందేహంగా మంచి ఛాయిస్ అవుతుంది.

Related News

మొబైల్ యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పిన TRAI.. ఇకపై డాటా లేకుండా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్లు!

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

Big Stories

Advertisement
×