E-Paper
Advertisement

ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే

ఇన్ఫినిటీ క్యాసిల్‌లో డెమాన్స్‌పై ఫైనల్ వార్… తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతున్న సూపర్ హిట్ యాక్షన్ యానిమే
Advertisement

Demon Slayer on OTT: టాంజిరో (Tanjiro), నెజుకో (Nezuko), జెనిట్సు (Zenitsu), ఇనోసుకే (Inosuke), హషీరాలు… అందరూ ఒకే చోటికి చేరతారు. అది సాధారణ ప్రదేశం కాదు. డెమాన్ కింగ్ ముజాన్ కిబుట్సుజీ (Muzan Kibutsuji) ఆధీనంలోని ఇన్ఫినిటీ క్యాసిల్. బయటకు దారి లేని ఆ భయంకరమైన కోటలోకి డెమాన్ స్లేయర్ కార్ప్స్ అడుగు పెట్టిన తర్వాత అసలు యుద్ధం మొదలవుతుంది. ఒక్కొక్కరిగా ఎదురయ్యే అప్పర్ ర్యాంక్ డెమాన్స్‌ తో ప్రాణాంతక పోరాటాలు మొదలవుతాయి. ఇదే ‘డెమాన్ స్లేయర్ కిమెట్సు నో యైబా ఇన్ఫినిటీ క్యాసిల్ I’ (Demon Slayer: Kimetsu no Yaiba Infinity Castle I) కథ. తాజాగా ఓటీటీలోకి వచ్చిన ఈ మోస్ట్ అవైటింగ్ సినిమాను ఏ ఓటీటీలో చూడవచ్చు ? తెలుగులో ఉందా ? అన్నది తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

హషీరా ట్రైనింగ్ ఆర్క్ తర్వాత కథ నేరుగా ఇన్ఫినిటీ క్యాసిల్‌ లోకి వెళ్తుంది. ఉబుయాషికి (Ubuyashiki) చేసిన ప్రయత్నం విఫలమైన తర్వాత ముజాన్ తన ప్రత్యర్థులను ఒకే చోటికి లాగుతాడు. డెమాన్ స్లేయర్ కార్ప్స్‌ లోని యోధులు ఒక్కసారిగా మారుతూ ఉండే భారీ కోటలో చిక్కుకుపోతారు. ప్రతి గది మరో దారికి తీసుకెళ్తుంది. ఏ దారి ఎక్కడికి వెళ్తుందో అర్థం కాని పరిస్థితి యుద్ధాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తుంది.

Advertisement

టాంజిరోకు తన కుటుంబాన్ని కోల్పోయిన బాధతో పాటు నెజుకోను మళ్లీ మనిషిగా మార్చాలనే లక్ష్యం ఉంది. నెజుకోను డెమాన్‌గా మార్చిన ముజాన్‌పై అతనిలో ఉన్న కోపం ఈ యుద్ధంలో మరింత బలంగా బయటపడుతుంది. జెనిట్సు, ఇనోసుకే, హషీరాలు కూడా తమ తమ మార్గాల్లో డెమాన్స్‌ ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇన్ఫినిటీ క్యాసిల్‌ లో ఎదురయ్యే శత్రువులు నార్మల్ డెమాన్స్ కాదు. అప్పర్ ర్యాంక్‌ లో ఉన్న అత్యంత శక్తివంతమైన డెమాన్స్‌ తో జరిగే పోరాటాలు ప్రతి పాత్ర సామర్థ్యాన్ని పరీక్షిస్తాయి.

ఒకవైపు తమ సహచరులను కాపాడుకోవాలి. మరోవైపు ముజాన్‌ వరకు చేరుకోవాలి. ఈ రెండు లక్ష్యాల మధ్య యోధులు విడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పర్ ర్యాంక్ డెమాన్స్‌తో జరిగే పోరాటాల్లో గతం, వ్యక్తిగత బాధలు, పాత శత్రుత్వాలు కూడా బయట పడతాయి. అందుకే ప్రతి ఫైట్ కేవలం యాక్షన్ సీన్‌ లా కాకుండా పాత్రల కథను కూడా ముందుకు తీసుకెళ్తుంది. ఇన్ఫినిటీ క్యాసిల్‌లో సమయం, దూరం, దిశ అన్నీ శత్రువుకే అనుకూలంగా ఉండటంతో డెమాన్ స్లేయర్లకు ప్రతి అడుగు ప్రమాదమే. ఈ పోరాటం మొత్తం ముజాన్‌ తో జరగబోయే తుది యుద్ధానికి దారితీసే కీలక అధ్యాయంగా మారుతుంది. మరి ఈ పోరాటంలో డెమాన్ స్లేయర్లు గెలిచారా లేదా ? ఎండింగ్ ఏంటి ? అనేది సినిమాలో చూసి తీరాల్సిందే.

ఓటీటీలో ఎక్కడ చూడొచ్చు?

Advertisement

హరుయో సోతోజాకి (Haruo Sotozaki) దర్శకత్వంలో ఉఫోటేబుల్ (ufotable) రూపొందించిన ఈ జపనీస్ యానిమే మూవీకి 2025 విడుదల ఉంది. ప్రస్తుతం Netflixలో సెప్టెంబర్ 28 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమా ఒరిజినల్ జపనీస్ లాంగ్వేజ్ తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

Read Also: సరదా ట్రిప్ కాస్తా దెయ్యాల టార్చర్‌గా మారితే… క్రేజీ హారర్ కామెడీ

Tags

Related News

ఎడారిలో తప్పిపోయిన బాలుడి సాహసం… ఈ అడ్వెంచర్ మూవీని తెలుగులోనూ చూడవచ్చు

ఉద్యోగం కోసం పోరాటం… కానీ ఆఫీస్‌లో ఎవరినీ నమ్మలేని పరిస్థితి… చైనీస్ వర్క్‌ప్లేస్ డ్రామా

నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్న ‘రోమాంచకం’ .. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇంటికి ఎదురుగా ముసుగేసుకుని కూర్చొనే మహిళ… దగ్గరయ్యే కొద్దీ పెరిగే భయం… సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్

యాక్సిడెంట్లో యూనికార్న్ డెత్… రక్తం కోసం మనుషులే రాక్షసులైతే? క్రేజీ హారర్ థ్రిల్లర్

ఇట్స్ అఫీషియల్ ఓటీటీలోకి కార్తీ సర్దార్ 2.. ఎప్పుడంటే?

ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి..హోస్ట్ గా కొత్త బాధ్యతలు?

Big Stories

Advertisement
×