E-Paper
Advertisement

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?

iPhone 18 Proపై రూ.57,000 భారీ డిస్కౌంట్.. ఈ ఆఫర్‌ను ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలుసా?
Advertisement

iPhone 18 Pro Price Drop: ఐఫోన్ ప్రియులకు యాపిల్ ఫోన్లంటే ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్ 18 ప్రోను సొంతం చేసుకోవాలని చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రూ.1,64,900 ప్రారంభ ధర ఉండటంతో ప్రీమియం ఫోన్ కొనుగోలు విషయంలో కొందరు వెనకడుగు వేస్తున్నారు. అలాంటి వారికి ఇప్పుడు అదిరిపోయే అవకాశం వచ్చింది. ఐఫోన్ 18 ప్రోపై ఏకంగా రూ.57,000 వరకు ఆదా చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..

ధర తగ్గేది ఇలా..

ఇండియా iStore అందిస్తున్న ఈ ఆఫర్ ద్వారా iPhone 18 Pro అసలు ధర రూ.1,64,900 నుంచి గణనీయంగా తగ్గుతుంది. యాక్సిస్, ఐసీఐసీఐ, లేదా ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో ఈఎమ్‌ఐ ద్వారా కొనుగోలు చేస్తే రూ.7,000 తక్షణ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. సాధారణ లావాదేవీలపై రూ.6,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

Advertisement

Also Read: ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఎక్స్ఛేంజ్ బోనస్..

మీ పాత ఐఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా రూ.40,000 వరకు ట్రేడ్ ఇన్ వ్యాల్యూ పొందే అవకాశం ఉంది. దీనికి తోడు కంపెనీ రూ.10,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. అయితే ఈ బోనస్ రావాలంటే పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ విలువ కనీసం రూ.22,000 ఉండాలి.

ఫోన్ కండీషన్‌ను బట్టే..

Advertisement

ఈ లెక్కలన్నీ కలిపితే మొత్తం రూ.57,000 వరకు ఆదా అయి, ఫోన్ ప్రభావవంతమైన ధర రూ.1,07,900కి చేరుతుంది. కానీ అందరికీ ఇదే ధరకు వస్తుందని గ్యారెంటీ లేదు. మీ పాత ఫోన్ మోడల్, దాని కండిషన్, స్టోరేజ్ ఆధారంగా యాపిల్ భాగస్వామ్య సంస్థలు ఆఖరి ఎక్స్ఛేంజ్ ధరను నిర్ణయిస్తాయి.

ఇప్పుడు కొనడం మంచిదేనా?

ఈ ఐఫోన్ 18 ప్రో (256జీబీ) వేరియంట్‌లో 6.3 అంగుళాల డిస్‌ప్లే, మెరుగైన బ్యాటరీ, ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి. కొత్త టెక్నాలజీ, మెరుగైన కెమెరా అనుభవం కావాలనుకునే వారికి ఈ డిస్కౌంట్ ఆఫర్ ఒక మంచి అవకాశం. కాకపోతే ఆఫర్లు స్టాక్ ఉన్నంత వరకే వర్తిస్తాయి కాబట్టి.. నిబంధనలు సరిగ్గా చూసుకుని ముందడుగు వేయడం మంచిది.

Also Read: ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

Tags

Related News

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. పొరపాటున రాంగ్ రీఛార్జ్ చేశారా? టెన్షన్ పడకుండా ఇలా చేసేయండి!

ఒక్క తిప్పు తిప్పితే చాలు.. విదేశీ ప్లగ్స్ రెడీ, యూగ్రీన్ కొత్త గ్యాడ్జెట్ మామూలుగా లేదుగా!

ఆండ్రాయిడ్‌లో వాట్సప్‌కు ఐఫోన్ స్టైల్ టచ్.. కొత్త నావిగేషన్ బార్ ఎలా ఉంటుందంటే?

సైలెంట్‌గా లాంచ్ డేట్ లీక్ చేసిన హువావే.. గ్రీన్ కలర్ ఫోన్ లుక్ మాత్రం అదిరిపోయింది!

జీమెయిల్ ఫుల్ అయి మెయిల్స్ రావడం లేదా? డబ్బులు చెల్లించకుండానే ఇలా స్పేస్ ఫ్రీ చేసుకోండి!

అలెక్సా స్పీకర్‌పై పర్పుల్ లైట్ దేనికి సంకేతం? ఇలా రాగానే ఏం చేయాలో తెలుసా?

ఇంత భారీగా ధర తగ్గుతుందని ఎవరూ ఊహించి ఉండరు.. Galaxy Z Fold 4 ఇప్పుడు రూ.89 వేలకే!

Big Stories

Advertisement
×