BigTV English

AP Govt: ఏపీ ప్రభుత్వం తీపికబురు.. కోటి 20 లక్షల మందికి బెనిఫిట్

AP Govt: ఏపీ ప్రభుత్వం తీపికబురు.. కోటి 20 లక్షల మందికి బెనిఫిట్

AP Govt: ఏపీలో కూటమి ప్రభుత్వం ఓ వైపు అభివృద్ధి వైపు దృష్టి పెడుతూనే.. మరోవైపు సంక్షేమ ఫలాలు ప్రజలకు అందించే దిశగా అడుగులు వేస్తోంది. తాజాగా కూటమి ప్రభుత్వం ఉపాధి కూలీలకు శుభవార్త చెప్పేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల దాదాపు కోటి 20 లక్షల మంది లబ్ది చేకూరనుంది. ఇంతకీ ప్రజలకు చేకూరన్న ఆ బెనిఫిట్ ఏంటి? ఇంకాస్త డీటేల్స్‌లోకి వెళ్తే..


కూలీలకు తీపి కబురు

ఏపీలో ఉపాధి కూలీలకు ప్రమాద బీమా అమలు చేయాలని నిర్ణయించింది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ. దీనికింద కోటి 20 మంది కూలీలు ఉన్నారు. దీనిపై డిప్యూటీ పవన్ కళ్యాణ్ చొరవతో చూపించారు. ఉపాది కూలీలకు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన పథకాల కిందకు తీసుకు రానున్నారు. దీనికి సంబంధించిన పనులు తెర వెనుక చకచకా జరిగిపోతున్నాయి.


మే ఒకటి నాటికి కూలీల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని అధికారులు ఆదేశించారు. జూన్ లోపు ప్రక్రియ పూర్తి చేయాలని లక్ష్యంగా అడుగులు వేస్తోంది.  దరఖాస్తుల్ని స్వీకరించి బ్యాంకుల్లో నమోదు చేయించేలా ఫీల్డ్ అసిస్టెంట్లను సిద్ధం చేయనున్నారు. ఈ మేరకు ఆ శాఖ కమిషనర్ కృష్ణతేజ అన్ని జిల్లాల అధికారులతో మాట్లాడారు. సింపుల్‌గా చెప్పాలంటే ప్రతి కుటుంబానికి భరోసా కల్పించడం అన్నమాట.

డిప్యూటీ సీఎం ప్రత్యేక దృష్టి

ఈ విషయంలో డిప్యూటీ సీఎం పవన్ కాసింత శ్రద్ధ చూపించడంతో వేగంగా అడుగులు పడుతున్నాయి. బీమాకు సంబంధించి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, కమిషనర్ కృష్ణతేజకు ఆదేశాలు ఇచ్చారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకం కింద ఓ వ్యక్తి ఏడాదికి రూ.20 చెల్లిస్తే చాలు. ఒకవేళ ప్రమాదవశాత్తు చనిపోతే రూ.2 లక్షల బీమా ఆ కుటుంబానికి లభిస్తుంది.

ALSO READ: ప్రవీణ్ పగడాల మృతిపై సోనియాగాంధీ ఆరా

అలాగే రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కింద రూ.450 చెల్లిస్తే పలు రకాల బీమా లభిస్తుంది. ఏపీ వ్యాప్తంగా ఉపాధి కూలీలను రెండు పథకాల కింద నమోదు చేయాలని కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. వైసీపీ హయాంలో బీమా అమలులో పలు సమస్యలు ఎదురయ్యాయి. ముఖ్యంగా బ్యాంకర్లు సహకరించకపోవడం ఒకటైతే, సిబ్బంది కొరత కారణంగా దరఖాస్తు నమోదు ఆలస్యమైందని అధికారులు చెబుతున్నారు.

సిబ్బంది కొరత లేకుండా

ఇక గ్రామ సచివాలయాల ఉద్యోగాలు ప్రస్తుతం అందుబాటులో ఉండడంతో ఈ ప్రక్రియ మరింత వేగవంతం కానుంది. ఈసారి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నది ప్రభుత్వ ఆలోచన. అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడిన కమిషనర్, లీడ్ బ్యాంక్ మేనేజర్లకు తగిన సూచనలు ఇవ్వాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లకు సహకరించేలా ఏర్పాట్లు చేయాలని కమిషనర్ పీడీలను ఇప్పటికే ఆదేశించారు.

ప్రతి ఉపాధి కూలీల కుటుంబానికి బీమాతో భరోసా కల్పించాలని భావిస్తోంది. తమకు బీమా సౌకర్యం కల్పించడంపై ఉపాధి కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మొగల్తూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధి హామీ పథకం కూలీలు చనిపోయారు. వారికి బీమా లేకపోవడంతో కుటుంబాలకు ఆర్థికంగా సహాయం చేయడానికి అవకాశం లేకుండాపోయింది. పరిస్థితి గమనించిన కూటమి సర్కార్ ఆయా కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×