OTT Movie : ఈజిప్ట్ లో ఉండే మమ్మీ లు ఎంతగా పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీటి గురించి సినిమాలు కూడా వస్తూనే ఉన్నాయి. ఈ కంటెంట్ తో వచ్చిన సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సందడి చేశాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ కూడా ఒక మమ్మీ చుట్టూ తిరుగుతుంది. ఒక రచయిత్రి ‘మమ్మీ’ కోసం చేసే అడ్వెంచర్ చూపుతిప్పుకోకుండా చేస్తుంది. ఇందులో ‘మమ్మీ’ చేసే విన్యాసాలు మామూలుగా ఉండవు. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
అడెలె బ్లాంక్-సెక్ అనే రచయిత్రికి తెలివితో పాటూ ధైర్యం కూడా కాస్త ఎక్కువే. అందుకు తగ్గట్టు అందంతో అందరి మతి పోగొడుతూ ఉంటుంది. ఒకరోజు ఆమె తోబుట్టువు అగాథే ఒక ప్రమాదంలో కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆమెను కోమాలో నుంచి బయటకు తీసుకురావడానికి ఒక మార్గం వెతుకుతుంది అడెలె. ఈజిప్ట్‌లోని ఒక పురాతన సమాధిలో రామ్‌సెస్ II అనే రాజుకి వైద్యుడైన ఒక మమ్మీని, పునర్జన్మ చేయడం ద్వారా ఆమె ఈ సమస్యను పరిష్కరించవచ్చని నమ్ముతుంది. అడెలె ఈ పని మీద ఈజిప్ట్‌కు ప్రయాణిస్తుంది. అక్కడ ఆమె అతని సమాధిని కనిపెడుతుంది. ఇక ఆమె అతికష్టంమీద మమ్మీని పారిస్‌కు తీసుకువస్తుంది.
అయితే ఈ క్రమంలో పారిస్‌లో ఒక పురాతన మమ్మీ పునర్జన్మ కారణంగా జీవం పోసుకుని, నగరంలో గందరగోళం సృష్టిస్తుంది. అడెలె ఈ ప్రమాదకరమైన రాక్షస జీవిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో తన సోదరిని రక్షించేందుకు తాను తీసుకొచ్చిన మమ్మీని పునర్జన్మ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఊహించని సంఘటనలు ఎదురుపడతాయి. చివరికి అడెలె మమ్మీకి ప్రాణం పోస్తుందా ? తన సోదరిని కాపాడుకుంటుందా ? ఈ మమ్మీల వల్ల ఎటువంటి సమస్యలు వస్తాయి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ ఫ్రెంచ్ ఫాంటసీ అడ్వెంచర్ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : ఒకే విధంగా 7 మంది అమ్మాయిలను చంపే సీరియల్ కిల్లర్… ట్విస్టులతో టెన్షన్ పుట్టించే సైకో థ్రిల్లర్
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో
ఈ ఫ్రెంచ్ ఫాంటసీ-అడ్వెంచర్ మూవీ పేరు ‘ది ఎక్స్‌ట్రార్డినరీ అడ్వెంచర్స్ ఆఫ్ అడెల్ బ్లాంక్-సెక్’ (The Extraordinary Adventures of Adèle Blanc-Sec). 2010 లో వచ్చిన ఈ సినిమాకి లూక్ బెస్సన్ దర్శకత్వం వహించారు. ఇది జాక్వెస్ టార్డి రాసిన ఫ్రెంచ్ కామిక్ సిరీస్ ఆధారంగా రూపొందింది. ఈ స్టోరీ 1912 పారిస్‌లో అడెలె బ్లాంక్-సెక్ అనే రచయిత్రి చుట్టూ తిరుగుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ అడ్వెంచర్ మూవీ అందుబాటులో ఉంది.