E-Paper
Advertisement

మిస్టీరియస్ జంతువులను పరిగెత్తించి కొట్టే స్కూల్ పిల్లలు… కొరియన్ యాక్షన్ ప్యాక్డ్ మాస్టర్ పీస్

మిస్టీరియస్ జంతువులను పరిగెత్తించి కొట్టే స్కూల్ పిల్లలు… కొరియన్ యాక్షన్ ప్యాక్డ్ మాస్టర్ పీస్
Advertisement

Korean Sci Fi Thriller Series: స్కూల్ పిల్లలు స్కూల్ కు ఎందుకు వెళతారు ? చదువుకుని బాగుపడాలి అనుకుంటారు. కానీ ఈ సిరీస్ లో మాత్రం అభం శుభం తెలియని అమాయకపు పిల్లలకు మార్కుల ఆశ చూపి, వాళ్ళ చేత మతిపోగొట్టే పనులు చేయిస్తారు. ఆ పనులు ఏంటో తెలియాలంటే ఈ సిరీస్ పై ఒక లుక్కేయాల్సిందే. 2022లో విడుదలై కొరియన్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ సిరీస్‌ ‘డ్యూటీ ఆఫ్టర్ స్కూల్’ (Duty After School). హా ఇల్-క్వాన్ రాసిన పాపులర్ వెబ్‌టూన్ ఆధారంగా రూపొందిన సిరీస్ ఇది. మరి ఈ సిరీస్ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాల్లోకి వెళ్ళే ముందు కథ ఏంటో తెలుసుకుందాం.

కథలోకి వెళ్తే…

దక్షిణ కొరియాలోని సింగ్జిన్ హైస్కూల్‌ లో కథ నడుస్తుంది. హైస్కూల్ చివరి సంవత్సరం విద్యార్థులందరూ కాలేజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ (CSAT) ఒత్తిడితో సతమతమవుతుంటారు. కానీ ఒకరోజు ఆకాశం నుండి వింతైన ఊదా రంగు గోళాలు (Alien Spheres) భూమిపైకి వస్తాయి. మొదట్లో కదలకుండా ఉన్న ఆ గోళాలు కాలక్రమేణా ప్రమాదకరమైన, మనుషులను వేటాడి చంపే క్రూర జీవులుగా మారుతాయి. సైనికులు కూడా వాటిని ఏమీ చేయలేక చేతులు ఎత్తేస్తారు. చాలామంది ప్రాణాలు కోల్పోతారు.

Advertisement

ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా సైనికుల కొరత ఏర్పడటంతో దక్షిణ కొరియా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంటుంది. హైస్కూల్ థర్డ్ ఇయర్ విద్యార్థులందరినీ సైన్యంలో చేర్చి, యుద్ధానికి పంపించాలని ఆదేశిస్తుంది. బదులుగా కాలేజీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ లో అదనపు మార్కులు ఇస్తామని ఆశ చూపిస్తుంది. చదువు కోసం ఏమైనా చేయాలని ఆశపడిన విద్యార్థులు తుపాకులు పట్టుకోవడానికి అంగీకరిస్తారు. స్కూల్ ఒక మిలిటరీ క్యాంపుగా మారుతుంది.

కఠినమైన లీడర్ లీ చున్-హో విద్యార్థులకు యుద్ధ శిక్షణ ఇస్తాడు. పుస్తకాలు, నోట్స్ స్థానంలో తుపాకులు, గ్రనేడ్లు వాళ్ళ జీవితంలోకి వస్తాయి. ఇక్కడే వారి స్నేహాలు, ప్రేమలు, పోటీలు, భయాలు ఇలా ఒక్కో ట్విస్ట్ ఉంటుంది. మొదట్లో యుద్ధం ఒక అడ్వెంచర్‌లా అనిపించినా, క్రమంగా స్నేహితులు కళ్ల ముందే చనిపోతుంటే నిజమైన భయం అంటే ఎలా రుచి చూస్తారు. ఒక వైపు ఏలియన్ గోళాల దాడి, మరోవైపు విద్యార్థుల మధ్య ఏర్పడే మానసిక ఒత్తిడి, స్వార్థం… ఈ అంశాలతో సిరీస్‌ ఉత్కంఠభరితంగా నడుస్తుంది.

తెలుగులో మాత్రం లేదు

Advertisement

2 పార్టులుగా వచ్చిన ఈ సిరీస్ విద్యార్థుల జీవితాల్లోని ఒత్తిడి, స్నేహం, త్యాగం, సర్వైవల్‌ వంటి అంశాల ఆధారంగా ఉంటుంది. యువ నటుల నటన, విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సిరీస్‌లో హైలెట్ గా ఉంటాయి. ‘డ్యూటీ ఆఫ్టర్ స్కూల్’ Amazon Prime Videoలో ఉంది. తెలుగు డబ్బింగ్ ఇంకా అందుబాటులో లేదు. కావాలంటే ఇంగ్షీషు సబ్ టైటిల్స్ తో చూడవచ్చు.

Read Also: చదువు చెప్పిన టీచర్ పై క్రష్… పదేళ్ళ తరువాత ఆ స్టూడెంట్ చేసిన పనికి బుర్రపాడు

Related News

పాపులర్ SNL షో వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ కథ… ఇండస్ట్రీ సీక్రెట్స్ బయటపెట్టిన నెట్‌ఫ్లిక్స్ కొత్త డాక్యుమెంటరీ

కులం పిచ్చితో ప్రేమికుల ప్రాణాలు తీసే రాక్షసత్వం… హార్డ్ హిట్టింగ్ మూవీ

తీరప్రాంతాన్ని వణికించే మిస్టరీ క్రియేచర్… ఊరిని కాపాడుకోవడానికి మత్స్యకారుడి పోరాటం… గూస్‌బంప్స్ తెప్పిస్తున్న సర్వైవల్ థ్రిల్లర్

యూనికార్న్ ఐలాండ్‌లో ఊహించని విపత్తులు… ఆ వింత రహస్యం ఏంటి ? నెట్‌ఫ్లిక్స్‌లో కొత్త మ్యాజికల్ అడ్వెంచర్

అవుట్‌వర్ల్డ్ క్రూర చక్రవర్తిపై తిరుగుబాటు… హాలీవుడ్ హీరో ఎంట్రీతో నెక్స్ట్ లెవెల్ వార్… తెలుగులోనే స్ట్రీమింగ్

విలన్ గా సుహాస్ 150 కోట్ల మాస్ ర్యాంపేజ్… తెలుగులో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘మందాడి’

కొట్టేసిన 300 కోట్ల బంగారాన్ని తన్నుకుపోయే ఖిలాడి… ఓన్ ఫ్రెండే మోసం చేస్తే రివేంజ్ ఇలాగే ఉంటది… ఓటీటీలో తెలుగులోనే

చనిపోయిన ప్రతిసారీ మళ్లీ బతుకుతాడు… ఏలియన్స్‌తో యుద్ధం గెలిచే వరకు ఆగని టైమ్ లూప్… మైండ్ బ్లాక్ సై-ఫై మూవీ

Big Stories

Advertisement
×