BigTV English

OTT Movie : అడవిలో ఒంటరి జంటని ఆవహించే దెయ్యం … ఓటీటీలో టాప్ లేపుతున్న హారర్ థ్రిల్లర్

OTT Movie : అడవిలో ఒంటరి జంటని ఆవహించే దెయ్యం …  ఓటీటీలో టాప్ లేపుతున్న హారర్ థ్రిల్లర్

OTT Movie : ఒక మారుమూల గ్రామంలోని అడవిలో ఉన్న ఒక పెద్ద ఇంట్లో, ఒక కుటుంబం హాయిగా జీవిస్తోంది. కానీ ఒక రాత్రి జరిగిన భయంకరమైన సంఘటన వారి జీవితాలను తలక్రిందులు చేస్తుంది. సెల్వి, ఆమె భర్త శాంతోష్ చనిపోతారు. ఈ మరణాలు ఆత్మహత్యగా నమోదవుతాయి. కానీ వాటి వెనుక ఒక భయానక రహస్యం దాగి ఉంటుంది. సెల్వి సోదరుడు సరవనన్ ఒక లాయర్. తన సోదరి మరణం వెనుక నిజాన్ని కనిపెట్టడానికి గ్రామానికి వస్తాడు. అక్కడ అతను ‘బాక్’ అనే ఆకారం మార్చే దెయ్యం గురించి తెలుసుకుంటాడు. ఈ దెయ్యం సెల్వి కుటుంబాన్ని ఎందుకు లక్ష్యంగా చేసుకుంది? సరవనన్ తన సోదరి పిల్లలను కాపాడగలడా ? లేదా ఈ బాక్ శక్తి అతన్ని కూడా అంతం చేస్తుందా ? ఈ సినిమా వివరాలు ఏమిటి ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళితే

ఈ స్టోరీ అస్సాంలోని ఒక పురాణ కథతో ప్రారంభమవుతుంది. ఇక్కడ ఒక పండుగ సమయంలో ఒక పూజారి అతని కుమార్తెతో కలసి ఆలయానికి పడవలో వెళ్తారు. ఒక ప్రమాదంలో పూజారి కుమార్తె గాయపడుతుంది. ఆమె రక్తం నదిలో పడటంతో, “బాక్” అనే ఆకారం మార్చే దెయ్యం వస్తుంది. బాక్ ఆమెను చంపి, ఆమె రూపాన్ని ధరిస్తుంది. కానీ పూజారి బాక్ ఆత్మను ఒక పాత్రలో బంధిస్తాడు. ఆ తరువాత ఈ స్టోరీ తమిళనాడులోని ఒక గ్రామానికి మారుతుంది. ఇక్కడ సెల్వి (తమన్నా) ఆమె భర్త శాంతోష్ (శాంతోష్ ప్రతాప్) తమ పిల్లలు శక్తి, సరవనన్ తో ఒక అడవిలోని పెద్ద ఇంట్లో నివశిస్తుంటారు. ఒక రోజు శాంతోష్ అడవిలో గుండెపోటుతో మరణిస్తాడు. సెల్వి ఉరివేసుకుని చనిపోతుంది. ఇది ఆత్మహత్య గా అందరూ భావిస్తారు.


లాయర్ అయినటువంటి సెల్వి సోదరుడు సరవనన్ (సుందర్ సి) తన సోదరి మరణం గురించి విని, ఆమె పిల్లలను చూసుకోవడానికి కోవూర్ గ్రామానికి వస్తాడు. అక్కడ అతను స్థానిక డాక్టర్ మాయా (రాశీ ఖన్నా) సహాయంతో, సెల్వి మరణం ఆత్మహత్య కాదని, దాని వెనుక ఒక పారానార్మల్ శక్తి ఉందని తెలుసుకుంటాడు. గ్రామంలో వింత శబ్దాలు, దెయ్యం దృశ్యాలు ఇతనికి కనబడతాయి. ఇవన్నీ ‘బాక్’ అనే దెయ్యం చేష్టలుగా తెలుస్తాయి. సరవనన్, తన అత్త (కోవై సరళ), యోగి బాబు, గణేష్ వంటి పాత్రల సహాయంతో, ఈ రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. అదే సమయంలో తన సోదరి పిల్లలను రక్షించడానికి పోరాడుతాడు. చివరికి సెల్వి మరణం నిజంగా ఆత్మహత్యా, లేదా బాక్ చేష్టలా? బాక్ ఎందుకు సెల్వి కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుంది? సరవనన్ ఈ దెయ్యం నుండి తన సోదరి పిల్లలను కాపాడగలడా? ఈ ప్రశ్నలకు సమాధానాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Read Also : ఈ సినిమాలు చూశాక విమానం ఎక్కాలంటేనే వణికిపోతారు.. ఓటీటీలో ఉన్న ఈ థ్రిల్సింగ్ మూవీస్ చూసేయండి

ఈ సినిమా ఏ ఓటీటీలో ఉందంటే

ఈ తమిళ కామెడీ-హారర్ మూవీ పేరు ‘అరణ్మనై 4’ (Aranmanai 4). 2024 లో వచ్చిన ఈ సినిమాకి సుందర్ సి దర్శకత్వం వహించారు. ఇది అరణ్మనై ఫ్రాంచైజీలో నాల్గవ భాగం. అవ్ని సినిమాక్స్, బెంజ్ మీడియా దీనిని నిర్మించాయి. ఇందులో సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా, శాంతోష్ ప్రతాప్, కోవై సరళ, యోగి బాబు, విటివి గణేష్, ఖుష్బూ, సిమ్రాన్ వంటి నటులు నటించారు. ఈ సినిమా 2024 మే 3 న థియేటర్లలో విడుదలైంది. జియో హాట్ స్టార్ (Jio hotstar) లో తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషలలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

Conistable Kanakam: యాక్షన్ థ్రిల్లర్ గా కానిస్టేబుల్ కనకం… అంచనాలు పెంచిన ట్రైలర్!

OTT Movie : హీరోయిన్‌తో లవ్, స్టోరీలో మర్డర్ మిస్టరీతో ట్విస్ట్… చివరి 20 నిముషాలు డోంట్ మిస్

OTT Movie : అయ్య బాబోయ్… ఫ్యూచర్ ను చూడగలిగే సీరియల్ కిల్లర్… వీడిచ్చే మెంటల్ మాస్ ట్విస్టుకు బుర్ర పాడు

OTT Movie : అబ్బబ్బ అరాచకం అంటే ఇదేనేమో … ఒక్కడితో సరిపెట్టలేక ….

OTT Movie : పని మనిషితో రాసలీలలు… ఒకరి భార్యతో మరొకరు… అన్నీ అవే సీన్లు… లాస్ట్ ట్విస్ట్ హైలెట్ మావా

Oho Enthan Baby OTT : ఓటీటీలోకి వచ్చిన రొమాంటిక్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..?

Big Stories

×