BigTV English

OTT Movie : అర్ధరాత్రి అమ్మాయి అరాచకం… అందంగా ఉంది కదాని సొల్లు కారిస్తే, ఇంటికి తీసుకెళ్లి దబిడి దిబిడే

OTT Movie : అర్ధరాత్రి అమ్మాయి అరాచకం… అందంగా ఉంది కదాని సొల్లు కారిస్తే, ఇంటికి తీసుకెళ్లి దబిడి దిబిడే

OTT Movie : ఒక లో బడ్జెట్ తమిళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా కామెడీ, సస్పెన్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ కథలో జరిగే ట్విస్ట్‌లు ఈ సినిమాను ఒక ఎంగేజింగ్ రైడ్‌గా మారుస్తాయి. ఒక రాత్రిపూట జరిగే ఈ స్టోరీ ఒక డార్క్ కామెడీగా మొదలై, క్రమంగా సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా మారుతుంది. ఈ సినిమా చెన్నైలోని మూడు లొకేషన్లలో 35 రోజుల్లో చిత్రీకరించారు.  ఈ సినిమా చివరివరకు ఆసక్తికరంగా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


ఏ ఓటీటీలో ఉందంటే

‘ఎనక్కు ఎండే కిడైయాదు’ (Enaku Endey Kidaiyaathu) 2023లో విడుదలైన తమిళ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. దీనికి విక్రమ్ రమేష్ దర్శకత్వం వహించి, ప్రధాన పాత్రలో కూడా నటించారు. కార్తీక్ వెంకట్రామన్ నిర్మించిన ఈ చిత్రం, హంగ్రీ వోల్ఫ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందింది. ఈ సినిమాలో విక్రమ్ రమేష్, కార్తీక్ వెంకట్రామన్, స్వయం సిద్ధ, శివకుమార్ రాజు, మురళి శ్రీనివాసన్, సక్తివేల్ వెంకట్రామన్ నటించారు. ఈ చిత్రం 2023 అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం ఆమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇది IMDbలో 5.8/10 రేటింగ్ ను సాధించింది.


స్టోరీలోకి వెళితే

చెన్నై నగరంలో, శేఖర్ (విక్రమ్ రమేష్) అనే క్యాబ్ డ్రైవర్ రాత్రి సమయంలో తన చివరి ట్రిప్‌ను పూర్తి చేసి, స్నేహితుడితో కలిసి డ్రింక్ చేయడానికి వెళ్లాలని అనుకుంటాడు. ఈ క్రమంలో అతను ఒక కాల్‌కు స్పందిస్తూ, ఊర్వశి (స్వయం సిద్ధ) అనే బిజినెస్‌వుమన్‌ను ఒక పబ్ నుండి ఇంటికి తీసుకెళ్లడానికి పికప్ చేస్తాడు. ఊర్వశి వద్ద ఒక బ్రీఫ్‌కేస్ ఉంటుంది. ఇందులో ఒక రహస్యం దాగి ఉందని తర్వాత తెలుస్తుంది. శేఖర్ ఆ రాత్రి సరదాగా గడుపుదామనుకునేలోగా, ఊహించని సంఘటనలు ఎదురుపడతాయి. శేఖర్, ఊర్వశిని ఆమె ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు, ఒక దొంగ, సైలెంట్ డేవిడ్ (కార్తీక్ వెంకట్రామన్), ఆ బ్రీఫ్‌కేస్‌ను దొంగిలించడానికి వారిని వెంబడిస్తాడు. అదే సమయంలో, మస్తాన్ భాయ్ (శివకుమార్ రాజు) అనే రాజకీయ నాయకుడు కూడా ఈ గందరగోళంలో చేరతాడు.

Read Also : ఆ పాడు వీడియోలకు అడిక్ట్… పక్కింటోళ్ల ప్రైవేట్ వీడియోలు చూసి… స్ట్రిక్ట్లీ సింగిల్స్‌కు మాత్రమే

ఇక ఈ ముగ్గురూ ఒక ఇంటిలో చిక్కుకుంటారు. ఇక్కడ జరిగే సంఘటనలు ఊహించని మలుపులు తిరుగుతాయి. ఈ బ్రీఫ్‌కేస్ చుట్టూ తిరిగే రహస్యం శేఖర్ ని ఒక ప్రమాదకరమైన ఆటలోకి లాగుతాయి. డేవిడ్ దొంగతనం ప్రయత్నాలు, మస్తాన్ భాయ్ రాజకీయ ఎత్తుగడలు, శేఖర్ అమాయకత్వంతో స్టోరీ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ ముగ్గురూ బతికి బయటపడేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించుకుంటారు. కానీ వీళ్ళ లక్ష్యాలు వేర్వేరుగా ఉండటం వల్ల గందరగోళం మరింత పెరుగుతుంది. ఈ బ్రీఫ్‌కేస్‌లోని రహస్యం ఏమిటి? శేఖర్, ఊర్వశి ఈ ప్రమాదకరమైన రాత్రిని ఎలా ఎదుర్కొంటారు? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Related News

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : బాబోయ్ దెయ్యంపైనే ప్రయోగం… కట్ చేస్తే గూస్ బంప్స్ ట్విస్ట్…. ముచ్చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : అనామకుల చెరలో ఇద్దరమ్మాయిలు… కిల్లర్స్ అని తెలియక కలుపుగోలుగా ఉంటే… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : ప్రెగ్నెంట్ వైఫ్ ఫోటో మార్ఫింగ్… ఒక్క రాత్రిలో ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ అతలాకుతలం… సీను సీనుకో ట్విస్ట్

Mohanlal: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మోహన్ లాల్ బ్లాక్ బాస్టర్ మూవీ!

Little Hearts OTT: దసరాకు ఓటీటీలోకి ‘లిటిల్‌ హార్ట్స్‌’.. వారికి మేకర్స్‌ స్వీట్‌ వార్నింగ్, ఏమన్నారంటే!

OTT Movie : పెళ్లి చెల్లితో, ఫస్ట్ నైట్ అక్కతో… కట్ చేస్తే బుర్రబద్దలయ్యే ట్విస్టు … ఇదెక్కడి తేడా యవ్వారంరా అయ్యా

Big Stories

×