BigTV English
Advertisement

OTT Movie : యాసిడ్ వర్షంలో ప్రాణాల కోసం పోరాడే అమ్మాయిలు… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : యాసిడ్ వర్షంలో ప్రాణాల కోసం పోరాడే అమ్మాయిలు… సీను సీనుకో ట్విస్ట్ తో పిచ్చెక్కించే సస్పెన్స్ థ్రిల్లర్

OTT Movie : ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా మారింది ఓటీటీ. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, హాట్ స్టార్ వంటి ఓటీటీలలో లెక్కలేనన్ని సినిమాలు, వెబ్ సిరీస్ లు పోటాపోటీగా రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ ఒక ప్రమాదకరమైన గేమ్ చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ చివరి వరకు నరాలు కట్ అయ్యే సస్పెన్స్ తో పిచ్చెక్కిస్తుంది. దీని పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళితే…


కథలోకి వెళ్తే…
జోయ్ డేవిస్, బెన్ మిల్లర్ లు ఒక ప్రమాదకరమైన ఎస్కేప్ గేమ్ ఆడి, అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడతారు. ఆ ఆటను నిర్వహిస్తున్న మినోస్ కార్పొరేషన్ అనే ఇల్లీగల్ సంస్థను ఎదిరించాలని డిసైడ్ అవుతారు. న్యూయార్క్‌లో మినోస్ ప్రధాన కార్యాలయం, ఎక్కడ ఉందో కనిపెట్టి అక్కడికి వెళతారు. కానీ ఈ క్రమంలో వాళ్ళు మళ్లీ అనుకోకుండా, ఆ ప్రమాదకరమైన ఎస్కేప్ రూమ్ గేమ్ ఉచ్చులో చిక్కుకుంటారు.

ఈసారి వారితో పాటు రాచెల్, బ్రియానా, నాథన్, థియో అనే మరో నలుగురు మాజీ ఎస్కేప్ రూమ్ విజేతలు కూడా చిక్కుకుంటారు. వీరంతా ‘టోర్నమెంట్ ఆఫ్ చాంపియన్స్’లో భాగంగా మినోస్ రూపొందించిన ప్రమాదకరమైన గదుల నుంచి బ్రతికి బయట పడడానికి పోరాడాల్సి ఉంటుంది. మొదటి గది ఒక విద్యుత్‌తో నిండిన సబ్‌వే ట్రైన్, రెండవది లేజర్‌లతో కూడిన బ్యాంక్ వాల్ట్, మూడవది ఇసుకతో నిండిన బీచ్. మరో గదిలో యాసిడ్ వర్షం… ఇలా ప్రతి గదిలోనూ పజిల్స్‌ను వేగంగా పరిష్కరించాలి. లేకపోతే మరణం తప్పదు.


జోయ్, బెన్‌కు ఇది వరకు ఆడిన గేమ్ లో అమండా హార్పర్ అనే అమ్మాయి బతికే ఉందన్న విషయం తెలుస్తుంది. అమండా తన కుమార్తె సోన్యాను రక్షించడానికి, మినోస్ కోసం ఈ ప్రమాదకరమైన గదులను రూపొందించిందని తెలుసుకుంటారు. జోయ్ తెలివిని చూసి మినోస్‌ కు గేమ్ మేకర్‌ గా చేరమని ఒత్తిడి చేస్తారు. కానీ ఆమె అలా చేరడానికి నిరాకరిస్తుంది. అసలు రెండవసారి ప్రాణాలను రిస్క్ లో పెట్టిన జోయ్ అనుకున్న పని అయ్యిందా? ఈ గేమ్ ఆడిస్తున్నది ఎవరు? ఎందుకు ఇంత భయంకరమైన చావులను ప్లాన్ చేశారు? అనే విషయాలు తెలియాలంటే ఈ మూవీని ఓటీటీలో చూడాల్సిందే. తెలుగులో అందుబాటులో ఉన్న ఈ మూవీ క్లైమాక్స్ ట్విస్ట్ కు మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

Read Also : ఏప్రిల్ లో ఓటీటీలో రిలీజ్ అయిన మలయాళ సినిమాలు ఇవే… ఇందులో మీరెన్ని చూశారు?

రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ హారర్ థ్రిల్లర్ అడ్వెంచర్ మూవీ పేరు ‘ఎస్కేప్ రూమ్ : టోర్నమెంట్ ఆఫ్ ఛాంపియన్స్’ (Escape Room: Tournament of Champions). దీనికి ఆడమ్ రోబిటెల్ దర్శకత్వం వహించారు. ఇందులో టేలర్ రస్సెల్, లోగన్ మిల్లర్, డెబోరా ఆన్ వోల్, ఇండియా మూర్, హాలండ్ రోడెన్, థామస్ కాక్వెరెల్, కార్లిటో ఒలివెరో వంటి నటులు నటించారు. ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ (Netflix), అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video)లో స్ట్రీమింగ్ అవుతోంది.

Related News

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

Big Stories

×