E-Paper
Advertisement

మరో లోకంలోకి తీసుకెళ్లే ఫాంటసీ సినిమాలు… వీటిని చూస్తే క్రేజీ వీకెండే

మరో లోకంలోకి తీసుకెళ్లే ఫాంటసీ సినిమాలు… వీటిని చూస్తే క్రేజీ వీకెండే
Advertisement

Fantasy movies on OTT : వారమంతా పనులతో బిజీగా ఉండి, వీకెండ్‌లో ఏదైనా కొత్త ప్రపంచంలోకి వెళ్లాలనిపిస్తుందా? మాయలు, మంత్రాలు, అద్భుతమైన లొకేషన్లు.. ఇలా కళ్లు చెదిరే విజువల్ వండర్స్ చూడాలనుకుంటే ఈ ఐదు సినిమాలు బెస్ట్ ఆప్షన్. ఇవి కేవలం సినిమాలు మాత్రమే కాదు, విజువల్స్ తో మ్యాజిక్ చేసిన అద్భుతాలు. మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విజువల్ వండర్స్ ఇవి.

1. Ladyhawke (1985)

ఇది ఒక క్లాసిక్ ఫాంటసీ. ఒక జంటపై విచిత్రమైన శాపం ఉంటుంది. పగలు అమ్మాయి గద్దలా మారిపోతే, రాత్రి అబ్బాయి తోడేలుగా మారిపోతాడు. అంటే ఇద్దరూ మనుషులుగా ఎప్పటికీ కలుసుకోలేరన్నమాట. ఈ సినిమాలో చూపించే పాతకాలపు కోటలు, ప్రకృతి దృశ్యాలు చాలా బాగుంటాయి. స్వచ్ఛమైన ప్రేమకథతో పాటు 80ల నాటి ఫాంటసీ ఫీల్ కోసం ఈ సినిమాను చూసేయచ్చు. ఇది Amazon Prime Video, Apple TV రెంటల్ పద్దతిలో అందుబాటులో ఉండి.

2. The Fall (2006)

Advertisement

విజువల్స్ గురించి మాట్లాడుకుంటే ‘ది ఫాల్’ గురించి ఖచ్చితంగా చెప్పాలి. ఒక ఆసుపత్రిలో గాయపడిన స్టంట్ మ్యాన్, ఒక చిన్న పాపకి కథ చెబుతుంటాడు. ఆ కథలో వచ్చే దృశ్యాలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తాయి. దాదాపు 20 దేశాల్లోని అద్భుతమైన ప్రదేశాలలో ఈ సినిమాను షూట్ చేశారు. ఇందులో వాడిన కలర్స్, లొకేషన్లు చూస్తే మతిపోతుంది. MUBI, Apple TV లో దీనిని చూడవచ్చు.

3. Stardust (2007)

ఒక కుర్రాడు తన ప్రేయసి కోసం ఆకాశం నుండి రాలిన నక్షత్రాన్ని తెస్తానని గోడ దాటి మరో లోకంలోకి వెళ్తాడు. తీరా చూస్తే ఆ నక్షత్రం ఒక అందమైన అమ్మాయి. ఆ అమ్మాయి కోసం మంత్రగత్తెలు, రాజులు వెంబడిస్తుంటారు. ఇందులో యాక్షన్, కామెడీ, ఫాంటసీ అన్నీ పర్ఫెక్ట్ మిక్స్ అయ్యి ఉంటాయి. ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ఒక ఫాంటసీ అడ్వెంచర్. Amazon Prime Video, Netflix దీనిని చూడవచ్చు.

4. Willow (1988)

Advertisement

‘స్టార్ వార్స్’ సృష్టికర్త జార్జ్ లూకాస్ అందించిన కథ ఇది. ఒక చిన్న పాపను కాపాడటానికి విల్లో అనే మరుగుజ్జు చేసే ప్రయాణమే ఈ సినిమా. ఇందులో గ్రాఫిక్స్ ఇప్పటికీ మనల్ని ఆకట్టుకుంటాయి. అడ్వెంచర్ లు ఇష్టపడే వారికి ఇది బాగా నచ్చుతుంది.
Jio Hotstarలో దీనిని చూడచ్చు.

5. Excalibur (1981)

కింగ్ ఆర్థర్, తన మ్యాజికల్ కత్తితో వండర్స్ చేస్తుంటాడు. ఈ కథను కళాత్మకంగా, విజువల్ వండర్ గా చూపించారు. ఇందులో వార్ సీన్స్ చూస్తున్నంత సేపు, మనం కూడా యుద్దంలో ఉన్నామా అనిపిస్తుంటుంది. ఇది Amazon Prime Video, Google Play Moviesలో అందుబాటులో ఉంది. ఈ ఐదు సినిమాలు ఒకదానికొకటి భిన్నమైనవి. మీరు ఒక కలల ప్రపంచంలో విహరించాలనుకుంటే, వీకెండ్‌లో వీటిని లిస్టులో చేర్చుకోండి.

Read Also : ఆ యాప్ క్లిక్ చేశావో నీ సమాధి నీవే తవ్వుకున్నట్లు.. ఓటీటీలోకి భయం పుట్టించే థ్రిల్లర్ సిరీస్

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×