OTT Movie : థ్రిల్లర్ సినిమాలపై అందాల భామ ఐశ్వర్య రాజేష్ బాగా ఫోకస్ చేస్తోంది. ఆమె కోసమే కథలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు దర్శకులు. ఈ సినిమాలకు థియేటర్లలో కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పుడు మనం ఐశ్వర్య ముస్లిం అమ్మాయిగా నటించిన సినిమా గురించి తెలుసుకుందాం. ఈ సినిమాలో ఐశ్వర్య నాటనకి మంచి మార్కులే పడ్డాయి. ఒక సైకో చేతిలో ట్రాప్ అయిన అమ్మాయిగా ఐశ్వర్య నటన ఆకట్టుకుంది. ఓటీటీలో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఈ కథ చెన్నైలోని ఒక మధ్యతరగతి ముస్లిం కుటుంబంలో జరుగుతుంది. ఫర్హానా ఒక ముస్లిం హౌస్‌వైఫ్. తన భర్త కరీమ్, తండ్రి అజీజ్, ముగ్గురు పిల్లలతో కలసి జీవిస్తుంటుంది. వాళ్ల చెప్పుల షాప్ బిజినెస్ లాస్‌లో ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఫర్హానా, తన తండ్రి వద్దని చెప్పినా వినకుండా, కాల్ సెంటర్‌లో జాబ్ కి వెళ్తుంది. ఈ జాబ్ ఆమెకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, సెల్ఫ్-కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఆమె చిన్న పిల్లవాడు నబా హాస్పిటలైజ్ అవ్వడంతో, ఎక్స్‌ట్రా డబ్బు కోసం ఆమె అడల్ట్ చాట్ డిపార్ట్‌మెంట్‌లోకి మారుతుంది. ఇక్కడ ఆమె స్నేహితురాలు నిత్య ఎక్కువ ఇన్సెంటివ్స్ సంపాదిస్తుంది. ఈ డిపార్ట్‌మెంట్‌లో ఆమె రొమాంటిక్ రిక్వెస్ట్‌లతో డీల్ చేయాల్సి వస్తుంది.
ఒక రోజు ఆమె ధయాళన్ అనే అపరిచిత కాలర్‌తో మాట్లాడుతుంది. అతని పొయిటిక్, ఫ్రెండ్లీ చాట్‌లు ఆమెను ఆకట్టుకుంటాయి. వీళ్లిద్దరి లాంగ్ కాన్వర్షేషన్స్ రొమాంటిక్‌గా మారతాయి. ఫర్హానాకి అతనిపై ఫీలింగ్స్ డెవలప్ అవుతాయి. కానీ ధయాళన్ ఒక రోజు కాల్స్ స్టాప్ చేస్తాడు. ఆ తర్వాత మళ్లీ స్టార్ట్ చేసి, ఆమెను కలవమని అడుగుతాడు. ఈద్ రోజున కలవడానికి నిరాకరించిన ఫర్హానా, తర్వాత కంపెనీ ప్రొటోకాల్స్‌ను బ్రేక్ చేసి అతన్ని కలవాలని డిసైడ్ అవుతుంది. ఈ నిర్ణయం ఆమె జీవితాన్ని డార్క్ థ్రిల్లర్‌గా మారుస్తుంది. ధయాళన్ ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ, వాళ్ల కాల్స్ రికార్డింగ్స్‌ను కరీమ్‌కు పంపుతానని బెదిరిస్తాడు.
తనకు అండగా ఉండే ఫర్హానా స్నేహితురాలు సోఫియా యాక్సిడెంటల్‌గా చనిపోతుంది. ఇది ఫర్హానాకు మరింత భయం కలిగిస్తుంది. క్లైమాక్స్‌లో ఫర్హానా ధయాళన్‌ను కలిసి, అతన్ని ఫేస్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఫర్హానా అతన్ని ఎలా ఫేస్ చేస్తుంది ? ధయాళన్ ఎందుకు ఫర్హానాను టార్గెట్ చేస్తున్నాడు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.
‘Farhana’ 2023లో విడుదలైన తమిళ థ్రిల్లర్ చిత్రం. దీనికి నెల్సన్ వెంకటేసన్ దర్శకత్వం వహించారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై S. R. ప్రకాష్ బాబు, S. R. ప్రభు దీనిని నిర్మించారు. ఇందులో ఐశ్వర్య రాజేష్ (ఫర్హానా), జితన్ రమేష్ (కరీమ్), సెల్వరాఘవన్ (ధయాళన్), ఆనుమోల్ (నిత్య) ప్రధాన పాత్రల్లో నటించారు. 2 గంటల 21 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 6.3/10 రేటింగ్ పొందింది. ఈ చిత్రం 2023 మే 12న తమిళ, తెలుగు, హిందీ భాషలలో థియేటర్లలో విడుదలైంది. 2023 జులై నుండి Sony LIV, Airtel Xstream Play, Netflixలో తమిళ, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ ఆడియోతో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also : భర్త మరో అమ్మాయితో… భార్య చేసే పనికి ఫ్యూజులు అవుట్… మోస్ట్ అవైటింగ్ కోర్ట్ రూమ్ డ్రామా స్ట్రీమింగ్ స్టార్ట్,