OTT Movie : ఒక డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా మూవీ లవర్స్ ను ఆకట్టుకుంటుంది. ఇందులో కొత్తగా పెళ్లైన జంట ఒక ఇంట్లోకి మారతారు. అక్కడ ఒక మాయ గది వాళ్ల కోరికలన్నీ తీరుస్తుంది. కానీ, వాళ్లు కోరుకున్న ఒక పెద్ద కోరిక ,వాళ్ల జీవితాన్ని తలకిందులు చేస్తుంది. ఈ థ్రిల్లర్ సినిమా సరదాగా మొదలై, ఉత్కంఠంగా ముగుస్తుంది. క్లైమాక్స్ మరో లెవల్ లో ఉంటుంది. ఈ సినిమా పేరు ?ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
ఈ ఫ్రెంచ్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది రూమ్’ (The Room). 2019లో వచ్చిన ఈ సినిమాకి క్రిస్టియన్ వోల్క్‌మన్ దర్శకత్వం వహించారు. ఇందులో ఒల్గా కురిలెంకో, కెవిన్ జాన్సెన్స్, జోషువా విల్సన్, జాన్ ఫ్లాండర్స్, కరోల్ వెయర్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2019 ఏప్రిల్ 15న బ్రస్సెల్స్ ఇంటర్నేషనల్ ఫాంటస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ అయింది. 100 నిమిషాల రన్‌టైమ్ ఉన్న ఈ సినిమాకి IMDbలో 6.1/10, Rotten Tomatoesలో 69% రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా అందుబాటులో ఉంది.
Read Also : దేవదాసీ అమ్మాయితో యవ్వారం… ఈ ఇద్దరమ్మాయిల అరాచకం చూస్తే నిద్ర కరువు
స్టోరీలోకి వెళితే
మాట్, కేట్ అనే యంగ్ కపుల్ న్యూయార్క్‌లోని ఒక నిర్మానుష్యంగా ఉండే ఏరియాలో పాత ఇంట్లోకి మారతారు. ఈ ఇల్లు ఒక స్ప్రింగ్‌వెల్ హౌస్. ఇక్కడ గతంలో ఒక హత్య కూడా జరిగిఉంటుంది. మాట్ ఒక పెయింటర్, కేట్ ఫ్రీలాన్స్ ట్రాన్స్‌లేటర్. వాళ్లిద్దరూ ఈ ఇంటిని తమ డ్రీమ్ హోమ్‌గా మార్చాలనుకుంటారు. రెనొవేషన్ సమయంలో, మాట్ ఒక గోడ వెనుక దాగిఉన్న ఇనుప డోర్‌ని గుర్తిస్తాడు. ఆ గది కోరికలన్నీ తీర్చే మాయ శక్తి కలిగి ఉంటుంది. డబ్బు, ఆర్ట్, లగ్జరీ బట్టలు, షాంపైన్, ఏది కోరుకున్నా వెంటనే మెటీరియలైజ్ అవుతుంది. వాళ్లు మొదట ఈ గదిని ఫన్‌గా ఉపయోగిస్తారు. పెయింటింగ్స్, మిలియన్ డాలర్లు, గౌర్మెట్ ఫుడ్ కోరుకుంటారు. కానీ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఈ గదిలో సృష్టించిన వస్తువులు ఇంటి బయటకు తీస్తే బూడిద అయిపోతాయి. ఈ లిమిటేషన్ తెలిసినా, వాళ్లు మరింత కోరికలతో గదిని ఉపయోగిస్తారు. కేట్‌కి గతంలో రెండు సార్లు అబార్షన్ అవుతుంది. అందుకే ఆమెకు పిల్లలు కావాలనే కోరిక బలంగా ఉంటుంది.
మాట్ ఆమెను ఓదార్చడానికి ఒక బేబీ రూమ్ సెటప్ చేస్తాడు. కానీ అది కేట్‌ని ఒక రీలింగ్‌లోకి నెట్టేస్తుంది. ఆ ఎమోషనల్ మూడ్‌లో, కేట్ ఆ గదిలో ఒక పిల్లవాడిని కోరుకుంటుంది. వెంటనే ఆ గదిలో షేన్ అనే బాయ్ మెటీరియలైజ్ అవుతాడు.షేన్ మొదట అమాయకంగా, తమ కొడుకులా అనిపిస్తాడు. కానీ ఇంటి బయటకు వెళ్తే అతను వేగంగా వృద్ధాప్యంలోకి వెళ్ళి, బూడిద అయిపోతాడని తెలుస్తుంది. ఈ రూల్ వల్ల కేట్, మాట్ షేన్‌ని ఇంట్లోనే ఉంచాలని నిర్ణయించుకుంటారు. కానీ షేన్ తొందరగా వయసుకి వస్తాడు. ఆ రూమ్ గురించి తెలుసుకుంటాడు. ఇక స్టోరీ డార్క్ టర్న్ తీసుకుంటుంది. షేన్ ఆ గదిలో మాట్ రూపంలో మారి, కేట్‌తో అనుచితంగా ప్రవర్తిస్తాడు. ఇక క్లైమాక్స్ ఊహించని మలుపుతో స్టోరీ ఎండ్ అవుతుంది. ఆ గది వల్ల ఇంకా ఎలాంటి సమస్యలు వస్తాయి ? షేన్ పరిస్థితి ఏమవుతుంది ? ఆ ఇంట్లోనే ఈ ఫ్యామిలీ ఉంటుందా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.