OTT Movie : షాకింగ్ ట్విస్ట్‌లతో ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఒక సినిమా, ఓటీటీలలో రికార్డ్ వ్యూస్ తో దూసుకుపోతోంది. ఈ సినిమాలో ఒక తల్లి, కూతుర్ని వీల్‌చైర్‌కి పరిమితం చేయాలనుకుంటుంది. అందుకు మందులు కూడా ఇస్తుంది. ఆమె ఎందుకు అలాచేస్తోంది ? కూతురు ఎలా దీని నుంచి బయటపడుతుంది ? ఈ సినిమా పేరు ? ఎందులో స్ట్రీమ్ అవుతోంది ? అనే వివరాల్లోకి వెళితే …
రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
ఈ అమెరికన్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘రన్’ (Run). 2020లో వచ్చిన ఈ సినిమాకి డైరెక్టర్ అనీష్ చాగంటి దర్శకత్వం వహించారు. సారా పాల్సన్ (డయాన్ షెర్మాన్), కియెరా అలెన్ (క్లోయ్ షెర్మాన్) మెయిన్ రోల్స్‌లో నటించారు. ఈ సినిమా హులు, నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. హులులో అత్యధికంగా వ్యూస్ సాధించిన ఒరిజినల్ ఫిల్మ్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. దీనికి IMDbలో 6.7/10, Rotten Tomatoesలో 88% రేటింగ్ ఉంది.
స్టోరీలోకి వెళితే
క్లోయ్ షెర్మాన్ అనే 17 ఏళ్ల అమ్మాయి, వీల్‌చైర్‌లో ఉంటుంది. ఆమెకు ఆస్తమా, డయాబెటిస్, హార్ట్ ప్రాబ్లెమ్స్, కాళ్ల పారాలిసిస్ లాంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ఆమె తల్లి డయాన్ ఆమెను ఇంట్లోనే ఉంచి పూర్తిగా కేర్ తీసుకుంటుంది. క్లోయ్ బయటి ప్రపంచంతో దాదాపు కనెక్షన్ లేకుండా, కనీసం ఇంటర్నెట్, ఫోన్ కూడా లేకుండా ఐసోలేటెడ్‌గా ఉంటుంది. ఆమె కాలేజీకి వెళ్లాలని కలలు కంటుంది. కానీ డయాన్ ఆమె లైఫ్‌ని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. ఒక రోజు క్లోయ్ గ్రాసరీ బ్యాగ్‌లో ఒక గ్రీన్-గ్రే కలర్ పిల్స్ బాటిల్ చూస్తుంది. అది తనకు ఇస్తున్న మందుల్లాగే ఉంటుంది. కానీ బాటిల్‌పై డయాన్ పేరు ఉంటుంది. సందేహం వచ్చిన క్లోయ్, డయాన్‌తో సినిమాకి వెళ్లినప్పుడు బాత్‌రూమ్ అని సాకు చెప్పి, సమీపంలోని ఫార్మసీకి వీల్‌చైర్‌లో వెళ్తుంది. అక్కడ ఫార్మసిస్ట్ ఆ పిల్స్ “రిడోకైన్” అని, అవి కుక్కలకు ఇచ్చే రిలాక్సెంట్ మందు అని, మనుషులు తీసుకుంటే కాళ్లకు పారాలిసిస్ వస్తుందని చెబుతాడు. ఈ షాకింగ్ విషయంతో క్లోయ్ భయపడిపోతుంది. అప్పుడే డయాన్ బయటకి వచ్చి ఆమెకు సెడేటివ్ ఇంజెక్షన్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్తుంది. క్లోయ్ మేల్కొన్నప్పుడు తన గది లాక్ చేయబడి ఉంటుంది.
డయాన్ బయటికి వెళ్లగానే, క్లోయ్ తన తెలివితో గది నుంచి బయటపడుతుంది. రూఫ్ మీదకి ఎక్కి, సోల్డరింగ్ ఐరన్, నీళ్లతో డయాన్ బెడ్‌రూమ్ విండోని పగలగొడుతుంది. అదే సమయంలో ఆమెకు ఆస్తమా అటాక్ వస్తుంది. కానీ ఇన్‌హేలర్‌తో సర్వైవ్ అవుతుంది. డయాన్ బేస్‌మెంట్‌లో దాచిన డాక్యుమెంట్స్‌లో క్లోయ్ షాకింగ్ సీక్రెట్స్ తెలుసుకుంటుంది. ఆమె అసలు డయాన్ కూతురు కాదు. డయాన్ అసలు బేబీ చనిపోయిన 2 గంటల్లో క్లోయ్‌ని హాస్పిటల్ నుంచి కిడ్నాప్ చేసిఉంటుంది. క్లోయ్ కి చిన్నప్పుడు నడిచే శక్తి ఉండేది. కానీ డయాన్ ఆమెను కావాలనే పారాలైజ్ చేసింది. ఇక క్లోయ్ అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇక క్లైమాక్స్ దగ్గర పడే కొద్దీ స్టోరీ ఊహించని మలుపులు తిరుగుతుంది. డయాన్ ఎందుకు క్లోయ్ ని వీల్‌చైర్ కి పరిమితం చేసింది ? క్లోయ్, డయాన్ నుంచి తప్పించుకుంటుందా ? తను మళ్ళీ నడవగలుగుతుందా ? అనే విషయలను ఈ సినిమాను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చుడండి.
Read Also : ఒక్క కేసులో ఇన్ని ట్విస్టులా… తండ్రి ముందే కూతుర్ని… ఎంతకీ తెగని ఉత్కంఠ