Survival Thrillers OTT : సముద్రంలో సాగే సొరచేపల పోరాటం నుంచి అంతరిక్షంలో సాగే సర్వైవల్ థ్రిల్లర్ వరకు 6 ఇంట్రెస్టింగ్ సినిమాలు ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఆ మూవీస్ ఏంటి ? ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
ఇదొక అద్భుతమైన సర్వైవల్ థ్రిల్లర్. ఒక ఒంటరి మహిళ, రాక్షస సొరచేప మధ్య సాగే జీవన పోరాటం ఇది. ‘ది షాలోస్’ కథలో నాన్సీ (బ్లేక్ లైవ్లీ) అనే మెడికల్ స్టూడెంట్ ఉంటుంది. ఆమె మారుమూల సముద్ర తీరంలో సర్ఫింగ్ చేస్తుంది. ఈ క్రమంలో భయంకరమైన ఓ పెద్ద వైట్ షార్క్ ఆమెపై దాడి చేస్తుంది. దాని నుంచి తప్పించుకునే క్రమంలో తీరానికి 200 మీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న రాయిపై చిక్కుకుపోతుంది. గాయపడిన ఆమె, ఆ సొరచేప కంటికి చిక్కకుండా తన తెలివితేటలతో ఎలా ప్రాణాలతో బయటపడింది అనేది కథ.
ఇక ‘ఓపెన్ వాటర్’ సినిమా యదార్థ గాథ ఆధారంగా తెరకెక్కిన మూవీ. ఓ జంట సముద్రంలో స్కూబా డైవింగ్‌కు వెళ్తుంది. సిబ్బంది పొరపాటున వచ్చిన బోటును అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. అంతులేని సముద్రం మధ్యలో, చుట్టూ తిరుగుతున్న సొరచేపల మధ్య ఆ దంపతులు పడిన నరకం గుండెల్ని పిండేసేలా ఉంటుంది.
నిజ జీవిత సాహసికుడు ఆరాన్ రాల్స్టన్ కథ ‘127 అవర్స్’ మూవీ. ఉటా లోయలలో ట్రెక్కింగ్ వెళతారు. ఈ క్రమంలో అతని చేయి, ఒక పెద్ద రాయి మధ్యలో ఇరుక్కుపోతుంది. దీంతో కదల్లేని స్థితిలో 5 రోజుల పాటు అంటే 127 గంటలు ఆకలి, దాహంతో అలమటిస్తాడు. చివరకు బతకడం కోసం అతను ఏం చేశాడు ? అన్నది కథ.
అంతరిక్ష నేపథ్యంలో సాగే మూవీ ‘గ్రావిటీ’. స్పేస్ స్టేషన్ బయట రిపేర్ చేస్తుంటే ఒక ప్రమాదం జరుగుతుంది. డాక్టర్ బ్రూక్స్ అంతరిక్షంలోకి జారిపోతుంది. స్పేస్ స్టేషన్ కు చేరుకునే ప్రయత్నంలో ఆక్సిజన్ అయిపోతుంది. ఈ తరుణంలోనే శూన్యంలో కొట్టుకుపోయే ఆమె భూమికి ఎలా తిరిగి చేరిందనేది ఈ విజువల్ వండర్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
లియోనార్డో డికాప్రియో ఆస్కార్ అందుకున్న మూవీ ‘ది రెవెనెంట్’. 1823 కాలంలో అడవిలో వేటకు వెళతాడు హ్యూ గ్లాస్. కానీ భయంకరమైన ఎలుగుబంటి దాడి చేయడంతో ఆయన చావు బతుకుల్లో ఉంటాడు. దీంతో అతన్ని పట్టించుకోకుండా, అతని కొడుకును అంతా కలిసి చంపేస్తారు. ప్రతీకారం తీర్చుకోవాలనే కసితో, తీవ్రమైన చలిలో, ఒంటి నిండా గాయాలతో వందల మైళ్లు అతను నడిచి ఎలా బతికాడు అనేది కథ.
Also Read : హిమాలయాలలో దొరికిన అస్థిపంజరం… ఓటీటీని షేక్ చేస్తున్న హాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్
సరికొత్త సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ ‘సెండ్ హెల్ప్’. విమాన ప్రమాదంలో ఓ ద్వీపంలో చిక్కుకుపోతారు ప్రయాణికులు. అక్కడ ఆహారం, నీరు లేక… అంతర్గత గొడవలతో ఒకరినొకరు చంపుకుంటూ ప్రాణాలను కాపాడుకోవడానికి, అక్కడి నుంచి బయటపడడానికి చేసే ఫైటే ఈ సిరీస్.