E-Paper
Advertisement

ద్వీపంలో చిక్కుకునే చిన్నపిల్లలు… చూస్తున్నంత సేపు ఒళ్ళు గగుర్పొడిచే ఉత్కంఠభరితమైన సిరీస్

ద్వీపంలో చిక్కుకునే చిన్నపిల్లలు… చూస్తున్నంత సేపు ఒళ్ళు గగుర్పొడిచే ఉత్కంఠభరితమైన సిరీస్
Advertisement

Survival Thriller Series on OTT : ఓటీటీలో రీసెంట్ గా ఒక సర్వైవల్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ కి వచ్చింది. కేవలం నాలుగు ఎపిసోడ్స్ తో తెరకెక్కిన ఈ సిరీస్ ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ కి తీసుకెళ్తోంది. ఎవరూ లేని ఒక ద్వీపంలో చిక్కుకున్న చిన్న పిల్లలు.. బతకడం కోసం ఎంత క్రూరంగా మారతారనేది చూపించే ఒక డార్క్ అండ్ ఇంటెన్స్ స్టోరీ ఇది. మనుషులకి చట్టాలు, పద్ధతులు లేకపోతే ఎంత రాక్షసులుగా మారిపోతారో ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. నాలుగు ఎపిసోడ్లే కాబట్టి థ్రిల్లర్ ఫ్యాన్స్ ఒక పూటలోనే ఎంచక్కా దీన్ని చూసి ఎంజాయ్ చెయ్యచ్చు.

స్టోరీ ఏమిటంటే

సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ పేరు ‘లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్’ (Lord of the Flies). విలియం గోల్డింగ్ రాసిన క్లాసిక్ నవల ఆధారంగా దీనిని రూపొందించారు. ఈ నాలుగు ఎపిసోడ్‌ల పరిమిత సిరీస్ యూకేలో 2026 ఫిబ్రవరి 8న BBC లో ప్రసారమైంది. అంతర్జాతీయంగా మే 4 నుంచి Netflix లో విడుదలైంది. ఆస్కార్ అవార్డు గ్రహీత హాన్స్ జిమ్మర్ ఈ సిరీస్‌కు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇందులో రాంఫ్ (విన్స్టన్ సాయర్స్), జాక్ (లాక్స్ ప్రాట్), పిగ్గీ (డేవిడ్ మెక్కెన్నా), సైమన్ (ఐక్ తాల్బట్) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ కోసం డైరెక్టర్ దాదాపు 30 మందికి పైగా పిల్లలను ఎంపిక చేయగా, ప్రధాన పాత్రలు పోషించిన చాలా మంది పిల్లలకు ఇదే మొదటి సినిమా కావడం విశేషం. ఎటువంటి అనుభవం లేని కొత్త పిల్లలను ఓపెన్ ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేసి, వారి నుంచి ఓ రేంజ్ లో నటనను రాబట్టుకున్నారు. నాలుగు ఎపిసోడ్‌ల ఈ సిరీస్ యూకేలో బీబీసీ (BBC) లోనూ, అంతర్జాతీయంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) లోనూ విడుదలై విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది.

స్టోరీలోకి వెళ్తే

Advertisement

కథలో మొదటగా ఒక విమాన ప్రమాదం జరగడంతో, స్కూలు చదువుకునే కొంతమంది బ్రిటీష్ పిల్లలు ఎవరూ లేని ఒక ద్వీపంలో చిక్కుకుంటారు. అక్కడ వాళ్లను చూసుకోవడానికి పెద్దవాళ్లు ఎవరూ ఉండరు. మొదట్లో వాళ్లంతా ఒక చోట చేరి, రాల్ఫ్ అనే అబ్బాయిని తమ లీడర్‌గా ఎన్నుకుంటారు. ద్వీపం నుంచి బయటపడటానికి కొండపై మంటలు పెట్టడం, క్రమశిక్షణతో ఉండటం లాంటి నియమాలు పెట్టుకుంటారు. అయితే జాక్ అనే ఇంకో అబ్బాయికి రాల్ఫ్ చెప్పే పద్ధతులు నచ్చవు. వాడు అడవి పందులను వేటాడటమే ముఖ్యం అనుకుంటూ, తన చుట్టూ ఒక క్రూరమైన గ్యాంగ్‌ను తయారు చేసుకుంటాడు.

అంతేకాకుండా త్వరలోనే ఆ ద్వీపంలో ఒక భయంకరమైన భూతం ఉందనే పుకారు పిల్లల్లో బాగా పాకిపోతుంది. ఆ భయం వల్ల పిల్లలంతా రాల్ఫ్‌ను వదిలేసి, వేటాడుతూ అనాగరికంగా మారిన జాక్ గ్రూపులో చేరిపోతారు. దీంతో శాంతిని కోరుకునే మంచి పిల్లలైన పిగ్గీ, సైమన్‌లను జాక్ గ్యాంగ్ చాలా క్రూరంగా చంపేస్తుంది. చివరకు లీడర్ రాల్ఫ్‌ను కూడా చంపడానికి ద్వీపమంతా తగలబెడుతూ వేటాడుతుంటారు. చివరికి రాల్ఫ్‌ వీళ్ళ నుంచి తప్పించుకుంటాడా ? ఆ దీవిలోని పిల్లలు ప్రాణాలతో బయట పడతారా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also : ఫ్యూచర్ ని ముందే ఊహించే టెక్నాలజీ… అస్సలు మిస్ అవ్వకూడని మిస్టరీ సిరీస్

Tags

Related News

Weekend OTT Movies: వీకెండ్ సినిమాల సందడి.. వీటిని అస్సలు మిస్ అవ్వొద్దు..

రెండు రోజుల్లో నలుగురి మర్డర్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్

తల్లి టూర్లో, తండ్రికి చుక్కలు చూపించే పిల్లలు… పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

క్రేజీ సిరీస్ కు సినిమాతో ఎండ్ కార్డు… లాంగ్-డిస్టెన్స్ రిలేషన్‌షిప్లో ఉన్నవాళ్ళు డోంట్ మిస్

చెరువులో బాలుడి శవం… దేవుడికి ఆచారాల పేరుతో గుండె జారిపోయే పనులు

తండ్రి చావుకు కారణమైన వాళ్ళను వేటాడే ఖతర్నాక్ లేడీ… యాక్షన్ తో పిచ్చెక్కించే మూవీ

తండ్రికి మించిన తనయుడు… కానీ తలనొప్పే… మిస్ అవ్వకుండా చూడాల్సిన స్పోర్ట్స్ కామెడీ సిరీస్

ఫ్రెండ్ లైఫ్ లోకి అమ్మాయి వచ్చిందనే ద్వేషంతో ఇదేం పని ? నిబ్బా నిబ్బీలు డోంట్ మిస్

Big Stories

Advertisement
×