Korean Thriller : మైండ్ బెండింగ్ ట్విస్టులతో సాగే ఒక అద్భుతమైన సినిమా కోసం ఓటిటిలో వెతుకుతున్నారా ? నిజానికి ఇప్పటికే ఓటీటీలోకి ఇలాంటి జానర్లో ఎన్నో సినిమాలు వచ్చి పడ్డాయి. కానీ అందులో కొన్ని మాత్రమే ఆడియన్స్ మనసును గెలుచుకున్నాయి. అందులో ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ ప్రతి నిమిషం ప్రేక్షకుడిని సీటు అంచున కూర్చోబెడుతుంది. ఈ మూవీ పేరు ‘ఫర్ గాటెన్’ (Forgotten). 2017 లో రిలీజ్ అయిన ఈ మూవీ సస్పెన్స్ తో బుర్ర బ్లాక్ చేస్తుంది. మరి ఈ మూవీ స్టోరీ ఏంటి ? ఏ ఓటిటిలో చూడొచ్చు ? అనే వివరాల్లోకి వెళితే…
జిన్ సియోక్ అనే యువకుడు తన తల్లిదండ్రులు అన్నయ్యతో కలిసి కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు. కానీ జిన్ మానసిక స్థితికి సంబంధించిన సమస్యతో బాధపడుతూ టాబ్లెట్స్ వేసుకుంటాడు. అయితే ఆ కొత్త ఇంట్లోకి వెళ్ళాక ఒక గది మాత్రం లాక్ చేసి ఉండడాన్ని గమనిస్తాడు. అందులో మునుపటి యజమాని వస్తువులు ఉన్నాయని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవద్దని తండ్రి చెప్తాడు. కానీ విచిత్రంగా ఆ గది నుంచి జిన్ కు వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. ఓ రోజు రాత్రి జిన్ కళ్ళముందే అతని అన్నయ్య యు సియోక్ ను కొంతమంది వ్యక్తులు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి కిడ్నాప్ చేస్తారు. పోలీసులు ఎంత వెతికినా ఈ కిడ్నాప్ కు సంబంధించి ఎలాంటి క్లూ దొరకదు.
సరిగ్గా 19 రోజుల తర్వాత అతని అన్నయ్య అకస్మాత్తుగా ఇంటికి తిరిగి వచ్చి అందరికీ షాక్ ఇస్తాడు. అయితే ఈ 19 రోజుల్లో అసలు ఏం జరిగిందో తనకు గుర్తులేదు అని చెప్తాడు. తిరిగి వచ్చాక అన్నయ్య ప్రవర్తనలో చాలా మార్పు వచ్చినట్టు గమనిస్తాడు. కుడి కాలు దెబ్బ తిన్న అన్నయ్య ఎడమ కాలు కుంటుతూ నడవడం, రాత్రి వేళలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వింతగా ప్రవర్తించడం చూసి తన ఇంట్లో ఉన్నది ఎవరో అపరిచిత వ్యక్తి అని అనుమానిస్తాడు. అ రహస్యాన్ని కనిపెట్టే క్రమంలో హీరోకి భయంకరమైన నిజాలు తెలుస్తాయి.
2017లో తను ఉన్నానని హీరో అనుకుంటాడు. నిజానికి ఆ ఏడాది హీరోకి 21 ఏళ్లు. కానీ ప్రస్తుతం హీరో ఉన్నది 41 ఏళ్ల వయసులో. అంతేకాదు అతని ఉంటున్నది అద్దె ఇల్లు కాదు, అదొక సెటప్. అతని తల్లిదండ్రులు, అన్నయ్యగా నటిస్తున్న వాళ్లంతా ఎవరో కాదు నటులు, ప్రైవేట్ డిటెక్టివ్ లు. ఈ నేపథ్యంలోనే షాకింగ్ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అవుతుంది.
20 ఏళ్ల క్రితం అంటే 1997లో కొరియా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న సమయం. జిన్ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురవుతుంది. అతని అన్నయ్యను బ్రతికించుకోవడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. ఇంటర్నెట్ ద్వారా అపరిచిత వ్యక్తి జిన్ కు డబ్బు ఆఫర్ చేస్తాడు. కానీ ఓ డాక్టర్ భార్యను చంపితేనే ఆ డబ్బు ఇస్తానని చెప్తాడు. పరిస్థితుల ప్రభావం వల్ల హీరో ఆ డాక్టర్ భార్యతో పాటు ఆమె చిన్న కూతురుని కూడా దారుణంగా చంపేస్తాడు. అయితే ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్న పిల్లాడిని మాత్రం చంపే ధైర్యం చేయలేక జాలితో వదిలేస్తాడు.
ఇక్కడ షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే… ఆ హత్యలు చేయమని పంపిన అపరిచిత వ్యక్తి మరెవరో కాదు స్వయంగా ఆ డాక్టరే. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తన భార్యను చంపమని ఈ డీల్ ఇస్తాడు. కానీ అదే రోజు రాత్రి ఆ డాక్టర్ కూడా బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోతాడు. ఈ ప్రమాదంలో జిన్ తలకు దెబ్బ తగిలి ఆ భయంకరమైన జ్ఞాపకాలను పూర్తిగా మర్చిపోతాడు. మరి 21 ఏళ్ల వయసులో ఉన్నాను అనుకున్న హీరో 41 ఏళ్ల వయసులోకి ఎలా వెళ్లాడు ? అసలు అతనికి బంధించి అక్కడ ఎవరు ఎలాంటి ప్రయోగం చేస్తున్నారు ? ఆ చిన్న బాబు ఎవరు ? చివర్లో వచ్చే దిమ్మతిరిగే క్లైమాక్స్ ఏంటి? అన్నది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.
Read Also : జాకీ చాన్ – జాన్ సెనా కలిసి నటించిన నాన్ స్టాప్ యాక్షన్ రైడ్… హైవోల్టేజ్ స్పై థ్రిల్లర్