OTT Movie : రీసెంట్ గా ఒటీటీలోకి వచ్చిన ఒక ఆంథాలజీ మూవీ డిఫరెంట్ కథాంశంతో ఆకట్టుకుంటోంది. 1987 ఒక్లాండ్, కాలిఫోర్నియా నేపథ్యంలో ఈ చిత్రం నాలుగు కథలను అల్లుకుంటుంది. ఇవి నిజమైన సంఘటనల నుండి స్ఫూర్తి పొందాయి. అయితే ఈ కథలన్నీ అతీంద్రియ అంశాలతో చిత్రీకరించబడ్డాయి. ఈ సినిమా పేరు ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
ఎందులో ఉందంటే
“ఫ్రీకీ టేల్స్” (Freaky Tales) ఒక అమెరికన్ యాక్షన్ ఆంథాలజీ చిత్రం. దీనికి అన్నా బోడెన్, ర్యాన్ ఫ్లెక్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పెడ్రో పాస్కల్, బెన్ మెండెల్సోన్, జే ఎల్లిస్, నోర్మానీ, డొమినిక్ థోర్న్, జాక్ ఛాంపియన్, జీ-యంగ్ యూ, ఆంగస్ క్లౌడ్, టామ్ హాంక్స్ (ఒక కామియోలో) నటించారు. 2025 ఏప్రిల్ 4 న ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయింది. 2025 ఆగస్టు 8 నుంచి HBO Max,Amazon Video, Apple TVలలో స్ట్రీమింగ్ అవుతోంది. IMDbలో దీనికి 6.5/10 రేటింగ్ కూడా ఉంది.
స్టోరీలోకి వెళితే
టీనా, లూసిడ్ ఒక గ్రాండ్ లేక్ థియేటర్ వద్ద సినిమా చూసిన తర్వాత నాజీలచే బెదిరింపులకు గురవుతారు. వారు 924 గిల్మన్ స్ట్రీట్ వద్ద ఒపరేషన్ ఐవీ కచేరీకి వెళతారు. అక్కడ నాజీలు మళ్లీ దాడి చేసి, సంగీత పరికరాలను ధ్వంసం చేస్తారు. నిజ జీవితంలో 1987లో జరిగిన ఒక సంఘటన నుండి స్ఫూర్తి పొందిన ఈ కథలో, పంక్ సమూహం తమను రక్షించుకోవడానికి ఒక రక్షణ వ్యూహాన్ని రూపొందిస్తుంది. ఇది 1987లో గిల్మన్ వద్ద జరిగిన నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. మిగతా కథల విషయానికి వస్తే …
డోంట్ ఫైట్ ది ఫీలింగ్
ఈ కథ బార్బీ, ఎంటైస్ చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు నాజీలచే బెదిరింపులకు గురవుతారు. అంతేకాకుండా ఒక ఐస్ క్రీమ్ షాప్‌లో పనిచేస్తున్నప్పుడు ఒక పోలీసు అధికారి చేత వేధింపులకు కూడా గురవుతారు. ఆతరువాత ఒక సినిమాగోయర్ థియేటర్లో ఒక ప్రదర్శనకు ఆహ్వానిస్తాడు. స్టేజ్‌పై ఒక శక్తివంతమైన ప్రదర్శన ఇచ్చి, ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఈ కథ 1988లో జరిగిన నిజమైన సంఘటనల నుండి స్ఫూర్తి పొందింది.
బోర్న్ టు మాక్
ఇందులో క్లింట్ ఒక మాజీ నేరస్థుడు. తన భార్య గర్భవతి కావడంతో, క్రిమినల్ జీవితం నుండి బయటపడాలని కోరుకుంటాడు. ఈ సమయంలో, అతని శత్రువు ప్రతీకారంతో అతని భార్యను హత్య చేస్తాడు. కానీ క్లింట్ తన బిడ్డ బతికి ఉన్నాడని తెలుసుకుంటాడు. ఈ కథ 1980ల ఒక్లాండ్ లో జరిగింది.
ది లెజెండ్ ఆఫ్ స్లీపీ ఫ్లాయిడ్
1987 మే 10న స్లీపీ ఫ్లాయిడ్, లాస్ ఏంజిల్స్ లేకర్స్‌పై రికార్డు స్థాయిలో 29 పాయింట్లు సాధించిన ఫుట్ బాల్ గేమ్‌ను ఆడుతాడు. ఈ సమయంలో, నాజీ గ్యాంగ్ నాయకుడు ట్రావిస్ అతని ఇంటిపై దాడి చేసి, అతని స్నేహితురాలిని హత్య చేస్తాడు. పంక్‌ల నుండి సమాచారం పొందిన ఫ్లాయిడ్, అతీంద్రియ మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాలతో ప్రతీకారం తీర్చుకుంటాడు.
Read Also : 7 నుంచి 17 ఏళ్ళున్న అమ్మాయిలే టార్గెట్… ఊహించని మలుపులు… థ్రిల్లింగ్ క్రైమ్ థ్రిల్లర్