E-Paper
Advertisement

డార్క్ ఎక్స్పరిమెంట్స్ తో దిమ్మతిరిగే సీన్స్ మావా…. ‘ది బాయ్స్’కు మించిన టీన్ సిరీస్

డార్క్ ఎక్స్పరిమెంట్స్ తో దిమ్మతిరిగే సీన్స్ మావా…. ‘ది బాయ్స్’కు మించిన టీన్ సిరీస్
Advertisement

Action Thriller Series : ఇంటెన్స్ యాక్షన్, రక్తంతో స్క్రీన్ తడిసిపోయే బ్లడీ బాత్ సిరీస్ లు, సినిమాలు ఇటీవల కాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి. అందులో భాగంగానే ‘ది బాయ్స్’ అనే సూపర్ హీరో సిరీస్ ఓటీటీని ఊపేసింది. పేరుకే సూపర్ హీరో సిరీస్ గానీ, అందులో ఉండే యాక్షన్ సీన్స్, రక్తపాతాన్ని చూస్తే కొంతమందికి వెగటు పుట్టవచ్చు కూడా. ఒకవేళ మీకు గనుక ఈ సిరీస్ నచ్చిందా ? అయితే ఈరోజు మన మూవీ సజెషన్ కూడా మీకు తప్పకుండా నచ్చుతుంది. ఈ సిరీస్ పేరు ‘Gen V’. ఈ అమెరికన్ సూపర్‌హీరో వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా భారీ హిట్ సాధించిన ప్రసిద్ధ సిరీస్ ‘ది బాయ్స్’ (The Boys) కి స్పిన్-ఆఫ్‌గా వచ్చింది. మరి ఈ సిరీస్ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? స్టోరీ ఏంటి ? అనే వివరాలపై ఒక లుక్కేద్దాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ కథ కేవలం సూపర్‌ హీరోల కథలా కాకుండా, యంగ్ సూపర్‌ హీరోల కాలేజ్ లైఫ్, కార్పొరేట్ రాజకీయం చుట్టూ తిరుగుతుంది. అమెరికాలో ఉన్న సూపర్‌ హీరోల కోసం ప్రత్యేకంగా ఒక యూనివర్సిటీ ఉంటుంది. ‘వోట్ ఇంటర్నేషనల్’ అనే పెద్ద కంపెనీ ‘గాడోల్కిన్ యూనివర్సిటీ’ అనే ప్రత్యేక కాలేజీని నడుపుతుంది. ది బాయ్స్’ సిరీస్ లో చూపించిన ‘కాంపౌండ్ V’ అనే కెమికల్ వల్ల పుట్టుకతోనే సూపర్ పవర్స్ వచ్చిన యువతీ యువకులకు ఇక్కడ చదువుకునే అవకాశం కల్పిస్తారు.

Advertisement

ఈ సిరీస్ లో లేడీ హీరో పేరు మారీ మోరో. తన సొంత రక్తాన్ని ఆయుధంగా మార్చగల అద్భుతమైన పవర్ ఉంటుంది మారీకి. ఆ అమ్మాయి కూడా ఇదే కాలేజీలో అడుగు పెడుతుంది. టాప్ ర్యాంక్ తెచ్చుకుని, వోట్ కంపెనీ లీగ్ ‘ది సెవెన్’ (The Seven) లో మెంబర్ అవ్వాలనేది ఆమె టార్గెట్. కాలేజీలో చేరిన కొద్దిరోజులకే ఆమెకు ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. అక్కడ జరిగే కొన్ని అనుమానాస్పద మరణాలు, సంఘటనల వల్ల మారీ, ఆమె ఫ్రెండ్స్‌ అసలు విషయం ఏమిటో బోధపడుతుంది.

ఆ కాలేజీ కింద ‘ది వుడ్స్’ అనే ఒక సీక్రెట్ ల్యాబ్ ఉందని మారీ టీం కనిపెడుతుంది. అక్కడ యంగ్ సూపర్‌ హీరోలపై క్రూరమైన ప్రయోగాలు చేయడాన్ని చూసి దిగ్భ్రాంతికి గురవుతారు. వోట్ కంపెనీ చేస్తున్న ఈ ఘోరాలను బయట పెట్టడానికి మారీ గ్యాంగ్ ప్రయత్నాలు మొదలు పెడుతుంది. ఈ క్రమంలో విద్యార్థులె గ్రూపులు విడిపోయి, ఒకరిపై ఒకరు పవర్స్ తో దాడి చేసుకునే యుద్ధ వాతావరణం నెలకొంటుంది. చివరకు వోట్ కంపెనీ ఆ రహస్యాన్ని బయట పడకుండా ఉండడానికి ఏం చేసింది ? మారీ, ఆమె ఫ్రెండ్స్ ఎలాంటి ఇబ్బందుల్లో పడ్డారు ? అనేదే ఈ సిరీస్ కథ. ఈ సిరీస్‌ను Amazon Prime Video లో చూడవచ్చు. ఒరిజినల్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది. ఇది పెద్దలు మాత్రమే చూడాల్సిన సిరీస్ అని గుర్తు పెట్టుకోండి. ఇందులో తీవ్రమైన హింస, రక్తపాతం, అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ మొత్తం రెండు సీజన్లుగా వచ్చింది.

Advertisement

Read Also: మత్తులో మర్మయిడ్ ను పట్టుకొచ్చే అడిక్ట్… ఈ కామెడీ హర్రర్ థ్రిల్లర్ ను డోంట్ మిస్

Related News

ప్రపంచం అంతమయ్యాక మొదలయ్యే ఎమోషనల్ సర్వైవల్ మూవీ… డోంట్ మిస్

కోట్ల రూపాయలు కొల్లగొట్టింది… కట్ చేస్తే ప్రాణాల కోసం పరుగో పరుగు… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

ఫేక్ పోలీసులుగా వెళ్ళి డ్రగ్ డీలర్లనే దోచేశారు… కానీ ఒక్క తప్పుతో ప్రాణాల మీదకు… డెడ్లీ క్రైమ్ థ్రిల్లర్

ఫ్యామిలీ మిస్టరీ సాల్వ్ చేయడానికి బ్రెయిన్ సైంటిస్ట్ ప్రయోగం… అంతలోనే సీన్ రివర్స్… ఓటీటీలో డిఫరెంట్ కొరియన్ సై-ఫై థ్రిల్లర్

 స్పేస్ స్టేషన్‌లో ఘోర ప్రమాదం… భూమికి తిరిగొచ్చేసరికి కూతురే మారిపోయింది మావా

ఒక్క ఇంజెక్షన్ తో మల్టీవర్స్ లోకి… పెళ్ళాం కాని పెళ్ళాంతో కాపురం… మైండ్‌బ్లోయింగ్ సై-ఫై థ్రిల్లర్

టైమ్ ట్రావెల్ చేసి మరీ చావగొట్టే సైకో… మైండ్‌బెండింగ్ థ్రిల్లర్

చనిపోయిన బిడ్డను తిరిగి తెచ్చే నానీ… ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక వెన్నులో వణుకు పుట్టించే వింతలు

Big Stories

Advertisement
×